దళితుల పట్ల తరతరాల విపక్ష, అణచివేతలు నేటికీ ఎలా కొనసాగుతున్నాయో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది ఈ రిజర్వేషన్ బోగి కథాసంకలనం. ఒక సాంస్కృతిక చైతన్యానికి , చారిత్రక అవగాహనకు దారివేసే ప్రయత్నం చేశారు జూపాక సుభ్రద ఈ కథల ద్వారా. తిండి రాజకీయాల నుండి, వక్రీకరణకు గురవుతున్న చరిత్ర రాజకీయాల వరకు అనేకాంశాలను నిశితంగా విమర్శించారు. గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ పట్టణాల్లో నివసించే దళిత కుటుంబాలు సైతం కొత్త కొత్త రూపాలలో విపక్షను ఎలా ఎదుర్కొంటున్నారో పాఠకుల హృదయాలకు హత్తుకునే రీతిలో వర్ణించారు రచయిత్రి. తమ సమీప కులాల నుండి కూడ ఎలా విపక్షను , అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో కూడా తెలియజేస్తారు. మనముందు కూర్చొని తెలంగాణ భాషలో అలవోకగా చెబుతున్నట్లుగా సాగుతాయి ఈ కథలన్నీ. దళితుల హృదయ గోషను అర్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన కథలు ఇవి.