ఈ కాలానికి అవసరమైన రాజకీయార్థిక కథలు
మూడు దశాబ్దాలకు పైగా మన దేశంలో ప్రకటితంగా సాగుతున్న ప్రపంచీకరణ క్రమం, దాన్ని ప్రవేశపెట్టిన పాలకులు ఏ ఆర్థిక లక్ష్యాలను కోరుకున్నారో వాటిని సాధించిందో లేదో గాని, మన సమాజపు సాంస్కృతిక జీవనంలో మాత్రం అంతకన్న ఎక్కువ మార్పులు తెచ్చింది. ప్రపంచీకరణతో వచ్చిన సరుకులూ సేవలూ పాలనా విధానాలూ అవినీతి సామాజిక ప్రవర్తనల మీద, ముఖ్యంగా మధ్యతరగతి జీవన విధానం మీద లోతైన ప్రభావాలు వేశాయి. కొన్ని రంగాల్లోనైతే అంతకు ముందరి జీవితానికీ, ఆ తర్వాతి జీవితానికీ పోలికే లేనంత మార్పు వచ్చింది. ఆ ప్రభావాల్లో, మార్పుల్లో గుర్తించినవాటి మీద ఎంతో కొంత విశ్లేషణ, అదీ ప్రధానంగా వ్యాసం, ఉపన్యాసం రూపాల్లో, కొంతవరకు కవిత్వ రూపంలో కూడా వెలువడింది. నిజానికి జీవితానికి, జీవిత శకలాలకు, సామాజిక, వైయుక్తిక విలువలకు కళాత్మక చిత్రణ ఇచ్చే కథ, నవల, నాటకం వంటి కాల్పనిక రూపాల్లో ఈ మార్పులను చిత్రించడం అవసరమూ సులభమూ కూడ. కాని ఈ రంగంలో తెలుగు సాహిత్యంలో కొంత పని జరిగినప్పటికీ, జరగవలసిన పనితో పోలిస్తే జరిగినది చాల తక్కువ.
అటువంటి తక్కువ పని జరిగిన రంగంలోకి ప్రవేశించి, ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పర్యవసానమైన జీవితానుభవాలను కథా ప్రక్రియలో కళాత్మకంగా చిత్రించినందుకు మిత్రులు వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు.
రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థిగా ఈ కథలు నాకు చాల ఆసక్తి కలిగించాయి. అభిమానించేలా చేశాయి. వీటిని మామూలు కథలుగా కాక రాజకీయార్థిక కథలుగా నిర్వచించి విశ్లేషించాలని నాకనిపిస్తున్నది. అసలు సాహిత్యమంతా తెలిసి గాని తెలియక గాని రాజకీయమే. జీవితమంతా తెలిసి గాని తెలియకగాని ఆర్థికమే. అయినప్పటికీ, ఓల్గా గారు తన స్త్రీ జీవితాంశాల కథలను రాజకీయ కథలు అని ప్రత్యేకంగా ప్రకటించినప్పుడు శుద్ధ సాహిత్యవాదులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. రాజకీయానికీ "శుద్ధంగా" ఉండవలసిన సాహిత్యానికీ పొసగదన్నారు. అలాగే ఇప్పుడు వీటిని రాజకీయార్థిక కథలు అంటున్నందుకు, ప్రధానంగా సాహిత్య ప్రక్రియ అయిన కథకు ఒక సైద్ధాంతిక విశేషణం జోడించడం అసంగతం అని కొందరు అనుకోవచ్చు, అనవచ్చు................
ఈ కాలానికి అవసరమైన రాజకీయార్థిక కథలు మూడు దశాబ్దాలకు పైగా మన దేశంలో ప్రకటితంగా సాగుతున్న ప్రపంచీకరణ క్రమం, దాన్ని ప్రవేశపెట్టిన పాలకులు ఏ ఆర్థిక లక్ష్యాలను కోరుకున్నారో వాటిని సాధించిందో లేదో గాని, మన సమాజపు సాంస్కృతిక జీవనంలో మాత్రం అంతకన్న ఎక్కువ మార్పులు తెచ్చింది. ప్రపంచీకరణతో వచ్చిన సరుకులూ సేవలూ పాలనా విధానాలూ అవినీతి సామాజిక ప్రవర్తనల మీద, ముఖ్యంగా మధ్యతరగతి జీవన విధానం మీద లోతైన ప్రభావాలు వేశాయి. కొన్ని రంగాల్లోనైతే అంతకు ముందరి జీవితానికీ, ఆ తర్వాతి జీవితానికీ పోలికే లేనంత మార్పు వచ్చింది. ఆ ప్రభావాల్లో, మార్పుల్లో గుర్తించినవాటి మీద ఎంతో కొంత విశ్లేషణ, అదీ ప్రధానంగా వ్యాసం, ఉపన్యాసం రూపాల్లో, కొంతవరకు కవిత్వ రూపంలో కూడా వెలువడింది. నిజానికి జీవితానికి, జీవిత శకలాలకు, సామాజిక, వైయుక్తిక విలువలకు కళాత్మక చిత్రణ ఇచ్చే కథ, నవల, నాటకం వంటి కాల్పనిక రూపాల్లో ఈ మార్పులను చిత్రించడం అవసరమూ సులభమూ కూడ. కాని ఈ రంగంలో తెలుగు సాహిత్యంలో కొంత పని జరిగినప్పటికీ, జరగవలసిన పనితో పోలిస్తే జరిగినది చాల తక్కువ. అటువంటి తక్కువ పని జరిగిన రంగంలోకి ప్రవేశించి, ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పర్యవసానమైన జీవితానుభవాలను కథా ప్రక్రియలో కళాత్మకంగా చిత్రించినందుకు మిత్రులు వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థిగా ఈ కథలు నాకు చాల ఆసక్తి కలిగించాయి. అభిమానించేలా చేశాయి. వీటిని మామూలు కథలుగా కాక రాజకీయార్థిక కథలుగా నిర్వచించి విశ్లేషించాలని నాకనిపిస్తున్నది. అసలు సాహిత్యమంతా తెలిసి గాని తెలియక గాని రాజకీయమే. జీవితమంతా తెలిసి గాని తెలియకగాని ఆర్థికమే. అయినప్పటికీ, ఓల్గా గారు తన స్త్రీ జీవితాంశాల కథలను రాజకీయ కథలు అని ప్రత్యేకంగా ప్రకటించినప్పుడు శుద్ధ సాహిత్యవాదులు ఆశ్చర్యం వెలిబుచ్చారు. రాజకీయానికీ "శుద్ధంగా" ఉండవలసిన సాహిత్యానికీ పొసగదన్నారు. అలాగే ఇప్పుడు వీటిని రాజకీయార్థిక కథలు అంటున్నందుకు, ప్రధానంగా సాహిత్య ప్రక్రియ అయిన కథకు ఒక సైద్ధాంతిక విశేషణం జోడించడం అసంగతం అని కొందరు అనుకోవచ్చు, అనవచ్చు................© 2017,www.logili.com All Rights Reserved.