రామకృష్ణుడు హంపి విజయనగరంలో రాయలవారి కొలువులో ఉన్న కాలంలో రోజూ ఏదో వింత చేసేవాడు. ఒక్కోసారి రాయలవారిని విసిగించేవాడు, బాధ కలిగించేవాడు. రామకృష్ణుడు చేసిన తిక్కపనికి రాయలవారికి బాగా కోపం వచ్చింది. "వెంటనే రామకృష్ణ కవిని పిలిచి నా రాజ్యం విడిచి వెళ్ళిపో" అన్నారు. కవిగారు "చిత్తం ప్రభూ" అంటూ కొలువు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తరువాత రాయలువారు వేటకు వెళ్ళారు. అది చిట్టడవి. ఆ అడవిలో ఒక చెట్టుపై రామకృష్ణ నక్కిదాగి ఉండడం గమనించారు. కవిగారిని కిందకు దిగామన్నారు. చేసేది లేక చెట్టు దిగారు.
"నిన్ను రాజ్యం విడిచి వెళ్ళమన్నాను గదా, నా రాజ్యంలోనే ఉంటూ చెట్టెక్కిదాకున్నావేమిటి?" అన్నారు రాయలవారు. "ప్రభూ మీ ఆజ్ఞ ప్రకారం - మీ రాజ్యం విడిచి వెళ్ళాలనుకున్నాను. ఎంతో దూరం పోయి వచ్చా, ఎటు చూసినా మీ రాజ్యమే కదా! మరొకరి రాజ్యం కనిపించలేదు. కనుక తిరిగి వచ్చి ఇచట దాక్కున్నాను అన్నారు కవిగారు. వాస్తవానికి కవిగారు చెప్పిందాంట్లో వాస్తవం లేదు. అయినా రామకృష్ణున్ని యుక్తికి రాయలవారు సంతోషించి విజయనగరం తీసుకెళ్ళారు.
ఈ పుస్తకంలో ఇటువంటి హాస్య కథలు చాలా ఉన్నాయి.
రామకృష్ణుడు హంపి విజయనగరంలో రాయలవారి కొలువులో ఉన్న కాలంలో రోజూ ఏదో వింత చేసేవాడు. ఒక్కోసారి రాయలవారిని విసిగించేవాడు, బాధ కలిగించేవాడు. రామకృష్ణుడు చేసిన తిక్కపనికి రాయలవారికి బాగా కోపం వచ్చింది. "వెంటనే రామకృష్ణ కవిని పిలిచి నా రాజ్యం విడిచి వెళ్ళిపో" అన్నారు. కవిగారు "చిత్తం ప్రభూ" అంటూ కొలువు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళ తరువాత రాయలువారు వేటకు వెళ్ళారు. అది చిట్టడవి. ఆ అడవిలో ఒక చెట్టుపై రామకృష్ణ నక్కిదాగి ఉండడం గమనించారు. కవిగారిని కిందకు దిగామన్నారు. చేసేది లేక చెట్టు దిగారు. "నిన్ను రాజ్యం విడిచి వెళ్ళమన్నాను గదా, నా రాజ్యంలోనే ఉంటూ చెట్టెక్కిదాకున్నావేమిటి?" అన్నారు రాయలవారు. "ప్రభూ మీ ఆజ్ఞ ప్రకారం - మీ రాజ్యం విడిచి వెళ్ళాలనుకున్నాను. ఎంతో దూరం పోయి వచ్చా, ఎటు చూసినా మీ రాజ్యమే కదా! మరొకరి రాజ్యం కనిపించలేదు. కనుక తిరిగి వచ్చి ఇచట దాక్కున్నాను అన్నారు కవిగారు. వాస్తవానికి కవిగారు చెప్పిందాంట్లో వాస్తవం లేదు. అయినా రామకృష్ణున్ని యుక్తికి రాయలవారు సంతోషించి విజయనగరం తీసుకెళ్ళారు. ఈ పుస్తకంలో ఇటువంటి హాస్య కథలు చాలా ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.