ఇరవై ఒక్క కథల్లో తాము చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాల్నీ, మనుషుల్నీ వాళ్ళ ధోరణుల్నీ ఈ గ్రంథంలో మన ముందుంచారు. ఒక్కోకోణాన్ని ఒక్కో అధ్యాయంగా తీసుకొని చక్కటి ప్రణాళికతో ఒక్కో సంఘటను ఒక్కో కథగా మలిచి చెప్పడంతో విడవకుండా చదివేస్తాం. అన్నింటినీ వరుసబెట్టి.. సంఘటనలను సంఘటనలుగా కాకుండా, యదార్థాలను వక్రీకరించకుండా.. ఒక చక్కటి ఎత్తుగడ, మంచి ముగింపులతో కథా రూపాలనిచ్చారు వెంకట నారాయణ గారు. కథలు రాసే అనుభవం లేదన్నారు గాని అనుభవం ఉన్న కథా రచయిత చెప్పినట్లుగానే చెప్పారు. అలా అవలీలగా చదివింపజేసే భాష ఈ కథల్ని మనం వరుసబెట్టి చదివేయడానికి మరో కారణం.
ఈ కథల్లో రచయిత సునిశిత దృష్టి మనకి అర్థమౌతుంది. ఎప్పుడో జరిగిన సంఘటల్ని ఇప్పుడే జరిగినట్లు చెప్పగలిగారు. అందుకు కారణం ఆయనన్నట్లుగా అవన్నీ ఆయన కళ్ళ ముందు జరిగినవి, మనసులో ముద్రించుకుపోయినవి. మన మనసుల్లోనూ తప్పక సంతరావూరు పరిసర ప్రాంతాల్ని ముద్రిస్తాయి. మన చిన్ననాటి రోజులు, మన గ్రామ వాతావరణాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఇది అవసరమా.. అంటే మన మూలాన్ని వెదుక్కోవడం అవసరమేగా!
- డా వేదగిరి రాంబాబు
ఇరవై ఒక్క కథల్లో తాము చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాల్నీ, మనుషుల్నీ వాళ్ళ ధోరణుల్నీ ఈ గ్రంథంలో మన ముందుంచారు. ఒక్కోకోణాన్ని ఒక్కో అధ్యాయంగా తీసుకొని చక్కటి ప్రణాళికతో ఒక్కో సంఘటను ఒక్కో కథగా మలిచి చెప్పడంతో విడవకుండా చదివేస్తాం. అన్నింటినీ వరుసబెట్టి.. సంఘటనలను సంఘటనలుగా కాకుండా, యదార్థాలను వక్రీకరించకుండా.. ఒక చక్కటి ఎత్తుగడ, మంచి ముగింపులతో కథా రూపాలనిచ్చారు వెంకట నారాయణ గారు. కథలు రాసే అనుభవం లేదన్నారు గాని అనుభవం ఉన్న కథా రచయిత చెప్పినట్లుగానే చెప్పారు. అలా అవలీలగా చదివింపజేసే భాష ఈ కథల్ని మనం వరుసబెట్టి చదివేయడానికి మరో కారణం. ఈ కథల్లో రచయిత సునిశిత దృష్టి మనకి అర్థమౌతుంది. ఎప్పుడో జరిగిన సంఘటల్ని ఇప్పుడే జరిగినట్లు చెప్పగలిగారు. అందుకు కారణం ఆయనన్నట్లుగా అవన్నీ ఆయన కళ్ళ ముందు జరిగినవి, మనసులో ముద్రించుకుపోయినవి. మన మనసుల్లోనూ తప్పక సంతరావూరు పరిసర ప్రాంతాల్ని ముద్రిస్తాయి. మన చిన్ననాటి రోజులు, మన గ్రామ వాతావరణాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఇది అవసరమా.. అంటే మన మూలాన్ని వెదుక్కోవడం అవసరమేగా! - డా వేదగిరి రాంబాబు© 2017,www.logili.com All Rights Reserved.