వల్లూరు శివప్రసాద్ జీవితం తెలిసిన కధకుడు. స్పష్టమైన అభ్యుదయ సామజిక దృక్పథం గలవాడు. కధనికా లక్ష్యమూ, కధా నిర్మాణమూ తెలిసిన కధకుడు. అందుకే కధ ఎత్తుగడా, నడకా, ముగింపూ, భావజాలమూ, కధా లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతాయి. ఆయన కధల్లో మాయామర్మాలేవి వుండవు. చర్చలుండవు, ఉపన్యాసాలుండవు, వ్యాఖ్యానాలుండవు. భావాల బరువు అసలే వుండదు.
ఈ మధ్య కాలంలో 'తాత్వికత' 'తాత్వికత' అంటూ కొందరు 'ఫిలోఫర్లు' అరుస్తూ వుంటారే, ఆ 'తాత్వికత' ఊసే వుండదు. కధలో రచయితగా కూడా తానెక్కడా ప్రవేశించడు. రచయితకు తెలిసిన జీవితమే కధను ముందుకు నడిపిస్తుంది. చాలా సాధారణంగా వుంటూనే నిర్మాణరీత్యా లోతైన శిల్పం ఈ కధల్లో కనిపిస్తుంది. వస్తువులో, కంఠస్వరంలో, నడకలో, కలిసిపోయే శిల్పం అది! సుదీర్ఘకాలం తర్వాత వల్లూరు సాధించిన పరిణతి ఇది!.
రాజ్యం ఎవరి పక్షాన వుంటుంది? రాజ్యాన్ని నడిపించేదెవరు? రాజ్యం ప్రవేశపెట్టే సంక్షెమ పధకాలు ఎవరికీ అందాలో వారికే ఎందుకు అందటం లేదు? "ఎండమావి" కధలో బూబమ్మ లాంటి వాళ్లను ఎవరు భక్షిస్తున్నారు? వ్యవస్థ నగ్నస్వరూపం అర్ధం కావాలంటే మీరు 'ఎండమావి' ని జాగ్రత్తగా చదివి చూడండి. ఈ కధలోని బూబమ్మను గురించీ, మనసుబును గురించీ క్షణమైనా ఆలోచిస్తారు. అప్పుడు మీరు ఎవరి పక్షం నిలుస్తారు.
ఈ సంపుటిలోని 'తల్లి భూదేవి' కధ ఒక వాస్తవిక కధనం. ఒక వర్తమాన చారిత్రకాంశాన్నీ చీకటి కోణాన్ని, కధగా మలచటానికి వల్లూరు కనబరచిన శ్రద్ధ, కధా నిర్మాణం మనల్ని అబ్బుర పరుస్తుంది.
ఈ పుస్తకంలో 24కధలు వున్నవి.
- వల్లూరు శివప్రసాద్
వల్లూరు శివప్రసాద్ జీవితం తెలిసిన కధకుడు. స్పష్టమైన అభ్యుదయ సామజిక దృక్పథం గలవాడు. కధనికా లక్ష్యమూ, కధా నిర్మాణమూ తెలిసిన కధకుడు. అందుకే కధ ఎత్తుగడా, నడకా, ముగింపూ, భావజాలమూ, కధా లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతాయి. ఆయన కధల్లో మాయామర్మాలేవి వుండవు. చర్చలుండవు, ఉపన్యాసాలుండవు, వ్యాఖ్యానాలుండవు. భావాల బరువు అసలే వుండదు. ఈ మధ్య కాలంలో 'తాత్వికత' 'తాత్వికత' అంటూ కొందరు 'ఫిలోఫర్లు' అరుస్తూ వుంటారే, ఆ 'తాత్వికత' ఊసే వుండదు. కధలో రచయితగా కూడా తానెక్కడా ప్రవేశించడు. రచయితకు తెలిసిన జీవితమే కధను ముందుకు నడిపిస్తుంది. చాలా సాధారణంగా వుంటూనే నిర్మాణరీత్యా లోతైన శిల్పం ఈ కధల్లో కనిపిస్తుంది. వస్తువులో, కంఠస్వరంలో, నడకలో, కలిసిపోయే శిల్పం అది! సుదీర్ఘకాలం తర్వాత వల్లూరు సాధించిన పరిణతి ఇది!. రాజ్యం ఎవరి పక్షాన వుంటుంది? రాజ్యాన్ని నడిపించేదెవరు? రాజ్యం ప్రవేశపెట్టే సంక్షెమ పధకాలు ఎవరికీ అందాలో వారికే ఎందుకు అందటం లేదు? "ఎండమావి" కధలో బూబమ్మ లాంటి వాళ్లను ఎవరు భక్షిస్తున్నారు? వ్యవస్థ నగ్నస్వరూపం అర్ధం కావాలంటే మీరు 'ఎండమావి' ని జాగ్రత్తగా చదివి చూడండి. ఈ కధలోని బూబమ్మను గురించీ, మనసుబును గురించీ క్షణమైనా ఆలోచిస్తారు. అప్పుడు మీరు ఎవరి పక్షం నిలుస్తారు. ఈ సంపుటిలోని 'తల్లి భూదేవి' కధ ఒక వాస్తవిక కధనం. ఒక వర్తమాన చారిత్రకాంశాన్నీ చీకటి కోణాన్ని, కధగా మలచటానికి వల్లూరు కనబరచిన శ్రద్ధ, కధా నిర్మాణం మనల్ని అబ్బుర పరుస్తుంది. ఈ పుస్తకంలో 24కధలు వున్నవి. - వల్లూరు శివప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.