'పరామర్శ' వ్యాసాల్లో తెలంగాణ అస్తిత్వ చైతన్యం ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఆంధ్ర మహాసభల దగ్గర నుంచి మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ దశ దాకా చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. నిజాం నాటి ఆంధ్ర జన సంఘాల సాహితీమేఖల సంస్థలతో సహా ఇప్పటి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భాగం పంచుకున్న తెరవే, తెసాస, సింగిడి, రచనల చెరువు, సాహిత్య సంస్థలదాకా ముఖ్య విషయాలు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు నక్క హరిక్రిష్ణ. అదే విధంగా తెలంగాణ మట్టి నుంచి వెల్లివిరుస్తున్న ఈ చైతన్యానికి మూలాలను వివరించటానికి రచయిత సంకల్పించాడు.