నా మాట
సిక్కోల్ భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. ఆ వెనుకబాటుతనం కేవలం జీవించడంలో మాత్రమేకాని నీతి, నిజాయితీ, స్నేహం, సంస్కృతి కాపాడడంలో కాదు. వర్షాభారం, కొండపాలం, మెట్టపొలం, కరువుకాటకాలు వారి నేస్తాలు. చేయడానికి పని, తినడానికి తిండి దొరక్క సిక్కోల్ ప్రజలు రోజువారీ కూలీలుగా దాదాపుగా దేశవ్యాప్తంగా కనిపిస్తారు. వారు నమ్మే సిద్ధాంతాలు రెండేరెండు : శ్రమ, ఖర్మ, ప్రేమకు ఏమాత్రం పేదరికంలేని సిక్కోలు ప్రజలు స్నేహానికి ప్రాణమిచ్చి మోసానికి ప్రాణం తీస్తారు. ...
ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి ఎగిరిపోయే పూరిపాకలు, భుజాన | తుండుగుడ్డ (తువ్వాలు) ధరించే రైతులు, రైతు కూలీలు, రవికలులేని మహిళలు పొద్దస్తమానం పొలం పనుల్లో కనిపిస్తారు. రెండు గింజలు పండించడానికి నరాలు
తెంచుకుని, కటికనేలను పలుగుతో పెకిలించి, మిద్దెపై దాచుకున్న విత్తనాలు | ఆ పొలానచల్లి, అవి మొలకలెత్తితే చూసి మురిసిపోతారు. తరతరాల సంస్కృతికి - ఏమాత్రం భంగం కలగకుండా, పేదరికాన్ని లెక్క చేయకుండా, అలవాట్లను
కొనసాగిస్తూ, గ్రామదేవతలను నిష్టతో కొలుస్తారు. డప్పు వాయిద్యాలు, తప్పెట | పొగుడు, బుడబుక్కలు, తోలుబొమ్మలాటలు, గరిడిసాములు, ఓపాటలు, నాట్ల పాటలు,
కోత పాటలు, గౌరమ్మపాటలు, చెంచులపాటలు, మెయ్యిగుర్రాలు, నృత్య గేయాలు |పాడి, ఆది, విని ఆచార వ్యవహారాలు తరం నుండి తరానికి తరిగిపోకుండా అందిస్తారు.............
నా మాట సిక్కోల్ భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. ఆ వెనుకబాటుతనం కేవలం జీవించడంలో మాత్రమేకాని నీతి, నిజాయితీ, స్నేహం, సంస్కృతి కాపాడడంలో కాదు. వర్షాభారం, కొండపాలం, మెట్టపొలం, కరువుకాటకాలు వారి నేస్తాలు. చేయడానికి పని, తినడానికి తిండి దొరక్క సిక్కోల్ ప్రజలు రోజువారీ కూలీలుగా దాదాపుగా దేశవ్యాప్తంగా కనిపిస్తారు. వారు నమ్మే సిద్ధాంతాలు రెండేరెండు : శ్రమ, ఖర్మ, ప్రేమకు ఏమాత్రం పేదరికంలేని సిక్కోలు ప్రజలు స్నేహానికి ప్రాణమిచ్చి మోసానికి ప్రాణం తీస్తారు. ... ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి ఎగిరిపోయే పూరిపాకలు, భుజాన | తుండుగుడ్డ (తువ్వాలు) ధరించే రైతులు, రైతు కూలీలు, రవికలులేని మహిళలు పొద్దస్తమానం పొలం పనుల్లో కనిపిస్తారు. రెండు గింజలు పండించడానికి నరాలు తెంచుకుని, కటికనేలను పలుగుతో పెకిలించి, మిద్దెపై దాచుకున్న విత్తనాలు | ఆ పొలానచల్లి, అవి మొలకలెత్తితే చూసి మురిసిపోతారు. తరతరాల సంస్కృతికి - ఏమాత్రం భంగం కలగకుండా, పేదరికాన్ని లెక్క చేయకుండా, అలవాట్లను కొనసాగిస్తూ, గ్రామదేవతలను నిష్టతో కొలుస్తారు. డప్పు వాయిద్యాలు, తప్పెట | పొగుడు, బుడబుక్కలు, తోలుబొమ్మలాటలు, గరిడిసాములు, ఓపాటలు, నాట్ల పాటలు, కోత పాటలు, గౌరమ్మపాటలు, చెంచులపాటలు, మెయ్యిగుర్రాలు, నృత్య గేయాలు |పాడి, ఆది, విని ఆచార వ్యవహారాలు తరం నుండి తరానికి తరిగిపోకుండా అందిస్తారు.............© 2017,www.logili.com All Rights Reserved.