విదేశీ కథా సాహిత్యం నుండి మహిళలు రాసిన కథలను తెలుగు పాఠకులకు అందించే అనువాద కథల సంపుటికి 'ఓ నగరం కథ' శీర్షిక ఔచిత్యంగా ఉంది. రష్యన్, స్వీడిష్, ఉక్రెయిన్, వియాత్నం, జపనీస్, లెబనాస్, పోలిష్, అమెరికన్, ఇంగ్లిషు భాషా కథానువాదాలు ఇందులో ఉన్నాయి. పలు భాషల్లో ప్రావీణ్యతగల రచయిత ఈ అనువాద ప్రక్రియలో ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలను అనుసంధాన భాషలుగా ఉపయోగించుకోవడానికి అదనపు సౌకర్యంగా జతకూడింది.
ఒంటరితనం, బెదరికం, ప్రేమరాహిత్యం, యుద్ధాలు మిగిల్చిన విషాదాలు, విద్రోహ, విరోధ ద్వేషాలు సృష్టించిన దారుణాలు, చిన్ని ఆశారేఖలు, భ్రమలు, బలహీనతలు, నిస్సహాయత, మనసుని చితక్కొట్టే మోసాలు, నాజూకు భావనల్ని నలిపేసే నయవంచన, వెంటాడి వేటాడే శాడిజం, దోపిడీకి, దురాగతాలకి, వివక్షకి పలు పార్శ్వాలు. వీటన్నిటికీ బలి తల్లులు, పిల్లలు. దేశం ఏదైనా సుఖదుఃఖాలు, కష్టనష్టాల సమతూకం ఒకటేనేమో! అనిపించే జీవితాలు. ఆర్ద్రత నిండిన అంతరంగ చిత్రణ ఈ 'ఓ నగరం కథ'. కారుణ్యం నిండిన కథనాలను ఎంపిక చేసుకోవడం అనువాదకుని కరుణాంతరంగానికి ప్రతీక.
విదేశీ కథా సాహిత్యం నుండి మహిళలు రాసిన కథలను తెలుగు పాఠకులకు అందించే అనువాద కథల సంపుటికి 'ఓ నగరం కథ' శీర్షిక ఔచిత్యంగా ఉంది. రష్యన్, స్వీడిష్, ఉక్రెయిన్, వియాత్నం, జపనీస్, లెబనాస్, పోలిష్, అమెరికన్, ఇంగ్లిషు భాషా కథానువాదాలు ఇందులో ఉన్నాయి. పలు భాషల్లో ప్రావీణ్యతగల రచయిత ఈ అనువాద ప్రక్రియలో ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలను అనుసంధాన భాషలుగా ఉపయోగించుకోవడానికి అదనపు సౌకర్యంగా జతకూడింది. ఒంటరితనం, బెదరికం, ప్రేమరాహిత్యం, యుద్ధాలు మిగిల్చిన విషాదాలు, విద్రోహ, విరోధ ద్వేషాలు సృష్టించిన దారుణాలు, చిన్ని ఆశారేఖలు, భ్రమలు, బలహీనతలు, నిస్సహాయత, మనసుని చితక్కొట్టే మోసాలు, నాజూకు భావనల్ని నలిపేసే నయవంచన, వెంటాడి వేటాడే శాడిజం, దోపిడీకి, దురాగతాలకి, వివక్షకి పలు పార్శ్వాలు. వీటన్నిటికీ బలి తల్లులు, పిల్లలు. దేశం ఏదైనా సుఖదుఃఖాలు, కష్టనష్టాల సమతూకం ఒకటేనేమో! అనిపించే జీవితాలు. ఆర్ద్రత నిండిన అంతరంగ చిత్రణ ఈ 'ఓ నగరం కథ'. కారుణ్యం నిండిన కథనాలను ఎంపిక చేసుకోవడం అనువాదకుని కరుణాంతరంగానికి ప్రతీక.© 2017,www.logili.com All Rights Reserved.