నాగరికతా ప్రక్రియ తప్పనిసరిగా సహజ వాంఛల అణచివేతకు దారితీస్తూందని, దేనికి సకారాత్మక పరిష్కారం సహజాత శక్తిని సృజనాత్మక, శాస్త్ర, సాంకేతిక, మానవీయ రంగాలలో కృషిలోకి మళ్ళించడం కాగా, ఇది సాధించలేని వ్యక్తులలో ఈ అణచివేత మానసిక రుగ్మతకు కారణమవుతుందని ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ సమాజ జనిత ఆంక్షలు, నిషేధాలు ముఖ్యంగా లైంగిక విషయంలో అమలు చేయబడతాయని, ఇందుకు పునాది మనిషి ద్విపాద జీవిగా రూపొందిన క్రమంలోనే ఉందని ఫ్రాయిడ్ భావన. మానవునికుండే సహజాతాలలో దౌర్జన్యత కూడా ఒకటని ఫ్రాయిడ్ ఈ రచనలో పేర్కొన్నాడు.
బాహ్య ప్రపంచంపై ఈ దౌర్జన్యత చూపలేనప్పుడు అది మనిషి అంతరాత్మపై అజమాయిషీ చేయడం ద్వారా, వ్యక్తిని వ్యాకులతకు గురిచేస్తుంది. బాహ్య ప్రపంచ దిశగా ఇది మార్చలబడినప్పుడు, ఘర్షణలకు, యుద్ధాలకు దారి తీస్తోంది. ఈ దౌర్జన్యా సహజాతం మృత్యు సహజాతంగా పరిణమిస్తుందని ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డాడు. మృత్యు సహజాతానికి, జీవ సహజాతానికి మధ్య జరిగే ఈ పోరాట క్రమమే నాగరికత. దౌర్జన్య, మ్రుత్యుసహజాతాల వాస్తవికతపై విమర్శలు వెలువడినప్పటికీ, మానవ స్వభావాన్ని, వ్యక్తికి - సమాజానికి మధ్య ఉండే సంబంధాన్ని, సామాజిక పరిణామ క్రమంలో ఏర్పడే ఘర్షణలు, వైరుధ్యాలను అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడవచ్చు.నాగరికతల మధ్య ఘర్షణ పేరిట యుద్ధం - శాంతి మధ్య తేడాను గందరగోళ పరుస్తున్న భావజాలం చలామణి అవుతున్న వర్తమాన ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి కూడా ఇటువంటి పుస్తకాలు అవసరం.
నాగరికతా ప్రక్రియ తప్పనిసరిగా సహజ వాంఛల అణచివేతకు దారితీస్తూందని, దేనికి సకారాత్మక పరిష్కారం సహజాత శక్తిని సృజనాత్మక, శాస్త్ర, సాంకేతిక, మానవీయ రంగాలలో కృషిలోకి మళ్ళించడం కాగా, ఇది సాధించలేని వ్యక్తులలో ఈ అణచివేత మానసిక రుగ్మతకు కారణమవుతుందని ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ సమాజ జనిత ఆంక్షలు, నిషేధాలు ముఖ్యంగా లైంగిక విషయంలో అమలు చేయబడతాయని, ఇందుకు పునాది మనిషి ద్విపాద జీవిగా రూపొందిన క్రమంలోనే ఉందని ఫ్రాయిడ్ భావన. మానవునికుండే సహజాతాలలో దౌర్జన్యత కూడా ఒకటని ఫ్రాయిడ్ ఈ రచనలో పేర్కొన్నాడు. బాహ్య ప్రపంచంపై ఈ దౌర్జన్యత చూపలేనప్పుడు అది మనిషి అంతరాత్మపై అజమాయిషీ చేయడం ద్వారా, వ్యక్తిని వ్యాకులతకు గురిచేస్తుంది. బాహ్య ప్రపంచ దిశగా ఇది మార్చలబడినప్పుడు, ఘర్షణలకు, యుద్ధాలకు దారి తీస్తోంది. ఈ దౌర్జన్యా సహజాతం మృత్యు సహజాతంగా పరిణమిస్తుందని ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డాడు. మృత్యు సహజాతానికి, జీవ సహజాతానికి మధ్య జరిగే ఈ పోరాట క్రమమే నాగరికత. దౌర్జన్య, మ్రుత్యుసహజాతాల వాస్తవికతపై విమర్శలు వెలువడినప్పటికీ, మానవ స్వభావాన్ని, వ్యక్తికి - సమాజానికి మధ్య ఉండే సంబంధాన్ని, సామాజిక పరిణామ క్రమంలో ఏర్పడే ఘర్షణలు, వైరుధ్యాలను అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడవచ్చు.నాగరికతల మధ్య ఘర్షణ పేరిట యుద్ధం - శాంతి మధ్య తేడాను గందరగోళ పరుస్తున్న భావజాలం చలామణి అవుతున్న వర్తమాన ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి కూడా ఇటువంటి పుస్తకాలు అవసరం.
© 2017,www.logili.com All Rights Reserved.