వంశీ రచనలకు వర్ణనలకు అభిమానిని!కానీ ఎక్కడో వెలితి ఈ బుక్ లో!పేరుకే నల్లమిల్లోరి పాలెం..కానీ మదరాసు వెళతాడు,ఒరిస్సా వెళతాడు..!అందుకే బుక్ లో మా పసలపూడి కథలు,దిగువ గోదారి కథల్లో వుండే ప్యూరిటీ లోపించింది..చాలా తక్కువ కాల్ షీట్స్ ఇచ్చాడు అంటూ మల్లికార్జున రావు మదరాసు జీవితం గురించి ఇందులో చేర్చడం ఎందుకో అర్థం కాదు. ఎక్కువగా వంశీగారి ఫేస్ బుక్ పేజీలో చదివినవి ఉన్నాయి. అదే ఫేస్ బుక్ లోనే ఎక్కడో "ఒక భార్గవి"అనే పుస్తకం గురించి చెప్పాడని,వంశీ గారు రెఫర్ చేశారంటే గొప్పగానే ఉంటుందని ఆ బుక్ కూడా ఈ బుక్ తో పాటే తెప్పించాను("ఒక భార్గవి"అనుకోని "ఒక భార్గవి-రెండు ప్రయాణాలు" తెప్పించానని బుక్ చూశాక అర్థం అయిందనుకోండి అది వేరే విషయం..)కానీ ఆ భార్గవి గారి రచనా సామర్ధ్యం తెలియడానికి ఇది చాలు..ఇది చదివాక ఆమెగారి ఏ బుక్కూ చదవాల్సిన అవసరం రాదు. అందుకే రెండూ ఒకేసారి తెప్పించా కాబట్టి..కేవలం వంశీ గారు చెప్పారనే కొన్నాను కాబట్టి ఇద్దరూ ఫీల్ అవకుండా రెంటినీ కలిపి మా ఆఫీసు పక్కన చెత్తా చెదారం వేసే చెరువు లాంటి దిబ్బలో పడేశాను..
© 2017,www.logili.com All Rights Reserved.