వానరం నరవానరం నరునిగా మారడం ఎదో ఒక వారం పదిరోజుల్లో జరిగింది కాదు. లక్షల సంవత్సరాల మహా సంగ్రామం అది. మానవ జాతులు సంఘర్షిస్తూ సాధించుకున్ననాగరికత కూడా అంతే! ప్రక్రుతి పై పోరాటం క్రూర జంతువులతో కుమ్ములాట మనిషి మనిషితో యుద్ధం కనికరం ఎరుగని కఠోర జీవనం కర్కశంగా కబళించాలని చూసే కాలం... ఇన్ని అవరోధాల పై అలుపెరుగని యుద్ధం చేసి ఆదిమ మానవులు సాధించిన విజయమే నాగరికత. ఎన్ని తేగల తలలు తెగిపడితే ఎందరి రక్తం ఏరులా పారి ఈ నెల నానితే ఈ నాగరిక జీవనం మనకు దక్కిందో! 50 లక్షల ఏళ్ళు సుదీర్ఘ మానవ జాతుల మహోన్నత పోరాటాల్ని నాగరికతను మలుపుతిప్పిన మహా యుద్ధాల్ని హాలీవుడ్ చిత్రంలా మీ కళ్లముందుంచే పదిమంది మహాయోధుల కాదనజీవితాల్ని తెలుపుతూ.. తెలుగులో వచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది!
- బొర్రా గోవర్ధన్