వైజాగ్ సిటీ కి 40 కిలోమీటర్ల దూరంలో ఒక బిల్డింగ్ దాని చుట్టూ ఒక ఎకరం స్థలం. చుట్టుపక్కల చాల ప్రశాంతంగా ఉంది, ఎకరం చుట్టూ గోడ కట్టి ఉంది. సముద్రపు అలల శబ్దం చిన్నగా వినిపిస్తోంది, చుట్టూ ఉన్న చెట్ల సముదాయముల వల్ల చల్లని గాలి వస్తోంది.
మూడు కార్స్ ఆ బిల్డింగ్ ముందు ఆగాయి, మొదటి కార్లోంచి ఒక 26 ఏళ్ళ యువకుడు దిగాడు, అతను వైజాగ్ లో ఉన్న తెర్మాస్ లో మెకానికల్ ఇంజనీర్ గ వర్క్ చేస్తున్నాడు. నెలకి 50 వేలు జీతం.
రెండవ కార్ నుంచి ఒక 24 ఏళ్ళు ఉన్న అమ్మాయి దిగింది, ఆమె బీటెక్ పూర్తి చేసి అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తోంది, నెలకి 40 వేలు జీతం తో.
మూడవ కార్ నుంచి ఒక రాజకీయ నాయకుడు దిగాడు, అతను సిటీ లో ఒక ఏరియా MLA, అతని ఆదాయం మనం చెప్పుకోలేనంత.
ముగ్గురు గేట్ దగ్గరకి వచ్చారు, సెక్యూరిటీ ఎవర్ని కలవాలి అని అడిగాడు, స్కూల్ చూడాలి అని చెప్పారు ముగ్గురూ, జైదేవ్ గారి పర్మిషన్ లెటర్ ఉందా అని అడిగాడు, ఎవరు అన్నారు ముగ్గురు
జైదేవ్ సూర్యనారాయణ వరప్రసాద్ జైదేవ్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని చెప్పాడు సెక్యూరిటీ.
ఆయన అన్ని ఇండస్ట్రీస్ లలో ఈ స్కూల్ ఒకటి దీన్ని చూడడానికి ఇక్కడ ఉండే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలి, పర్మిషన్ ఎందుకు అని అడిగింది ఆ అమ్మాయి.
మీరు చెప్పేది నిజమే కానీ ఇక్కడ అయన ఎక్కువ ఉంటారు లేదా తన బెస్ట్ ఫ్రెండ్ జోన్స్ ఉంటారు, వీళ్ళిద్దరూ లేనపుడు స్కూల్ ప్రిన్సిపాల్ ముస్తాక్ ఉంటారు. పిల్లలకి ఏదయినా అవసరం వచ్చిన పేరెంట్స్ కి స్కూల్ మీద ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు మీకు అన్ని వివరించి చెప్తారు.
అయినా స్కూల్స్ మీద అంత ఇంటరెస్ట్ దేనికో అది ఒక బిజినెస్ ఏ కదా వీళ్ళకి అని అన్నాడు ఆ అబ్బాయి..........
వైజాగ్ సిటీ కి 40 కిలోమీటర్ల దూరంలో ఒక బిల్డింగ్ దాని చుట్టూ ఒక ఎకరం స్థలం. చుట్టుపక్కల చాల ప్రశాంతంగా ఉంది, ఎకరం చుట్టూ గోడ కట్టి ఉంది. సముద్రపు అలల శబ్దం చిన్నగా వినిపిస్తోంది, చుట్టూ ఉన్న చెట్ల సముదాయముల వల్ల చల్లని గాలి వస్తోంది. మూడు కార్స్ ఆ బిల్డింగ్ ముందు ఆగాయి, మొదటి కార్లోంచి ఒక 26 ఏళ్ళ యువకుడు దిగాడు, అతను వైజాగ్ లో ఉన్న తెర్మాస్ లో మెకానికల్ ఇంజనీర్ గ వర్క్ చేస్తున్నాడు. నెలకి 50 వేలు జీతం. రెండవ కార్ నుంచి ఒక 24 ఏళ్ళు ఉన్న అమ్మాయి దిగింది, ఆమె బీటెక్ పూర్తి చేసి అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తోంది, నెలకి 40 వేలు జీతం తో. మూడవ కార్ నుంచి ఒక రాజకీయ నాయకుడు దిగాడు, అతను సిటీ లో ఒక ఏరియా MLA, అతని ఆదాయం మనం చెప్పుకోలేనంత. ముగ్గురు గేట్ దగ్గరకి వచ్చారు, సెక్యూరిటీ ఎవర్ని కలవాలి అని అడిగాడు, స్కూల్ చూడాలి అని చెప్పారు ముగ్గురూ, జైదేవ్ గారి పర్మిషన్ లెటర్ ఉందా అని అడిగాడు, ఎవరు అన్నారు ముగ్గురు జైదేవ్ సూర్యనారాయణ వరప్రసాద్ జైదేవ్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని చెప్పాడు సెక్యూరిటీ. ఆయన అన్ని ఇండస్ట్రీస్ లలో ఈ స్కూల్ ఒకటి దీన్ని చూడడానికి ఇక్కడ ఉండే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలి, పర్మిషన్ ఎందుకు అని అడిగింది