నందిని సుందర్ దాదాపు మూడు దశాబ్దాల కాలం బస్తర్పై జరిపిన పరిశోధన, పరిశోధనతో బాటు బస్తర్ ఆదివాసీల హక్కులకై నిలబడి చట్టబద్ధ పోరాటాన్ని చేసి సామాజిక శాస్త్రాలకు ఒక కొత్త దశను, అర్దాని కల్పించిన అరుదైన పుస్తకం ఇది. ఇది ఒక రకంగా మర్క్స్ సూత్రీకరించినట్టు "Action is the accomplishment of knowledge and knowledge is the fruit of action" జ్ఞానానికి అంతిమ లక్ష్యం ఆచరణ, ఆచరణలో నుండి పoడే ప్రతిఫలమే జ్ఞానం. సామజిక శాస్త్రాలలో ఈ అంశం పై నిరంతరంగా చర్చ జరుగుతుంటుంది. సామజిక ఆచరణ జ్ఞాన సృష్టి ఒకే సమయంలో సాధ్యం కావని, ఇవి జ్ఞాన ఆవరణ భిన్న ప్రక్రియలనే వాదన చాల బలంగా ఉంది. ఆచరణ ఒక ప్రాపంచిక దృక్పధం మీద, వ్యక్తులు తాము మద్దతు ఇచ్చే భావజాలం మీద ఆధారపడి ఉంటుందని, ఇది నిష్పక్షపాత పరిశోధనకు ప్రతిబంధకమనే బలమైన వాదనను పరిశోధనా ప్రక్రియ పర్వేశపెట్టి చాలా కాలమైంది.
-నందిని సుందర్.