పుట్టినది గోదారొడ్డున - అమలాపురంలో, నాన్నగారి బదిలీల వల్ల చదువు చాలా చోట్లే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీల్లో జెనెటిక్స్ లో పిహెచ్ డి., దాకా. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉద్యోగం. సంగీతమన్నా, సాహిత్యమన్నా ప్రాణం - రెండింటిలోనూ పెద్దగా ప్రావీణ్యం లేకపోయినా సరే! అడపా తడపా కథలంటూ నేనేవో రాసినా, పంపినవీ, ప్రచురించబడినవీ తక్కువే! గతంలో ఒకటి రెండు కథలూ, కవితలూ చిన్న చిన్న బహుమతులూ, ప్రశంసలూ పొందాయి. 'రచన' పత్రికలో వసుంధర దంపతుల చేత అభినందనలు అందుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం!
కౌముది ఇంటర్నెట్ పత్రికలో మూడు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురించబడిన ఈ 'అగ్రహారం కథలు' నాకెంతో ప్రత్యేకమైనవి. నెలనెలకీ పెరిగిన ఆదరణతో నాకెంతో పేరు, ఎందరో అభిమానులని సమకూర్చాయి. పేరులో ఒకరకమయిన రాజసాన్నీ, కొంత గాంభీర్యాన్నీ సంతరించుకుని ఆంద్రదేశమంతటా ఉన్న చిన్న చిన్న గ్రామాలే అగ్రహారాలు. ఎదురెదురుగా చిన్నదీ, పెద్దదీ రెండు రాములవారి గుళ్ళూ ఆ ఊరి దేవుడి కాళ్ళు నిత్యమూ కడుగుతూ అప్పుడప్పుడు ఒద్దికగానూ, మరొకప్పుడు కాస్త ఉగ్రంగానూ ప్రవహించే కౌశికగా పిలవాడే గోదావరి. వెనకే పచ్చదనాల నెచ్చెలులు వరిచేలూ. వాటికి కాపలాగా నిలుచున్న అన్నదమ్ముల్లాంటి కొబ్బరిచెట్లూ.. ఇలా ఎంతో మనోహరంగా ఉన్నచోట ఎదురెదురుగా రోడ్డు కిరువైపులా ఉన్న పాతిక ఇళ్ళని కలిపి ఒక ఊరుగా కట్టేస్తే అదే ఈ అగ్రహారం.
పుట్టినది గోదారొడ్డున - అమలాపురంలో, నాన్నగారి బదిలీల వల్ల చదువు చాలా చోట్లే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీల్లో జెనెటిక్స్ లో పిహెచ్ డి., దాకా. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉద్యోగం. సంగీతమన్నా, సాహిత్యమన్నా ప్రాణం - రెండింటిలోనూ పెద్దగా ప్రావీణ్యం లేకపోయినా సరే! అడపా తడపా కథలంటూ నేనేవో రాసినా, పంపినవీ, ప్రచురించబడినవీ తక్కువే! గతంలో ఒకటి రెండు కథలూ, కవితలూ చిన్న చిన్న బహుమతులూ, ప్రశంసలూ పొందాయి. 'రచన' పత్రికలో వసుంధర దంపతుల చేత అభినందనలు అందుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం! కౌముది ఇంటర్నెట్ పత్రికలో మూడు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురించబడిన ఈ 'అగ్రహారం కథలు' నాకెంతో ప్రత్యేకమైనవి. నెలనెలకీ పెరిగిన ఆదరణతో నాకెంతో పేరు, ఎందరో అభిమానులని సమకూర్చాయి. పేరులో ఒకరకమయిన రాజసాన్నీ, కొంత గాంభీర్యాన్నీ సంతరించుకుని ఆంద్రదేశమంతటా ఉన్న చిన్న చిన్న గ్రామాలే అగ్రహారాలు. ఎదురెదురుగా చిన్నదీ, పెద్దదీ రెండు రాములవారి గుళ్ళూ ఆ ఊరి దేవుడి కాళ్ళు నిత్యమూ కడుగుతూ అప్పుడప్పుడు ఒద్దికగానూ, మరొకప్పుడు కాస్త ఉగ్రంగానూ ప్రవహించే కౌశికగా పిలవాడే గోదావరి. వెనకే పచ్చదనాల నెచ్చెలులు వరిచేలూ. వాటికి కాపలాగా నిలుచున్న అన్నదమ్ముల్లాంటి కొబ్బరిచెట్లూ.. ఇలా ఎంతో మనోహరంగా ఉన్నచోట ఎదురెదురుగా రోడ్డు కిరువైపులా ఉన్న పాతిక ఇళ్ళని కలిపి ఒక ఊరుగా కట్టేస్తే అదే ఈ అగ్రహారం.© 2017,www.logili.com All Rights Reserved.