ఆ అమ్మాయి. మీరు చెప్పేది నిజమే కానీ ఇక్కడ అయన ఎక్కువ ఉంటారు లేదా తన బెస్ట్ ఫ్రెండ్ జోన్స్ ఉంటారు, వీళ్ళిద్దరూ లేనపుడు స్కూల్ ప్రిన్సిపాల్ ముస్తాక్ ఉంటారు. పిల్లలకి ఏదయినా అవసరం వచ్చిన పేరెంట్స్ కి స్కూల్ మీద ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు మీకు అన్ని వివరించి చెప్తారు. అయినా స్కూల్స్ మీద అంత ఇంటరెస్ట్ దేనికో అది ఒక బిజినెస్ ఏ కదా వీళ్ళకి అని అన్నాడు ఆ అబ్బాయి..........పుస్తకం పేరు : పోటీ జనరస్ :సామజికం కుటుంబం ఇంకా జీవితం రచయిత : తేజోరామ్ చామర్తి పబ్లికేషన్ : తపస్వి మనోహరం కథనం : గెలుపు ఓటమి రెండు ఎప్పుడు ఎవరిని ఏ దరికి చేరుస్తాయో తెలీదు. ఎవరికీ ఏది సొంతం కాదు. వారి వారి నైపుణ్యలకి అనుగుణంగా వారి వారి సొంతం అవుతుంది. ముఖ్యంగా విద్యారంగం లో విధానాలు వాటి ప్రాముఖ్యత ఎవరిని ఎక్కడ నిలబెడుతుంది అన్నది ముఖ్య సారాంశం. అందులో వచ్చే పాత్రలు ఒక్కో సందేశాన్ని అందిస్తాయి. విజయం అన్నది అంకెల్లో కాదు నైపుణ్యంలో విలువల్లో అని చెప్పటానికి ఈ నవల చక్కని ఉదాహరణ. ప్రేమ లో ఉన్న బలం దూరంలో ఉన్న వేదన... అందులో నిజాయితీ వారిని ఓ దరి చేర్చిన తీరు.... అద్భుతం. పాత్రలు : కథనాయకుడు అన్నింటా ముందు ఉండేవాడు మాత్రమే కాదు అన్నిటిని ముందుకు నడిపేవాడు. తనదైన పద్దతిలో అన్ని కోణాల్లో ప్రతి అడుగుకి ఓ అర్థం చెప్పేవాడు. విద్య వృత్తి మాత్రమే జీవితం కాదు కుటుంబం..ప్రేమ.. నిజాయితీ...పోటీతత్వం ఇవన్నీ కలగలిపి ఉండటమే వాటిని సమానంగా సమతుల్యంగా కాపాడటం లోనే ఓ మనిషి గెలుపు ఉంటుంది అని నమ్మే వ్యక్తి..... ఇక కథకి ఉన్న ముఖ్యమైన దృవాలు ఇద్దరు సోదరీనులు. ఒకే కడుపునా పుట్టిన భిన్న ధ్రువలకి ఏమాత్రం తీసిపోరు. ఒకరి తీపి అయితే మరొకరు చేదు. అంతటి వత్యాసం అన్నిటిలోనూ. ఆఖరికి జీవితం లో ఏమ్ సంపాదించుకోవాలో అన్న విషయంలో కూడా ఇద్దరి మనస్తత్వాలు భూమిని ఆకాశాన్ని తలపిస్తాయి. స్నేహం కోసం ప్రాణం ఇవ్వగల మిత్రులు ఉన్నారు. అదే స్నేహం పేరుతో స్వార్థం గా స్నేహితులని బలి తీసుకున్న మిత్రులు ఉన్నారు. భిన్న మనస్తత్వలా మధ్య జరిగే ఓ యుద్ధం కనబడుతుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో. ప్రేమకై తమని తామే బలిగా ఇచ్చుకునే తత్త్వం ఒకవైపు ఉంటే.... ప్రేమకై ఎవర్ని అయినా బలితిసుకునే తత్త్వం మరో వైపు.... ఈ రెండు మనస్తత్వలలో ఏది విజయం సాధించింది..?? ఎన్ని గమనాలని దాటింది..?? ఎవరి సంఖ్య ఎవరిని ఎక్కడ నిలబెట్టింది..?? గెలుపు మాత్రమే కాదు ఓటమి కుడా ఓ అద్భుతమే అనటానికి నిదర్శనం ఏంటి?? విభిన్న సంస్కృతిలో పెళ్లి విధానం..?? ఇవన్నీ తెలియాలి అంటే కచ్చితంగా చదువ వలసిన నవల....***పోటీ*** ఇక రచన శైలి రచయిత గురించి : రచన శైలి లోనే మనం చదువుతున్న ప్రతి సన్నివేశం అల జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఎంచుకున్న అంశానికి 100% న్యాయం చేయగలిగారు. పాత్రల తీరు నడిపించిన విధానం చాలా బావుంది. మీ కలం నుండి **జారిన ఓ అందమైన సామజిక దృక్పధ అల్లిక ఈ నవల ** ఇలానే మీ ✍️✍️నుండి మరిన్ని రచనలు రావాలని కాంక్షిస్తున్నాము... గమనిక : ఇది వ్యక్తిగత విశ్లేషణ ఇంకా అభిప్రాయం మాత్రమే.
© 2017,www.logili.com All Rights Reserved.