'సాహిత్యాకాశంలో స్త్రీలు తక్కువ సంఖ్యలో ఉంటే, అందులో తెలంగాణా స్త్రీలు మరింత తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ తక్కువతనాన్ని తొలగించుకోవలసిన అవసరం ఉన్నది. తక్కువగా రాస్తున్నారనేది పాక్షిక సత్యం మాత్రమే. వారు రాసినదంతా ప్రచురణకివ్వబడటం లేదు, ఇచ్చినా ప్రచురింపబడటమూ లేదన్నదే వాస్తవం. తెలంగాణా స్త్రీలు సంకోచాలూ, బిడియాలూ, భయాలూ, అపనమ్మకాలూ ఇంకా పూర్తిగా వొదిలించుకోలేదేమో. కానీ ఆ రోజులు పోయాయి. మనమిప్పుడు ఎవ్వరికీ తక్కువ కాదు, మనలో రచనాశక్తికి లోటు లేదని గ్రహించాల్సిన సమయం వచ్చేసింది.
అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ మన ప్రాచీనకాలపు, తొలితరపు కవయిత్రులూ, రచయిత్రులూ రచనలు చేసి మనకు స్పూర్తిగా ఉన్నారు. అజ్ఞాతంగా ఉద్యమంలో ఉండీ, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తూ కూడా ఎంతోమంది స్త్రీలు కథా రచన విస్తృతంగా చేస్తున్నారు. ఈ రోజున సమాజాన్ని అర్థం చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ అంచెలంచెలుగా మహిళలు ఎదుగుతున్నారు. ఆ చైతన్యాన్ని జీవితాల్లోనూ రచనలలోనూ ప్రతిఫలించాలి. వెలుగులోకి రాని స్త్రీ సమూహాల జీవన సర్వస్వాలనూ పార్శ్వాలనూ వెలుగులోకి తీసుకురావాలి.
ఈ కథా సంకలనంలో కథా వస్తువు విషయంలో రచయిత్రులు వైవిధ్యం కనబరచారు. కథలు రాయడంలో ఏమాత్రం వెనకబడి లేనట్లే కథా వస్తువుల ఎంపికలోనూ ఎక్కడా వెనకబడిలేరు. ఇంకా అన్వేషిస్తే తెలంగాణాలో మరో వందమంది కథా రచయిత్రుల్ని కనుగొనే అవకాశం ఉందనిపించింది.'
'సాహిత్యాకాశంలో స్త్రీలు తక్కువ సంఖ్యలో ఉంటే, అందులో తెలంగాణా స్త్రీలు మరింత తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ తక్కువతనాన్ని తొలగించుకోవలసిన అవసరం ఉన్నది. తక్కువగా రాస్తున్నారనేది పాక్షిక సత్యం మాత్రమే. వారు రాసినదంతా ప్రచురణకివ్వబడటం లేదు, ఇచ్చినా ప్రచురింపబడటమూ లేదన్నదే వాస్తవం. తెలంగాణా స్త్రీలు సంకోచాలూ, బిడియాలూ, భయాలూ, అపనమ్మకాలూ ఇంకా పూర్తిగా వొదిలించుకోలేదేమో. కానీ ఆ రోజులు పోయాయి. మనమిప్పుడు ఎవ్వరికీ తక్కువ కాదు, మనలో రచనాశక్తికి లోటు లేదని గ్రహించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ మన ప్రాచీనకాలపు, తొలితరపు కవయిత్రులూ, రచయిత్రులూ రచనలు చేసి మనకు స్పూర్తిగా ఉన్నారు. అజ్ఞాతంగా ఉద్యమంలో ఉండీ, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తూ కూడా ఎంతోమంది స్త్రీలు కథా రచన విస్తృతంగా చేస్తున్నారు. ఈ రోజున సమాజాన్ని అర్థం చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ అంచెలంచెలుగా మహిళలు ఎదుగుతున్నారు. ఆ చైతన్యాన్ని జీవితాల్లోనూ రచనలలోనూ ప్రతిఫలించాలి. వెలుగులోకి రాని స్త్రీ సమూహాల జీవన సర్వస్వాలనూ పార్శ్వాలనూ వెలుగులోకి తీసుకురావాలి. ఈ కథా సంకలనంలో కథా వస్తువు విషయంలో రచయిత్రులు వైవిధ్యం కనబరచారు. కథలు రాయడంలో ఏమాత్రం వెనకబడి లేనట్లే కథా వస్తువుల ఎంపికలోనూ ఎక్కడా వెనకబడిలేరు. ఇంకా అన్వేషిస్తే తెలంగాణాలో మరో వందమంది కథా రచయిత్రుల్ని కనుగొనే అవకాశం ఉందనిపించింది.'© 2017,www.logili.com All Rights Reserved.