ప్రవాస భారతీయ జీవితాన్నీ గురించీ, అక్కడి సంవేదనల గురించీ నిత్యం ఆర్తి చెందే సృజనాత్మక రచయితల్లో మిత్రుడు బ్రహ్మానందం ఒకరు. ఆయనకు ప్రాచీన ఆధునిక సాహిత్యాలతోనూ, సంగీతంతోనూ చక్కని పరిచయం ఉంది. నాటక సాహిత్య రచన పట్ల కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. కథల్లో ప్రముఖంగ మనస్తత్వ విశ్లేషణా, వ్యక్తిత్వ ఆకాంక్షల అన్వేషణా కనిపిస్తాయి. చదువుతున్నంత సేపూ మనల్నికట్టిపడేస్తాయి. చక్కటి నుడికారంతో కూడిన శైలి కథల్ని మరింత చదివించేలా చేస్తాయి.
- డా. కేతు విశ్వనాథ రెడ్డి
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
వస్తువు, కథనం సమపాళ్ళలో రంగరించి కథలు రాస్తున్న బహుకొద్దిమంది అమెరికాలో స్థిరపడ్డ రచయితల్లో బ్రహ్మానందం ఒకరు. అందుకే అతని కథలు చదవడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ సంకలనంలోని కొన్ని కథలు మొదటి సారిగా వెబ్-పత్రిక, ఈమాటలో ప్రచురించబడ్డాయి.
- వేలూరి వేంకటేశ్వరరావు
ఈమాట సంపాదకులు
కథ రాయడం కష్టం. అందునా ఒక సంస్కృతిలో పుట్టి పెరిగి మరో సంస్కృతిలో జీవిస్తూ కథలు రాయడం మరీ కష్టం. తొలి రోజుల్లో తన ప్రాంత పరిధిలోని జీవితాలను కథలుగా మలచడంతో ప్రారంభమైన గొర్తి సాయి బ్రహ్మానందం కథా ప్రయాణం అమెరికాలోని సంక్లిష్ట జీవన విధానాన్ని అక్కడి వారు మాత్రమే రాయగలిగే కథావస్తువుతో కథలు రాయడం వరకు కొనసాగింది. అందుకు ఉదాహరణే ఇటీవల రాసిన 'అతను’, 'సరిహద్దు' కథలు.
- వాసిరెడ్డి నవీన్
కధాసాహితి సంపాదకులు
ప్రవాస భారతీయ జీవితాన్నీ గురించీ, అక్కడి సంవేదనల గురించీ నిత్యం ఆర్తి చెందే సృజనాత్మక రచయితల్లో మిత్రుడు బ్రహ్మానందం ఒకరు. ఆయనకు ప్రాచీన ఆధునిక సాహిత్యాలతోనూ, సంగీతంతోనూ చక్కని పరిచయం ఉంది. నాటక సాహిత్య రచన పట్ల కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. కథల్లో ప్రముఖంగ మనస్తత్వ విశ్లేషణా, వ్యక్తిత్వ ఆకాంక్షల అన్వేషణా కనిపిస్తాయి. చదువుతున్నంత సేపూ మనల్నికట్టిపడేస్తాయి. చక్కటి నుడికారంతో కూడిన శైలి కథల్ని మరింత చదివించేలా చేస్తాయి. - డా. కేతు విశ్వనాథ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వస్తువు, కథనం సమపాళ్ళలో రంగరించి కథలు రాస్తున్న బహుకొద్దిమంది అమెరికాలో స్థిరపడ్డ రచయితల్లో బ్రహ్మానందం ఒకరు. అందుకే అతని కథలు చదవడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ సంకలనంలోని కొన్ని కథలు మొదటి సారిగా వెబ్-పత్రిక, ఈమాటలో ప్రచురించబడ్డాయి. - వేలూరి వేంకటేశ్వరరావు ఈమాట సంపాదకులు కథ రాయడం కష్టం. అందునా ఒక సంస్కృతిలో పుట్టి పెరిగి మరో సంస్కృతిలో జీవిస్తూ కథలు రాయడం మరీ కష్టం. తొలి రోజుల్లో తన ప్రాంత పరిధిలోని జీవితాలను కథలుగా మలచడంతో ప్రారంభమైన గొర్తి సాయి బ్రహ్మానందం కథా ప్రయాణం అమెరికాలోని సంక్లిష్ట జీవన విధానాన్ని అక్కడి వారు మాత్రమే రాయగలిగే కథావస్తువుతో కథలు రాయడం వరకు కొనసాగింది. అందుకు ఉదాహరణే ఇటీవల రాసిన 'అతను’, 'సరిహద్దు' కథలు. - వాసిరెడ్డి నవీన్ కధాసాహితి సంపాదకులు
© 2017,www.logili.com All Rights Reserved.