నాకు గౌరవనీయులైన కొద్దిమంది ముఖ్యులలో డా సి నారాయణ రెడ్డిగారు ఒకరు. ఆయన వేదిక మీద చేసే ప్రసంగాలలో చెణుకులు విని మనసారా హాయిగా నవ్వుకోవడం అందరికీ పరిపాటి. ఆయన అందరికీ ఆత్మీయులు, ముఖ్యంగా రచయిత్రులను చాలా ప్రోత్సాహించేవారు. ఎప్పుడు ఏ సలహా అడిగినా చక్కగా విడమరచి విషయం గురించి ఆలోచన చేసి చెప్పేవారు. ఆయన సంస్కారం, ఆయన పుట్టుకతో వచ్చిన రచనా ప్రతిభ యువ రచయితలకు చాలా ఆదర్శం. సాటివారితో ఆయన ప్రవర్తన, సౌశీల్యత యువ రచయితలు నేర్చుకోవాలి. ఎవరినీ నొప్పించని సరళ స్వభావం, అందరికీ ఆత్మీయత పంచే మంచితనం సినారెకు భగవంతుడు ఇచ్చిన వరాలు. యువరచయితలకు ఆయన ఆదర్శం అని భావిస్తాను. తెలుగు వారందరూ గర్వించదగ్గ సాహితీ మణిదీపం సినారె.
- యద్దనపూడి సులోచనారాణి
నాకు గౌరవనీయులైన కొద్దిమంది ముఖ్యులలో డా సి నారాయణ రెడ్డిగారు ఒకరు. ఆయన వేదిక మీద చేసే ప్రసంగాలలో చెణుకులు విని మనసారా హాయిగా నవ్వుకోవడం అందరికీ పరిపాటి. ఆయన అందరికీ ఆత్మీయులు, ముఖ్యంగా రచయిత్రులను చాలా ప్రోత్సాహించేవారు. ఎప్పుడు ఏ సలహా అడిగినా చక్కగా విడమరచి విషయం గురించి ఆలోచన చేసి చెప్పేవారు. ఆయన సంస్కారం, ఆయన పుట్టుకతో వచ్చిన రచనా ప్రతిభ యువ రచయితలకు చాలా ఆదర్శం. సాటివారితో ఆయన ప్రవర్తన, సౌశీల్యత యువ రచయితలు నేర్చుకోవాలి. ఎవరినీ నొప్పించని సరళ స్వభావం, అందరికీ ఆత్మీయత పంచే మంచితనం సినారెకు భగవంతుడు ఇచ్చిన వరాలు. యువరచయితలకు ఆయన ఆదర్శం అని భావిస్తాను. తెలుగు వారందరూ గర్వించదగ్గ సాహితీ మణిదీపం సినారె. - యద్దనపూడి సులోచనారాణి© 2017,www.logili.com All Rights Reserved.