'ఋతుసంక్రమణం'లోని కథలను చదువుతుండగా వేరు వేరు కారణాలకై ఈ కథలు నాలో ఆశ్చర్యాన్ని, మెప్పుదలను కలిగించడం నిజం. ఈ కథా రచయిత తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి, సమాజం నుంచే తన కథలకు కావలసిన ముడి సరుకును స్వీకరిస్తారని అర్థమవుతుంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఎటువంటి కల్పితాలకు తావివ్వకుండా వాస్తవికంగా చిత్రించటంలోనే ఈయన ఎంతటి ప్రతిభావంతుడో అర్థమవుతుంది. ఈ కథలన్నీ మనసును తాకుతాయనటంలో సందేహం లేదు. కొన్ని కథలైతే మనల్ని వెంటాడుతాయి. వేధిస్తాయి. మనస్సును అల్లకల్లోపరుస్తాయి.
ప్రభుగారు సంవేదనాశీలా రచయిత అని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఆయన స్త్రీసంవేదనను చిత్రించిన విధానం. ఈ సంకలనంలోని బహుపాలు కథలు స్త్రీపాత్ర కేంద్రితమైనవి. ఇందులో అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. పాఠశాల విద్యార్థి, ఉపాధ్యాయురాలు, బాలింత, ముసలితల్లి, శోకభరితురాలైన మాతృమూర్తి, పనిమనిషి, పరిత్యక్త, ఆదర్శసోదరి, ఆదర్శపత్ని, బాధితురాలు.. ఇలా ఇందులోని పాత్రల మానసికవ్యధలను, దైహిక బాధలను బహిర్గతపరిచి అందుకు కారణమైన సామాజిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషణకు గురిచేసే ఈ రచయిత ఇక్కడ ఏది సమంజసమో, ఏది అసమంజసమో అనే నిర్ణయాన్ని పాఠకులే వదిలేస్తారు. సాధారణంగా కనిపించే అసాధారణమైన కథలివి.
'ఋతుసంక్రమణం'లోని కథలను చదువుతుండగా వేరు వేరు కారణాలకై ఈ కథలు నాలో ఆశ్చర్యాన్ని, మెప్పుదలను కలిగించడం నిజం. ఈ కథా రచయిత తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి, సమాజం నుంచే తన కథలకు కావలసిన ముడి సరుకును స్వీకరిస్తారని అర్థమవుతుంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఎటువంటి కల్పితాలకు తావివ్వకుండా వాస్తవికంగా చిత్రించటంలోనే ఈయన ఎంతటి ప్రతిభావంతుడో అర్థమవుతుంది. ఈ కథలన్నీ మనసును తాకుతాయనటంలో సందేహం లేదు. కొన్ని కథలైతే మనల్ని వెంటాడుతాయి. వేధిస్తాయి. మనస్సును అల్లకల్లోపరుస్తాయి. ప్రభుగారు సంవేదనాశీలా రచయిత అని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఆయన స్త్రీసంవేదనను చిత్రించిన విధానం. ఈ సంకలనంలోని బహుపాలు కథలు స్త్రీపాత్ర కేంద్రితమైనవి. ఇందులో అన్ని వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారు. పాఠశాల విద్యార్థి, ఉపాధ్యాయురాలు, బాలింత, ముసలితల్లి, శోకభరితురాలైన మాతృమూర్తి, పనిమనిషి, పరిత్యక్త, ఆదర్శసోదరి, ఆదర్శపత్ని, బాధితురాలు.. ఇలా ఇందులోని పాత్రల మానసికవ్యధలను, దైహిక బాధలను బహిర్గతపరిచి అందుకు కారణమైన సామాజిక, కౌటుంబిక పరిస్థితులను విశ్లేషణకు గురిచేసే ఈ రచయిత ఇక్కడ ఏది సమంజసమో, ఏది అసమంజసమో అనే నిర్ణయాన్ని పాఠకులే వదిలేస్తారు. సాధారణంగా కనిపించే అసాధారణమైన కథలివి.© 2017,www.logili.com All Rights Reserved.