జీవితమే పెద్ద పరీక్ష అయినప్పుడు చిన్నప్పటి నుంచీ పెద్దయ్యేంతవరకు రాసే పరీక్షలు ఏపాటివి? ఆ అవగాహన చాలు ఏ పరీక్ష అయినా ఎలాంటి పరీక్ష అయినా జీవితగమనంలో ఎదుర్కోటానికీ - విజయం సాధించటానికీ! 'నాలెడ్జి ఈజ్ పవర్ - పవర్ ఈజ్ నాలెడ్జి' (Knowledge is Power / Power is Knowledge) అన్న పద ప్రయోగాలు తరచూ వింటూనే వుంటాం! జ్ఞానం గొప్పదా? శక్తి గొప్పదా? అన్న ప్రశ్నలకు జవాబులు తొందరగా లభ్యపడవు!
సూక్ష్మంగా ఆలోచిస్తే జ్ఞానం సంపాదించుకుంటే శక్తి దానంతట అదే లభ్యపడుతుందన్న జవాబు కొంతవరకు సంతృప్తిని కలిగించే అవకాశం వుంది!
జ్ఞానం మొదట సంపాదించుకుంటే శక్తిని సాధించవచ్చు! పరీక్షల్లో కూర్చునేవారు చదువు ద్వారా కావల్సిన జ్ఞాన సముపార్జన సాధిస్తే - విజయం ద్వారా ఉద్యోగం సాధించుకొని ఆ ఉద్యోగంలోని 'పవర్'ను పొందొచ్చు! ఈ విధంగా సూక్ష్మీకరించుకొని సంతృప్తిపడితే మొదటి విజయం మెట్టును ఎక్కినట్లే!
చిన్న క్లాసు పరీక్ష అయినా, ప్రొఫెషనల్ కోర్సు పరీక్షలయినా, చివరకు ఉద్యోగం కోసం రాసే పోటీ పరీక్షలయినా ఏ పరీక్ష అయినా బి.పి (బ్లడ్ ప్రెషర్) వయసు లేకపోయినా బి.పి లాంటి శారీరక మానసిక స్థితిని రాసేవారికి తెస్తుంది.
అర్జునుడంతటివాడు యుద్ధభూమిలో అడుగిడగానే భయం, గుండె దడ రాబట్టే గదా కృష్ణుని అవసరం ఏర్పడింది! పరీక్ష హాలు నుంచి రాయకుండానే ఏవిధంగా బయటపడాలి అని ఆలోచించినట్లే అర్జునుడు కూడా కురుక్షేత్రం.................
జీవితమే పరీక్ష - పోటీ పరీక్ష అందులో భాగమే! జీవితమే పెద్ద పరీక్ష అయినప్పుడు చిన్నప్పటి నుంచీ పెద్దయ్యేంతవరకు రాసే పరీక్షలు ఏపాటివి? ఆ అవగాహన చాలు ఏ పరీక్ష అయినా ఎలాంటి పరీక్ష అయినా జీవితగమనంలో ఎదుర్కోటానికీ - విజయం సాధించటానికీ! 'నాలెడ్జి ఈజ్ పవర్ - పవర్ ఈజ్ నాలెడ్జి' (Knowledge is Power / Power is Knowledge) అన్న పద ప్రయోగాలు తరచూ వింటూనే వుంటాం! జ్ఞానం గొప్పదా? శక్తి గొప్పదా? అన్న ప్రశ్నలకు జవాబులు తొందరగా లభ్యపడవు! సూక్ష్మంగా ఆలోచిస్తే జ్ఞానం సంపాదించుకుంటే శక్తి దానంతట అదే లభ్యపడుతుందన్న జవాబు కొంతవరకు సంతృప్తిని కలిగించే అవకాశం వుంది! జ్ఞానం మొదట సంపాదించుకుంటే శక్తిని సాధించవచ్చు! పరీక్షల్లో కూర్చునేవారు చదువు ద్వారా కావల్సిన జ్ఞాన సముపార్జన సాధిస్తే - విజయం ద్వారా ఉద్యోగం సాధించుకొని ఆ ఉద్యోగంలోని 'పవర్'ను పొందొచ్చు! ఈ విధంగా సూక్ష్మీకరించుకొని సంతృప్తిపడితే మొదటి విజయం మెట్టును ఎక్కినట్లే! చిన్న క్లాసు పరీక్ష అయినా, ప్రొఫెషనల్ కోర్సు పరీక్షలయినా, చివరకు ఉద్యోగం కోసం రాసే పోటీ పరీక్షలయినా ఏ పరీక్ష అయినా బి.పి (బ్లడ్ ప్రెషర్) వయసు లేకపోయినా బి.పి లాంటి శారీరక మానసిక స్థితిని రాసేవారికి తెస్తుంది. అర్జునుడంతటివాడు యుద్ధభూమిలో అడుగిడగానే భయం, గుండె దడ రాబట్టే గదా కృష్ణుని అవసరం ఏర్పడింది! పరీక్ష హాలు నుంచి రాయకుండానే ఏవిధంగా బయటపడాలి అని ఆలోచించినట్లే అర్జునుడు కూడా కురుక్షేత్రం.................© 2017,www.logili.com All Rights Reserved.