మనుషులు పేదవాడు కావచ్చు. కానీ హృదయానికి పేదరికం లేదని చాటి చెప్పడమే ఈ కథల్లోని ప్రధాన ఉద్దేశ్యము. ముస్లిములలో కలిసిమెలసి తిరగడమే తప్ప, అత్యంత సన్నిహితంగా, వారి జీవన సరళిని గమనిస్తే తప్ప ఇట్లాంటి కథలు ఎవరూ రాయలేరు. దారిద్ర్యరేఖకు దిగువున వున్నా శ్రమజీవుల జీవితాలను యధావిధిగా ఈ రచయితా తన కథల్లో చిత్రించడం చాలా విశేషం.
- షేక్ హుస్సేన్ సత్యాగ్ని
ఈ కథల్లో బీబీ అమ్మ ఫాతిమా పాత్రలు గొప్ప తల్లులు. అవి అంట సహజంగా ఉండేలా చేయడం అతని కళాత్మకత. నటరాజ్ వ్యక్తిగత జీవితం ముస్లిములలో పీపల్ కా నీం లా పెనవేసుకుని వుండడం వలన ఎన్నో మంచి మంచి ముస్లిం పాత్రలు తెలుగు కథా సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ఈ కథల్లో ఎంతో విశాలత్వము, అపరిమితమైన ప్రేమ, హృదయాలను కదిలించే మానవ సంబంధాలు వున్నాయి... మతాలకు అతీతంగా మంచి పాత్రల సంగమం, మంచి ముస్లిం కథల సమాహారం, నేస్తం! నీ గురుతు! సహానుభూతిలో సంఘీభావంతో సమన్వయంగా సామరస్యంగా సృజించిన మా మంచి కధకుడు నటరాజ్ కు ఇదే నా అక్షరాల అలాయిబలాయి.
- బా రహమతుల్లా
మనుషులు పేదవాడు కావచ్చు. కానీ హృదయానికి పేదరికం లేదని చాటి చెప్పడమే ఈ కథల్లోని ప్రధాన ఉద్దేశ్యము. ముస్లిములలో కలిసిమెలసి తిరగడమే తప్ప, అత్యంత సన్నిహితంగా, వారి జీవన సరళిని గమనిస్తే తప్ప ఇట్లాంటి కథలు ఎవరూ రాయలేరు. దారిద్ర్యరేఖకు దిగువున వున్నా శ్రమజీవుల జీవితాలను యధావిధిగా ఈ రచయితా తన కథల్లో చిత్రించడం చాలా విశేషం. - షేక్ హుస్సేన్ సత్యాగ్ని ఈ కథల్లో బీబీ అమ్మ ఫాతిమా పాత్రలు గొప్ప తల్లులు. అవి అంట సహజంగా ఉండేలా చేయడం అతని కళాత్మకత. నటరాజ్ వ్యక్తిగత జీవితం ముస్లిములలో పీపల్ కా నీం లా పెనవేసుకుని వుండడం వలన ఎన్నో మంచి మంచి ముస్లిం పాత్రలు తెలుగు కథా సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ఈ కథల్లో ఎంతో విశాలత్వము, అపరిమితమైన ప్రేమ, హృదయాలను కదిలించే మానవ సంబంధాలు వున్నాయి... మతాలకు అతీతంగా మంచి పాత్రల సంగమం, మంచి ముస్లిం కథల సమాహారం, నేస్తం! నీ గురుతు! సహానుభూతిలో సంఘీభావంతో సమన్వయంగా సామరస్యంగా సృజించిన మా మంచి కధకుడు నటరాజ్ కు ఇదే నా అక్షరాల అలాయిబలాయి. - బా రహమతుల్లా
© 2017,www.logili.com All Rights Reserved.