గ్రామీణ జీవిత ప్రాతినిధ్య కథలు
డాక్టర్ నక్కా విజయరామరాజుగారు 'భట్టిప్రోలు కథలు'తో హఠాత్తుగా పొద్దు పొడిచిన రచయితకాదు. సూర్యోదయానికి ముందుగా అరుణోదయం, తపనోదయం జరిగినట్లు కొన్ని కథలు రాసి కాస్త పదునుపెట్టుకొన్నారు. రచయితగా చక్కటి ఆవిర్భావం 'భట్టిప్రోలు కథల తోనే. ఒక చిన్న గ్రామంలోని వ్యక్తులలో ఎన్నెన్ని దృక్పథాలను, స్వభావాలను, జీవిత అనుభవాలను రాజుగారు గమనించారో! చిన్న కాన్వాస్పైన విశాల చిత్రాన్ని ఆవిష్కరింపచేశారు. రాజుగారి కథలకు రంగస్థలం భట్టిప్రోలు. రాజుగారు మానవ స్వభావ చిత్రణ రచయిత.
విజయరామరాజుగారిది సొంతూరు గుంటూరుజిల్లా నుండి యిటీవలే బాపట్ల జిల్లాలకు, చిరునామా మార్చుకొన్న భట్టిప్రోలు గ్రామం. ప్రాచీన భారతవర్షంలో ప్రతీపాలపురం, ఎప్పుడో క్రీస్తునాట బౌద్ధస్తూపం ఉండటంతో జాతీయ వారసత్వ సంపదగల గ్రామంగా రికార్డుకెక్కిన గ్రామం.
విజయరామరాజుగారికి పరిశీలన అంటే యిష్టం. చిన్నప్పటి నుండి అది యిదీ అనేక మొక్కలు మోళ్లు, పిట్టలు, జంతువులు, మనుషులు, మెట్టలు మాగాళ్లు, గోడలు, దిబ్బలు - సజీవ నిర్జీవ తేడా లేకుండా ప్రతిదాన్నీ శోధనగా చూడటం రాజుగారి నైజం. ఇప్పటికీ రాజుగారు ఏదైనా ఊరు వెళ్తే, ఆ ఊరి గోడలు వాటికేసిన రంగులు, ప్రకటనలు పరీక్షగా చూస్తూంటారు. 'అదేమిటయ్యా??' అంటే, 'వాటి ద్వారా ఊరి నాగరికతను అంచనా కట్టొచ్చు' అంటారు. ఆ గుణమే రాజుగారిని రచయితని చేసింది.
****
"పదిమైళ్ళకి పలుకుతీరు మారుతుంది" అని అర్థమొచ్చే సామెత హిందీలో ఉందట. ఒక జిల్లాలో ఒకే రకమైన మాండలికం వాడుకలో ఉంటుందనుకోవటం పొరపాటు. పాత గుంటూరు జిల్లాలో (నేటి గుంటూరు, పల్నాడు జిల్లాలు, బాపట్ల జిల్లాలో ముప్పాతిక భాగం) ఎక్కడకక్కడ యాసలు, ఏ ప్రాంతానికా ప్రాంతం మాండలికాలు గోచరిస్తాయి.
తెనాలి, బాపట్ల, పొన్నూరు, గుంటూరు పట్టణాలలో ఓ రకం మాటతీరు; సత్తెనపల్లి పిడుగురాళ్ల నుండి పల్నాడు లోపలికి పోయేకొలది ఒక రకం మాటతీరు, రేపల్లె మండలం చీరాల వరకూ సముద్రతీరంలో నివాసం ఉండే పల్లెకారుల (బెస్తలు) పలుకుబడి ఒక తీరు./.......................
గ్రామీణ జీవిత ప్రాతినిధ్య కథలు డాక్టర్ నక్కా విజయరామరాజుగారు 'భట్టిప్రోలు కథలు'తో హఠాత్తుగా పొద్దు పొడిచిన రచయితకాదు. సూర్యోదయానికి ముందుగా అరుణోదయం, తపనోదయం జరిగినట్లు కొన్ని కథలు రాసి కాస్త పదునుపెట్టుకొన్నారు. రచయితగా చక్కటి ఆవిర్భావం 'భట్టిప్రోలు కథల తోనే. ఒక చిన్న గ్రామంలోని వ్యక్తులలో ఎన్నెన్ని దృక్పథాలను, స్వభావాలను, జీవిత అనుభవాలను రాజుగారు గమనించారో! చిన్న కాన్వాస్పైన విశాల చిత్రాన్ని ఆవిష్కరింపచేశారు. రాజుగారి కథలకు రంగస్థలం భట్టిప్రోలు. రాజుగారు మానవ స్వభావ చిత్రణ రచయిత. విజయరామరాజుగారిది సొంతూరు గుంటూరుజిల్లా నుండి యిటీవలే బాపట్ల జిల్లాలకు, చిరునామా మార్చుకొన్న భట్టిప్రోలు గ్రామం. ప్రాచీన భారతవర్షంలో ప్రతీపాలపురం, ఎప్పుడో క్రీస్తునాట బౌద్ధస్తూపం ఉండటంతో జాతీయ వారసత్వ సంపదగల గ్రామంగా రికార్డుకెక్కిన గ్రామం. విజయరామరాజుగారికి పరిశీలన అంటే యిష్టం. చిన్నప్పటి నుండి అది యిదీ అనేక మొక్కలు మోళ్లు, పిట్టలు, జంతువులు, మనుషులు, మెట్టలు మాగాళ్లు, గోడలు, దిబ్బలు - సజీవ నిర్జీవ తేడా లేకుండా ప్రతిదాన్నీ శోధనగా చూడటం రాజుగారి నైజం. ఇప్పటికీ రాజుగారు ఏదైనా ఊరు వెళ్తే, ఆ ఊరి గోడలు వాటికేసిన రంగులు, ప్రకటనలు పరీక్షగా చూస్తూంటారు. 'అదేమిటయ్యా??' అంటే, 'వాటి ద్వారా ఊరి నాగరికతను అంచనా కట్టొచ్చు' అంటారు. ఆ గుణమే రాజుగారిని రచయితని చేసింది. **** "పదిమైళ్ళకి పలుకుతీరు మారుతుంది" అని అర్థమొచ్చే సామెత హిందీలో ఉందట. ఒక జిల్లాలో ఒకే రకమైన మాండలికం వాడుకలో ఉంటుందనుకోవటం పొరపాటు. పాత గుంటూరు జిల్లాలో (నేటి గుంటూరు, పల్నాడు జిల్లాలు, బాపట్ల జిల్లాలో ముప్పాతిక భాగం) ఎక్కడకక్కడ యాసలు, ఏ ప్రాంతానికా ప్రాంతం మాండలికాలు గోచరిస్తాయి. తెనాలి, బాపట్ల, పొన్నూరు, గుంటూరు పట్టణాలలో ఓ రకం మాటతీరు; సత్తెనపల్లి పిడుగురాళ్ల నుండి పల్నాడు లోపలికి పోయేకొలది ఒక రకం మాటతీరు, రేపల్లె మండలం చీరాల వరకూ సముద్రతీరంలో నివాసం ఉండే పల్లెకారుల (బెస్తలు) పలుకుబడి ఒక తీరు./.......................© 2017,www.logili.com All Rights Reserved.