పల్లవ హనుమయ్య
- ఇస్మాయిల్ హనుమయ్య గారిని చూస్తే నాకు Old Testament లోని ప్రవక్తలు గుర్తుకొస్తారు. ఎటువంటి సందేహాల్నెనా తరిమికొట్టే తుఫానులాంటి భక్తి, క్షితిజరేఖను దాటి చూడగలిగే దార్శనికతా, ఒక కంట కరుణాశ్రువులూ, మరో కంట కోపాగ్ని శిఖలూ, గొప్ప నమ్రతా, వెనువెంటనే ఆధ్యాత్మికమైన అహంకారమూ, వీళ్ళు మనుషుల్ని ప్రేమిస్తున్నారో ద్వేషిస్తున్నారో తెలిసికోవటం ఒక్కొక్కపుడు అసాధ్యమౌతుంది. వీరి దయా సముద్రం పొంగి పొరలినపుడు ప్రేమకీ ద్వేషానికి మధ్య సరిహద్దులు చెరిగి పోతుంటాయి. భగవంతుడి విషయంలోనూ అంతే. తల్లిని వెతుక్కునే తప్పిపోయిన బిడ్డలా ఒక్కొక్కసారి బెంబేలు పడిపోతారు మళ్లా. స్కూల్ మాష్టర్ బడిపిల్లాడిని అదిలించినట్లు దేవుళ్లే ఒకొక్కపుడు అదిలిస్తుంటారు. ఆ
కోవకు చెందినవాడు హనుమయ్యగారు.
టాగోర్‌లో కూడా పోలిక తీసుకురావచ్చు. ఐతే, టాగోర్ కవిత్వం వెదురు పొదల్లో గాలిలా మెత్తగా వీస్తూంది. హనుమయ్యగారిది ఎడారిలో పరిగెత్తే హోరుగాలి. అన్ని దిక్కుల్నుంచీ ఒకేమారు వీచటానికి ప్రయత్నించే వెర్రిగాలి. దిక్కుతోచని గాలి. 'టాగోర్ బీదవాళ్లని గురించి కూడా అందంగా చెబుతాడు. హనుమయ్య గారి పేదలు మనకు రోజూ ఎదురయే వాళ్లే. హనుమయ్య ఆకలెరుగును.
హనుమయ్య మహాభక్తుడు. నేను భక్తుణ్ణి కాను. అసలు భగవంతుడి అస్తిత్వం గురించే నాకు సందేహాలున్నాయి. ఐనా, నేను హనుమయ్య గారి కవిత్వాన్ని ఆస్వాదించగలను. మనిషి అస్తిత్వం గురించీ, జీవితపు అర్థం గురించీ తరచి తెలిసికోవాలనే తపనా, ఆందోళనా, మనిషి యెడల గొప్ప జాలీ, ప్రేమా ఆయన కవిత్వానికి చేదుకుంటాయి నన్ను, ఏ మతానికైనా తత్వానికైనా, చివరికి విజ్ఞాన శాస్త్రానికైనా మౌలికమైన మానసిక వైఖరి ఇది. మతమూ, దర్శనమూ,
జ్ఞానమూ తమ సుదీర్ఘ ప్రస్థానాలు మొదలెట్టేది ఈ ఘట్టాన్నించే. నువు భక్తి గీతాల్ని.................
పల్లవ హనుమయ్య - ఇస్మాయిల్ హనుమయ్య గారిని చూస్తే నాకు Old Testament లోని ప్రవక్తలు గుర్తుకొస్తారు. ఎటువంటి సందేహాల్నెనా తరిమికొట్టే తుఫానులాంటి భక్తి, క్షితిజరేఖను దాటి చూడగలిగే దార్శనికతా, ఒక కంట కరుణాశ్రువులూ, మరో కంట కోపాగ్ని శిఖలూ, గొప్ప నమ్రతా, వెనువెంటనే ఆధ్యాత్మికమైన అహంకారమూ, వీళ్ళు మనుషుల్ని ప్రేమిస్తున్నారో ద్వేషిస్తున్నారో తెలిసికోవటం ఒక్కొక్కపుడు అసాధ్యమౌతుంది. వీరి దయా సముద్రం పొంగి పొరలినపుడు ప్రేమకీ ద్వేషానికి మధ్య సరిహద్దులు చెరిగి పోతుంటాయి. భగవంతుడి విషయంలోనూ అంతే. తల్లిని వెతుక్కునే తప్పిపోయిన బిడ్డలా ఒక్కొక్కసారి బెంబేలు పడిపోతారు మళ్లా. స్కూల్ మాష్టర్ బడిపిల్లాడిని అదిలించినట్లు దేవుళ్లే ఒకొక్కపుడు అదిలిస్తుంటారు. ఆ కోవకు చెందినవాడు హనుమయ్యగారు. టాగోర్‌లో కూడా పోలిక తీసుకురావచ్చు. ఐతే, టాగోర్ కవిత్వం వెదురు పొదల్లో గాలిలా మెత్తగా వీస్తూంది. హనుమయ్యగారిది ఎడారిలో పరిగెత్తే హోరుగాలి. అన్ని దిక్కుల్నుంచీ ఒకేమారు వీచటానికి ప్రయత్నించే వెర్రిగాలి. దిక్కుతోచని గాలి. 'టాగోర్ బీదవాళ్లని గురించి కూడా అందంగా చెబుతాడు. హనుమయ్య గారి పేదలు మనకు రోజూ ఎదురయే వాళ్లే. హనుమయ్య ఆకలెరుగును. హనుమయ్య మహాభక్తుడు. నేను భక్తుణ్ణి కాను. అసలు భగవంతుడి అస్తిత్వం గురించే నాకు సందేహాలున్నాయి. ఐనా, నేను హనుమయ్య గారి కవిత్వాన్ని ఆస్వాదించగలను. మనిషి అస్తిత్వం గురించీ, జీవితపు అర్థం గురించీ తరచి తెలిసికోవాలనే తపనా, ఆందోళనా, మనిషి యెడల గొప్ప జాలీ, ప్రేమా ఆయన కవిత్వానికి చేదుకుంటాయి నన్ను, ఏ మతానికైనా తత్వానికైనా, చివరికి విజ్ఞాన శాస్త్రానికైనా మౌలికమైన మానసిక వైఖరి ఇది. మతమూ, దర్శనమూ, జ్ఞానమూ తమ సుదీర్ఘ ప్రస్థానాలు మొదలెట్టేది ఈ ఘట్టాన్నించే. నువు భక్తి గీతాల్ని.................© 2017,www.logili.com All Rights Reserved.