రాయలసీమ రైతుగుండె చప్పుళ్ళను నిజాయితీగా పట్టుకొని కథల్లో ప్రవేశపెట్టిన ఉత్తమ శ్రేణి కథకుడు సింగమనేని. వీరి కథల్లో కొత్త మలుపులు, కొత్త భావాలు, మునుపటి కథకులు ఊహించలేని గమనాలు, చూడని దృష్టికోణాలు మనకు దర్శనమిస్తాయి. సమాజాన్ని మార్చాలనే దృష్టితో మార్క్సిస్టు దృక్పథంతో సింగమనేని నారాయణ రాసిన ఈ కథానికలు ఈ తరం రచయితలకు కరదీపికలు.
రైతాంగవ్యవస్థ సంక్షోభాన్ని, వ్యావసాయిక విధ్వంస దృశ్యాల్ని చిత్రించిన సింగమనేని నారాయణ కథానికలు తెలుగు పల్లెలో మరీ ముఖ్యంగా రాయలసీమ గ్రామ సీమల్లో జరిగే సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక మార్పుల్ని మన ముందుంచుతాయి. సామాన్య జన జీవితాలను, వాళ్ళ కష్టాలను కన్నీళ్లను, బతికేందుకు వాళ్ళు పడే ఆరాటాల్ని, చేసే పోరాటాల్ని వాళ్ళ మాటల్లోనే నిజాయితీగా పలికిన ఈ కథానికలు మనసు పెట్టి చదివితే మనందరి కథలు - జీవేచ్చను రగిలించే అక్షర శిల్పాలు కూడా! సమాజాన్ని మార్చగలిగిన సత్తావున్న కథల్ని రాసిన కొద్దిమంది రచయితలలో సింగమనేని నారాయణ ఒకరు.
రాయలసీమ రైతుగుండె చప్పుళ్ళను నిజాయితీగా పట్టుకొని కథల్లో ప్రవేశపెట్టిన ఉత్తమ శ్రేణి కథకుడు సింగమనేని. వీరి కథల్లో కొత్త మలుపులు, కొత్త భావాలు, మునుపటి కథకులు ఊహించలేని గమనాలు, చూడని దృష్టికోణాలు మనకు దర్శనమిస్తాయి. సమాజాన్ని మార్చాలనే దృష్టితో మార్క్సిస్టు దృక్పథంతో సింగమనేని నారాయణ రాసిన ఈ కథానికలు ఈ తరం రచయితలకు కరదీపికలు. రైతాంగవ్యవస్థ సంక్షోభాన్ని, వ్యావసాయిక విధ్వంస దృశ్యాల్ని చిత్రించిన సింగమనేని నారాయణ కథానికలు తెలుగు పల్లెలో మరీ ముఖ్యంగా రాయలసీమ గ్రామ సీమల్లో జరిగే సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక మార్పుల్ని మన ముందుంచుతాయి. సామాన్య జన జీవితాలను, వాళ్ళ కష్టాలను కన్నీళ్లను, బతికేందుకు వాళ్ళు పడే ఆరాటాల్ని, చేసే పోరాటాల్ని వాళ్ళ మాటల్లోనే నిజాయితీగా పలికిన ఈ కథానికలు మనసు పెట్టి చదివితే మనందరి కథలు - జీవేచ్చను రగిలించే అక్షర శిల్పాలు కూడా! సమాజాన్ని మార్చగలిగిన సత్తావున్న కథల్ని రాసిన కొద్దిమంది రచయితలలో సింగమనేని నారాయణ ఒకరు.© 2017,www.logili.com All Rights Reserved.