నేను నా జీవితంలోని అనుభవాలను - అనుభూతులను- సంగటనలను ఇతివృతాలుగా తీసుకుని కథలుగా మలచుకుంటూ ఉంటాను. సాధారణమైన వ్యవహారిక భాషలో వ్రాస్తుంటాను. ఇంతకు పూర్వం నా కథా సంపుటాలుబీ మౌన ప్రోటం , 2. అనుమానం కాటేసిన వేళ, 3. శేష ప్రశ్నబీ వెలువడ్డాయి. ఒక నవల మానస బాంధవ్యం వెలువడింది. అందులో సాధారణ కథలే ఎక్కువగా వ్రాశాను. కానీ ఈ కథా సంకలనంలో ఎక్కువగా ముస్లిమ్ కుటుంబ నేపథ్య కథలు వ్రాయటం జరిగింది. ఇక్కడ ఒక విషయం విన్నవించుకోవాలి. మనదేశంలో లేదా మన సమాజంలో ముస్లిమ్ కుటుంబ నేపథ్య కథలంటూ వేరుగా ఉండవు. భాషలు వేరయినా కుటుంబ వ్యవహారాలు - సాంప్రదాయాలు -అలవాట్లు ఒకేలా ఉంటాయి. మహిళల జీవిత స్థితిగతులు కూడా అందుకు భిన్నంగా ఉండవు. సమాజంలోని వ్యక్తుల జీవిత విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. సమాజంలో అంతర్భాగమై జీవితాలను కొనసాగిస్తున్నారు. పిల్లల సమస్యలు ఆడపిల్లల పెళ్లిళ్లు- సమస్యలు కొడుకు కోడళ్ల ప్రవర్తనలు - తల్లిదండ్రుల పట్ల అనాదరణ మతాలకు అతీతంగా ఉండవు. మతాచారాలను మూఢాచారాలుగా విమర్శించడం సమంజసం కాదు. ధార్మిక ధర్మ శాస్త్రాలు ఎప్పుడూ మనుషులను సన్మార్గం వైపున నడిపిస్తాయి. జీవితపు విలువలను తెలపుతాయి.
ఈ పుస్తకం ప్రచురించటానికి ప్రోత్సహించి, అన్ని విధాల తోడ్పడిన సోదరుడు ముహమ్మద్ ముజాహిదకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతాభివంనాలు. ఇంకా ఈ పుస్తకం తయారవ్వడానికి సహకరించిన సహృదయులైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరు నా హ దయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కథా సంకలనంలోని కథలను ప్రచురించిన 'గీటురాయి' 'అనుపమ' సంపాదక వర్గానికి ధన్యవాదాలను తెలియజేసు కుంటున్నాను.
శుభాభివందనములతో..
మీ సోదరి షహనాజ్,
అనంతపురం
© 2017,www.logili.com All Rights Reserved.