ఈ 'రేగడినీడల్లా' కి పోయే ముందు నాలుగు మాటలు. ఇవి కొంగునాడు తెలుగు కతలు. బయటివారికి ఇప్పటి తమిళనాటి తెలుగు అంతా ఒకటిగానే అనిపించవచ్చు కానీ, ఇక్కడ అయిదు తీరుల తెలుగు ఉంది. కొంగు, మొరసు, చోళ, తొండ, పాండే అనే అయిదు నాడుల విడివిడి తెలుగు మాది. ఇందులో మొరసనాడులో కృష్ణ రచయిత సంగం పుట్టి ఇప్పటికే పదికి పైగా కథల పొత్తాలను ఆ తావు తెలుగులో వెలువరించింది. తొండనాడులో పుట్టిన తొండ రచయిత సంగం కూడా ఈ పనిని మొదలు పెట్టింది. కొంగు తెలుగులో వస్తున్న తొలి తెలుగు పొత్తం ఇది. కొంగునాడు రచయితల సంగం ఈ పొత్తాన్ని వెలువరిస్తున్నది. ఈ పొత్తంతోపాటే కొంగు రచయిత సంగం కూడా పుట్టింది.
మార్టూరి సంజనా పద్మం వయసు పన్నెండేళ్ళు. ఏడవ తరగతి చదువుతున్న ఈ రచయత్రి, లోతట్టు తమిళనాడులోని ఉడుములపేట అనే ఊరిలో పుట్టి పెరిగింది. రచయిత్రి తల్లినుండి తెలుగు. బడిలో తెలుగు లేకపోయినా సొంతంగా తెలుగును నేర్చుకొని, ఆ తావు తెలుగులో ఈ కథలను రాసింది. ఉడుములపేట తావులోని రేగడి నెలల్లో బతుకుతున్న తెలుగువారి కథలు ఇవి. తెలుగులో కొంగొత్త మాండలికమైన కొంగునాడు కథలు ఇవి.
ఈ 'రేగడినీడల్లా' కి పోయే ముందు నాలుగు మాటలు. ఇవి కొంగునాడు తెలుగు కతలు. బయటివారికి ఇప్పటి తమిళనాటి తెలుగు అంతా ఒకటిగానే అనిపించవచ్చు కానీ, ఇక్కడ అయిదు తీరుల తెలుగు ఉంది. కొంగు, మొరసు, చోళ, తొండ, పాండే అనే అయిదు నాడుల విడివిడి తెలుగు మాది. ఇందులో మొరసనాడులో కృష్ణ రచయిత సంగం పుట్టి ఇప్పటికే పదికి పైగా కథల పొత్తాలను ఆ తావు తెలుగులో వెలువరించింది. తొండనాడులో పుట్టిన తొండ రచయిత సంగం కూడా ఈ పనిని మొదలు పెట్టింది. కొంగు తెలుగులో వస్తున్న తొలి తెలుగు పొత్తం ఇది. కొంగునాడు రచయితల సంగం ఈ పొత్తాన్ని వెలువరిస్తున్నది. ఈ పొత్తంతోపాటే కొంగు రచయిత సంగం కూడా పుట్టింది. మార్టూరి సంజనా పద్మం వయసు పన్నెండేళ్ళు. ఏడవ తరగతి చదువుతున్న ఈ రచయత్రి, లోతట్టు తమిళనాడులోని ఉడుములపేట అనే ఊరిలో పుట్టి పెరిగింది. రచయిత్రి తల్లినుండి తెలుగు. బడిలో తెలుగు లేకపోయినా సొంతంగా తెలుగును నేర్చుకొని, ఆ తావు తెలుగులో ఈ కథలను రాసింది. ఉడుములపేట తావులోని రేగడి నెలల్లో బతుకుతున్న తెలుగువారి కథలు ఇవి. తెలుగులో కొంగొత్త మాండలికమైన కొంగునాడు కథలు ఇవి.© 2017,www.logili.com All Rights Reserved.