ఆర్కే నారాయణ్ కధలు చదువుతూంటే మనందరికీ తెలిసిన ప్రదేశాలనే కొత్త అద్దాల నుంచి చూస్తున్నట్టుంటుంది. మనందరికీ తెలిసిన మనుషుల్లోనే ఇంతవరకు గమనించని వింతలను చూస్తున్నట్టుంటుంది. మనందరికీ తెలిసిన సన్నివేశాల్లోనే అనుకోని మలుపులు చూస్తున్నట్టుంటుంది. అతి సాధారణంగా చెప్పిన అసాధారణమైన కధలు ఇవి. మాల్గుడి అనే కల్పిత పట్టణంలోని ప్రతి సంఘటనా, ప్రతి చమత్కారమూ, ప్రతి అనుభవమూ, ప్రతి కలయికా, ప్రతి వీడ్కోలు, ప్రతి బాధా, ప్రతి ఆనందమూ మనవే అన్నట్టుంటుంది. అక్కడి ప్రతి వ్యక్తీ మనవాడే ప్రతి వ్యవస్థా మనదే. ఇంకా చెప్పాలంటే మనల్ని మనం అక్షరాలలో చూసుకుంటున్నట్టుంటుంది. చదివేకొద్దీ మనం కూడా మాల్గుడిలో ఎప్పుడో ఒకప్పుడు వివరించామన్న భ్రమ కలుగుతుంది. ఇంకా వివాహరించాలన్న కోరిక కలుగుతుంది.
ఆర్కే నారాయణ్ కధలను అనువదించడం చాలా సులభంగా కనిపించే చాలా కష్టమైన పని. ఆయన ఇంగ్లిష్ చదువుతూంటే సంక్లిష్టమైన పదాలు లేకుండా సుళువుగా అనిపిస్తుంది. చాలామంది భారతీయాంగ్ల రచయితల్లా కాక, ఆయన చాలా సహజమైన శైలిలో ఇంగ్లిషు భాషను ఉపయోగిస్తారు. పదాల వరకు అనువాదం సుళువే. కాని పదాల ద్వారా వ్యక్తీకరించే ఐరనీని, పదాల మధ్య నిశ్శబ్దాన్ని అనువదించడం చాలా కష్టం. ఆర్కే అనువాదకులకు ఎదురయ్యే సమస్య అదే. ఈ సమస్యను అధిగమించడానికి, కధలకు న్యాయం చేయడానికి శక్తి లోపం లేకుండా ప్రయత్నించానని చెప్పగలనే గానీ, సఫలమయ్యానని ఖచ్చితంగా చెప్పలేను. ఏమైనా అనువాదం చేసే అవకాశం లభించడం మాత్రం అదృష్టమే.
- మృణాళిని
ఆర్కే నారాయణ్ కధలు చదువుతూంటే మనందరికీ తెలిసిన ప్రదేశాలనే కొత్త అద్దాల నుంచి చూస్తున్నట్టుంటుంది. మనందరికీ తెలిసిన మనుషుల్లోనే ఇంతవరకు గమనించని వింతలను చూస్తున్నట్టుంటుంది. మనందరికీ తెలిసిన సన్నివేశాల్లోనే అనుకోని మలుపులు చూస్తున్నట్టుంటుంది. అతి సాధారణంగా చెప్పిన అసాధారణమైన కధలు ఇవి. మాల్గుడి అనే కల్పిత పట్టణంలోని ప్రతి సంఘటనా, ప్రతి చమత్కారమూ, ప్రతి అనుభవమూ, ప్రతి కలయికా, ప్రతి వీడ్కోలు, ప్రతి బాధా, ప్రతి ఆనందమూ మనవే అన్నట్టుంటుంది. అక్కడి ప్రతి వ్యక్తీ మనవాడే ప్రతి వ్యవస్థా మనదే. ఇంకా చెప్పాలంటే మనల్ని మనం అక్షరాలలో చూసుకుంటున్నట్టుంటుంది. చదివేకొద్దీ మనం కూడా మాల్గుడిలో ఎప్పుడో ఒకప్పుడు వివరించామన్న భ్రమ కలుగుతుంది. ఇంకా వివాహరించాలన్న కోరిక కలుగుతుంది. ఆర్కే నారాయణ్ కధలను అనువదించడం చాలా సులభంగా కనిపించే చాలా కష్టమైన పని. ఆయన ఇంగ్లిష్ చదువుతూంటే సంక్లిష్టమైన పదాలు లేకుండా సుళువుగా అనిపిస్తుంది. చాలామంది భారతీయాంగ్ల రచయితల్లా కాక, ఆయన చాలా సహజమైన శైలిలో ఇంగ్లిషు భాషను ఉపయోగిస్తారు. పదాల వరకు అనువాదం సుళువే. కాని పదాల ద్వారా వ్యక్తీకరించే ఐరనీని, పదాల మధ్య నిశ్శబ్దాన్ని అనువదించడం చాలా కష్టం. ఆర్కే అనువాదకులకు ఎదురయ్యే సమస్య అదే. ఈ సమస్యను అధిగమించడానికి, కధలకు న్యాయం చేయడానికి శక్తి లోపం లేకుండా ప్రయత్నించానని చెప్పగలనే గానీ, సఫలమయ్యానని ఖచ్చితంగా చెప్పలేను. ఏమైనా అనువాదం చేసే అవకాశం లభించడం మాత్రం అదృష్టమే. - మృణాళిని
అందరూ తప్పక చదవదగిన మంచి పుస్తకం
© 2017,www.logili.com All Rights Reserved.