నా రచనలు మూడు రకాలుగా విభజించి ముద్రించటం జరిగింది.
మానవీయం... మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి. యాంత్రిక హృదయాలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా మరికొన్ని ఊహాజనితాలుగా అల్లిన ఈ 'మానవీయ' రచనలు. మీరు చదివి, మన్నించి, మనసులో చోటిచ్చి మీలోని నిద్రాణమైన మానవుని మేల్కొలపండి. విజ్ఞులులు ఈ సూచనను రచయిత అహంకారంగా భావించవద్దని మనవి. మంచి మనసుతో స్వీకరించమని ప్రార్థన.
శృంగారం... శృంగారం జీవితంలో ఓ ప్రత్యేక భాగం. ప్రకృతి సహజం ఇందుకు విరుద్దంగా సన్యసించామని చెప్పుకున్న మహానుభావుల భాగోతాలు పేపర్లలో చదువుతున్నాము. టీవీల్లో చూస్తున్నాము. ఇందులో కథలన్నీ ఊహాజనితాలు. ఎవరిని ముఖ్యంగా సినిమా వారిని అవమానించాలని రాయలేదు. కథలోని శృంగారాన్ని మాత్రమే ఆస్వాదించి, కథను కల్పనగా మరచిపోండి. చదవకూడదనుకునే పెద్దలకు ఈ కథలను వదిలి మిగతావి చదువుకొమ్మని నా ప్రార్థన.
రాజకీయం... రాజకీయాల్లో సేవకన్నా 'మేవ' ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తుంది. ఎన్నో మలుపులు, ఊహించని మలుపులు రోజు పత్రికల్లో, టి వి ల్లో వార్తలుగా వస్తున్నాయి. ఇందులో ఆలోచింపజేసే కథలున్నాయి. ఆనందంగా నవ్వుకునే కథలున్నాయి. ఎవ్వరినీ కించపరిచే దురుద్దేశం ఏ కోశాన లేదు. సహృదయంతో స్వీకరించమని, సవినయంగా నా మనవి.
- రచయిత
నా రచనలు మూడు రకాలుగా విభజించి ముద్రించటం జరిగింది. మానవీయం... మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి. యాంత్రిక హృదయాలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా మరికొన్ని ఊహాజనితాలుగా అల్లిన ఈ 'మానవీయ' రచనలు. మీరు చదివి, మన్నించి, మనసులో చోటిచ్చి మీలోని నిద్రాణమైన మానవుని మేల్కొలపండి. విజ్ఞులులు ఈ సూచనను రచయిత అహంకారంగా భావించవద్దని మనవి. మంచి మనసుతో స్వీకరించమని ప్రార్థన. శృంగారం... శృంగారం జీవితంలో ఓ ప్రత్యేక భాగం. ప్రకృతి సహజం ఇందుకు విరుద్దంగా సన్యసించామని చెప్పుకున్న మహానుభావుల భాగోతాలు పేపర్లలో చదువుతున్నాము. టీవీల్లో చూస్తున్నాము. ఇందులో కథలన్నీ ఊహాజనితాలు. ఎవరిని ముఖ్యంగా సినిమా వారిని అవమానించాలని రాయలేదు. కథలోని శృంగారాన్ని మాత్రమే ఆస్వాదించి, కథను కల్పనగా మరచిపోండి. చదవకూడదనుకునే పెద్దలకు ఈ కథలను వదిలి మిగతావి చదువుకొమ్మని నా ప్రార్థన. రాజకీయం... రాజకీయాల్లో సేవకన్నా 'మేవ' ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తుంది. ఎన్నో మలుపులు, ఊహించని మలుపులు రోజు పత్రికల్లో, టి వి ల్లో వార్తలుగా వస్తున్నాయి. ఇందులో ఆలోచింపజేసే కథలున్నాయి. ఆనందంగా నవ్వుకునే కథలున్నాయి. ఎవ్వరినీ కించపరిచే దురుద్దేశం ఏ కోశాన లేదు. సహృదయంతో స్వీకరించమని, సవినయంగా నా మనవి. - రచయిత© 2017,www.logili.com All Rights Reserved.