సుదీర్ఘమైన తెలంగాణా ప్రత్యేక రాష్ట్రోద్యమ కాలంలో సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు కూడా సమ్మిళితంగా కొనసాగాయి. మలిదశ ఉద్యమకాలంలో తెలంగాణా భాషపై సోయి మరింత పెరిగింది. వ్యక్తులు, సంస్థలు తెలంగాణా భాషపై ఎనలేని కృషి చేశాయి. అనేక పుస్తకాలు ప్రచురించారు. నాటి తెలంగాణా వ్యవహార పద సంపద సేకరణ అనేది ఓ ప్రత్యేకమైన సాహితీ యజ్ఞం.
పదకోశ నిర్మాణం ఒక శాస్త్రం. మనిషి తన అనుభవాలను ఇతరులకు తెలియజేయాలనుకునే తపన నుండి భాష ఆవిర్భవిస్తుంది. భాష తన పక్కనున్న సోదర భాషల వల్ల, పాలకుల భాష వల్ల పటిష్టమౌతూ వర్ధిల్లుతుంది. ఇవన్నీ వలసలు లేనంత వరకే. ప్రజలలో వలసలు పెరిగిన కొద్దీ భాష మార్పులకు గురౌతూ ఉంటుంది. ఆ భాష వినిమయ పద్ధతులను బట్టికూడా కొన్ని భాషలు వృద్ధి పొందడం, కొన్ని కనుమరుగు అయ్యే ప్రమాదంలోకి నెట్టబడటం జరుగుతుంది. భాషల సృజనలో వివిధ వృత్తుల వారి భాషలు ప్రవేశిస్తాయి. భాషని పరిపుష్టం చేస్తాయి. తెలంగాణా భాషా పదాలను ముదిగుంటి సుజాతారెడ్డి గారు తన కథల్లో వాడటమేకాక ఎన్నో ప్రజల నిత్యావసరంలో ఉన్న తెలంగాణా భాషా పదాలను సేకరించారు. ఆ సేకరణ ఫలితమే ఈ ‘తెలంగాణా వ్యవహార పదకోశం.’
సుదీర్ఘమైన తెలంగాణా ప్రత్యేక రాష్ట్రోద్యమ కాలంలో సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు కూడా సమ్మిళితంగా కొనసాగాయి. మలిదశ ఉద్యమకాలంలో తెలంగాణా భాషపై సోయి మరింత పెరిగింది. వ్యక్తులు, సంస్థలు తెలంగాణా భాషపై ఎనలేని కృషి చేశాయి. అనేక పుస్తకాలు ప్రచురించారు. నాటి తెలంగాణా వ్యవహార పద సంపద సేకరణ అనేది ఓ ప్రత్యేకమైన సాహితీ యజ్ఞం. పదకోశ నిర్మాణం ఒక శాస్త్రం. మనిషి తన అనుభవాలను ఇతరులకు తెలియజేయాలనుకునే తపన నుండి భాష ఆవిర్భవిస్తుంది. భాష తన పక్కనున్న సోదర భాషల వల్ల, పాలకుల భాష వల్ల పటిష్టమౌతూ వర్ధిల్లుతుంది. ఇవన్నీ వలసలు లేనంత వరకే. ప్రజలలో వలసలు పెరిగిన కొద్దీ భాష మార్పులకు గురౌతూ ఉంటుంది. ఆ భాష వినిమయ పద్ధతులను బట్టికూడా కొన్ని భాషలు వృద్ధి పొందడం, కొన్ని కనుమరుగు అయ్యే ప్రమాదంలోకి నెట్టబడటం జరుగుతుంది. భాషల సృజనలో వివిధ వృత్తుల వారి భాషలు ప్రవేశిస్తాయి. భాషని పరిపుష్టం చేస్తాయి. తెలంగాణా భాషా పదాలను ముదిగుంటి సుజాతారెడ్డి గారు తన కథల్లో వాడటమేకాక ఎన్నో ప్రజల నిత్యావసరంలో ఉన్న తెలంగాణా భాషా పదాలను సేకరించారు. ఆ సేకరణ ఫలితమే ఈ ‘తెలంగాణా వ్యవహార పదకోశం.’© 2017,www.logili.com All Rights Reserved.