స్వర్ణకిరణాలు
వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ అనితర సాధ్యమైన సాహిత్య, సాంస్కృతిక కళావైజ్ఞాన సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ లోకవిఖ్యాతిని పొందిన సంస్థ. సాహితీకిరణం ఉత్తమ సాహిత్యసేవకు అంకితమై ఉన్నత విలువలతో నిర్వహించబడుతున్న సాహిత్య పత్రికగా ప్రసిద్ధిపొందింది. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన పోటీ కథలసంకలనం ఇది. వంశీ స్వర్ణోత్సవవేళ వెలువడుతున్న ఒక మంచి జ్ఞాపిక.
ఈ పోటీకి చిన్న కథల్ని ఆహ్వానించారు. ఇది ఒక మంచి ప్రయత్నం, ప్రయోగంకూడా.
ప్రపంచీకరణం తరువాత తెలుగుకథకూడా తన రూపురేఖల్ని మార్చుకుంది. కథ-మనిషి జీవితంలోని ఒక పార్శ్వాన్నో, కోణాన్నో, సంఘటననో, సంక్లిష్టతనో, సంఘర్షణనో, మానసిక వైచిత్రినో కేంద్రీకృతం చేసుకుని క్లుప్తతతో, వస్వైక్యతతో, శైలీ శిల్ప ప్రాధాన్యంతో చెప్పబడాలి అనే అభిప్రాయంనుండి పక్కకు తొలగి మనిషి జీవితాన్నంతా చిత్రిస్తూ - పిష్టపేషణాన్నీ, చర్విత చర్వణాన్ని ఆహ్లాదించటం నేర్చుకుంది. అలాగే, కారామాష్టారన్నట్టు గతంలో బతకటానికి మోజుపడుతూ ప్రస్తుతంలో జీవించటానికి ఆనందించకుండా నిలిచింది. ఇతివృత్తంలో................
స్వర్ణకిరణాలు వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ అనితర సాధ్యమైన సాహిత్య, సాంస్కృతిక కళావైజ్ఞాన సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ లోకవిఖ్యాతిని పొందిన సంస్థ. సాహితీకిరణం ఉత్తమ సాహిత్యసేవకు అంకితమై ఉన్నత విలువలతో నిర్వహించబడుతున్న సాహిత్య పత్రికగా ప్రసిద్ధిపొందింది. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన పోటీ కథలసంకలనం ఇది. వంశీ స్వర్ణోత్సవవేళ వెలువడుతున్న ఒక మంచి జ్ఞాపిక. ఈ పోటీకి చిన్న కథల్ని ఆహ్వానించారు. ఇది ఒక మంచి ప్రయత్నం, ప్రయోగంకూడా. ప్రపంచీకరణం తరువాత తెలుగుకథకూడా తన రూపురేఖల్ని మార్చుకుంది. కథ-మనిషి జీవితంలోని ఒక పార్శ్వాన్నో, కోణాన్నో, సంఘటననో, సంక్లిష్టతనో, సంఘర్షణనో, మానసిక వైచిత్రినో కేంద్రీకృతం చేసుకుని క్లుప్తతతో, వస్వైక్యతతో, శైలీ శిల్ప ప్రాధాన్యంతో చెప్పబడాలి అనే అభిప్రాయంనుండి పక్కకు తొలగి మనిషి జీవితాన్నంతా చిత్రిస్తూ - పిష్టపేషణాన్నీ, చర్విత చర్వణాన్ని ఆహ్లాదించటం నేర్చుకుంది. అలాగే, కారామాష్టారన్నట్టు గతంలో బతకటానికి మోజుపడుతూ ప్రస్తుతంలో జీవించటానికి ఆనందించకుండా నిలిచింది. ఇతివృత్తంలో................© 2017,www.logili.com All Rights Reserved.