ఆత్మ కధాంశాల ఉత్తరాలు
కొంతమంది పాటకులు నన్ను "ఆత్మకధ రాయండి, ఆత్మ కదా రాయండి" అంటారు. ఉద్యమకారులైతే, ఆ విశేషాలతో, ఆ అనుభవాలతో రాస్తారు, రాయాలి. నాకు అంత విశేషాలేముంటాయి? ఐదో పదో కధలు రాసినంత మాత్రాన ఆత్మ కధలు రాసేయ్యడమేనా? ఇప్పుడా పాత ఉత్తరాలు చదివితే, అవన్నీ పాత సంగతులు కొన్ని చెపుతున్నాయి కదా, అవసరమైన చోట్ల కొన్ని పుట్ నోట్స్ కూడా చేర్చి ఆ ఉత్తరాల్ని చిన్న పుస్తకంగా ఇస్తే? - అదీ ఆలోచన. ఈ ఆలోచన కొన్నాళ్ళు సాగి సాగి గట్టిపడింది.
చీము నెత్తురు లేనట్టు బతికే ఆడ వాళ్ళని చీదరించుకుంటూ, నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటాను గాని, నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తూ వుంటుంది. పదేళ్ళు నరకంలో ఎందుకు కొట్టుకున్నాను ? కానీ అంత జ్ఞానం ఎక్కడ ఉంది అప్పుడు? ఎం నేర్పారు చిన్నప్పట్నించి మా వాళ్ళు, బంధువులు, బళ్ళో పాటాలు, సినిమాలు, మొత్తం లోకం అంతా ? కానీ,అన్ని ఎవరో నేర్పాలా? నా స్వంత జ్ఞానం ఏమైంది? నా భుద్దీ, నా సిగ్గు ఏమయ్యాయి ? అంత భుద్దీ ఎడిసిందా నాకు అప్పుడు? - అంటే, నేను అందరు అడ మూర్ఖుల లాంటి దాన్నే అప్పుడు. అజ్ఞానం, చేతగానితనం, బుద్దిలేనితనం. ఆ తనాలెన్నో ఉన్న దాన్నే అప్పుడు. నన్ను నేను తిట్టుకుంటాను గాని, అప్పుడు నిజంగా నాకు దారి లేదు.
ఎప్పటికో వచ్చింది తెగింపు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ నా ఉత్తరాల్లో ఉన్నాయి. అవసరమైన చోట్ల పుట్ నోట్లు కూడా రాశాను.
ఆత్మ కధాంశాల ఉత్తరాలు కొంతమంది పాటకులు నన్ను "ఆత్మకధ రాయండి, ఆత్మ కదా రాయండి" అంటారు. ఉద్యమకారులైతే, ఆ విశేషాలతో, ఆ అనుభవాలతో రాస్తారు, రాయాలి. నాకు అంత విశేషాలేముంటాయి? ఐదో పదో కధలు రాసినంత మాత్రాన ఆత్మ కధలు రాసేయ్యడమేనా? ఇప్పుడా పాత ఉత్తరాలు చదివితే, అవన్నీ పాత సంగతులు కొన్ని చెపుతున్నాయి కదా, అవసరమైన చోట్ల కొన్ని పుట్ నోట్స్ కూడా చేర్చి ఆ ఉత్తరాల్ని చిన్న పుస్తకంగా ఇస్తే? - అదీ ఆలోచన. ఈ ఆలోచన కొన్నాళ్ళు సాగి సాగి గట్టిపడింది. చీము నెత్తురు లేనట్టు బతికే ఆడ వాళ్ళని చీదరించుకుంటూ, నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటాను గాని, నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న వేధిస్తూ వుంటుంది. పదేళ్ళు నరకంలో ఎందుకు కొట్టుకున్నాను ? కానీ అంత జ్ఞానం ఎక్కడ ఉంది అప్పుడు? ఎం నేర్పారు చిన్నప్పట్నించి మా వాళ్ళు, బంధువులు, బళ్ళో పాటాలు, సినిమాలు, మొత్తం లోకం అంతా ? కానీ,అన్ని ఎవరో నేర్పాలా? నా స్వంత జ్ఞానం ఏమైంది? నా భుద్దీ, నా సిగ్గు ఏమయ్యాయి ? అంత భుద్దీ ఎడిసిందా నాకు అప్పుడు? - అంటే, నేను అందరు అడ మూర్ఖుల లాంటి దాన్నే అప్పుడు. అజ్ఞానం, చేతగానితనం, బుద్దిలేనితనం. ఆ తనాలెన్నో ఉన్న దాన్నే అప్పుడు. నన్ను నేను తిట్టుకుంటాను గాని, అప్పుడు నిజంగా నాకు దారి లేదు. ఎప్పటికో వచ్చింది తెగింపు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ నా ఉత్తరాల్లో ఉన్నాయి. అవసరమైన చోట్ల పుట్ నోట్లు కూడా రాశాను.© 2017,www.logili.com All Rights Reserved.