లైంగిక శ్రమ విభజనకు లొంగని మహిళలు
ఒంటరి మహిళల గురించి, వారి జీవితానుభవాల గురించి కథా సంకలనం చదివి ముందుమాట రాయాలనగానే నాకు ఎంతో మంది ఒంటరి మహిళలు గుర్తొచ్చారు. సాహిత్యంలో, చరిత్రలో, నిజ జీవితంలో ఒంటరి మహిళ అనే పదం Single Woman అనే ఇంగ్లీషు పదానికి అనువాదంలాగా వాడుకలో ఉంటూ వస్తుంది. నిజానికి Single అనే పదానికి ఒంటరి అనేది సమానార్ధకం అని చెప్పలేము. కానీ కుటుంబంతో, ముఖ్యంగా భర్తతో కలిసిలేని స్త్రీలు ఒంటరిగా ఉంటున్నారనే అర్ధం తీసుకుంటే సరిపోయినట్లే ఉంటుంది. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనాన్నీ, ఒంటరిగా ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులనూ, సామాజిక, రాజకీయ, |ఆర్థిక ఒత్తిళ్ళనూ అనుభవిస్తూ, భరిస్తూ, బాధపడుతూ, ఎదురీదుతూ, పోరాడుతూ ఉండటం వేరు.
సాహిత్యంలో చూస్తే ప్రాచీన కాలం నుంచీ చంద్రమతి, సీత, శకుంతల, అహల్య, రేణుక, ఊర్మిళ, ఇలా ఎందరో పురాణ స్త్రీలు తమ జీవితాల్ని పరిచ్యుతులుగా బహిష్కృతులుగా, అవమానితులుగా గడిపిన వారే.
ఆధునిక సాహిత్యంలో కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మ, మీనాక్షిలు అన్ని విధాలుగా ఒంటరి మహిళలైతే, బుచ్చమ్మ, మధురవాణిలు చెరొక విధంగా ఒంటరి మహిళలుగా పోరాడారు తమ అమాయకత్వంతో, మేధోసంపదతో.................
లైంగిక శ్రమ విభజనకు లొంగని మహిళలు ఒంటరి మహిళల గురించి, వారి జీవితానుభవాల గురించి కథా సంకలనం చదివి ముందుమాట రాయాలనగానే నాకు ఎంతో మంది ఒంటరి మహిళలు గుర్తొచ్చారు. సాహిత్యంలో, చరిత్రలో, నిజ జీవితంలో ఒంటరి మహిళ అనే పదం Single Woman అనే ఇంగ్లీషు పదానికి అనువాదంలాగా వాడుకలో ఉంటూ వస్తుంది. నిజానికి Single అనే పదానికి ఒంటరి అనేది సమానార్ధకం అని చెప్పలేము. కానీ కుటుంబంతో, ముఖ్యంగా భర్తతో కలిసిలేని స్త్రీలు ఒంటరిగా ఉంటున్నారనే అర్ధం తీసుకుంటే సరిపోయినట్లే ఉంటుంది. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనాన్నీ, ఒంటరిగా ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులనూ, సామాజిక, రాజకీయ, |ఆర్థిక ఒత్తిళ్ళనూ అనుభవిస్తూ, భరిస్తూ, బాధపడుతూ, ఎదురీదుతూ, పోరాడుతూ ఉండటం వేరు. సాహిత్యంలో చూస్తే ప్రాచీన కాలం నుంచీ చంద్రమతి, సీత, శకుంతల, అహల్య, రేణుక, ఊర్మిళ, ఇలా ఎందరో పురాణ స్త్రీలు తమ జీవితాల్ని పరిచ్యుతులుగా బహిష్కృతులుగా, అవమానితులుగా గడిపిన వారే. ఆధునిక సాహిత్యంలో కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మ, మీనాక్షిలు అన్ని విధాలుగా ఒంటరి మహిళలైతే, బుచ్చమ్మ, మధురవాణిలు చెరొక విధంగా ఒంటరి మహిళలుగా పోరాడారు తమ అమాయకత్వంతో, మేధోసంపదతో.................© 2017,www.logili.com All Rights Reserved.