1975వ సంవత్సరం తర్వాత వచ్చిన స్త్రీవాద భావాలు అనేకమంది మేధావులను, వామపక్ష, ప్రగతి శీలురనుకునే వారిని కూడా కలవరపెట్టాయి. కల్లోల పరచాయి... 80 వ దశాబ్దంలో రచయిత్రులు ఈ అంశాల గురించి విరివిగా రాయటం ప్రారంభించారు. ఆ కాలంలో ఈ విషయాల గురించి చిత్తశుద్దితో, సహానుభూతితో అలోచించి అర్ధం చేసుకుని కధలు రాసిన రచయితగా సింగమనేని గారిని చెప్పుకోవచ్చు....
మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీలు పడే హింసను, వరకట్నమనే దుర్మార్గానికి తల ఒగ్గాల్సిన స్థితిలో ఉన్న స్త్రీలను సింగమనేని ఒక పితృవాత్సల్యంతో, మిత్ర సాన్నిహిత్యంతో తన కధలలో పాత్రలుగా మలిచారు.
స్త్రీల చైతన్యంతో రగిలే దశాబ్దంలో కొన్ని కధలే అయినా కీలకమైన అంశాల గురించి మంచి సాహసులైన పాత్రలను సృష్టించి కధలు రాయటంలో తన మార్క్సిస్ట్ దృక్పదాన్ని విశాలం చేసుకున్న సృజనాత్మక రచయితగా నిలిచారు సింగమనేని నారాయణగారు. సమాజంలో స్త్రీల పట్ల రావలసిన సంస్కారదృష్టిని పరిచయం చేసిన రచయితగా సింగమనేని గుర్తుంటారు.
- ఓల్గా
1975వ సంవత్సరం తర్వాత వచ్చిన స్త్రీవాద భావాలు అనేకమంది మేధావులను, వామపక్ష, ప్రగతి శీలురనుకునే వారిని కూడా కలవరపెట్టాయి. కల్లోల పరచాయి... 80 వ దశాబ్దంలో రచయిత్రులు ఈ అంశాల గురించి విరివిగా రాయటం ప్రారంభించారు. ఆ కాలంలో ఈ విషయాల గురించి చిత్తశుద్దితో, సహానుభూతితో అలోచించి అర్ధం చేసుకుని కధలు రాసిన రచయితగా సింగమనేని గారిని చెప్పుకోవచ్చు.... మధ్య తరగతి కుటుంబాలలో స్త్రీలు పడే హింసను, వరకట్నమనే దుర్మార్గానికి తల ఒగ్గాల్సిన స్థితిలో ఉన్న స్త్రీలను సింగమనేని ఒక పితృవాత్సల్యంతో, మిత్ర సాన్నిహిత్యంతో తన కధలలో పాత్రలుగా మలిచారు. స్త్రీల చైతన్యంతో రగిలే దశాబ్దంలో కొన్ని కధలే అయినా కీలకమైన అంశాల గురించి మంచి సాహసులైన పాత్రలను సృష్టించి కధలు రాయటంలో తన మార్క్సిస్ట్ దృక్పదాన్ని విశాలం చేసుకున్న సృజనాత్మక రచయితగా నిలిచారు సింగమనేని నారాయణగారు. సమాజంలో స్త్రీల పట్ల రావలసిన సంస్కారదృష్టిని పరిచయం చేసిన రచయితగా సింగమనేని గుర్తుంటారు. - ఓల్గా© 2017,www.logili.com All Rights Reserved.