శిల తనను తాను చెక్కుకుని శిల్పంగా మార్చుకున్నట్టు తపస్సమాన దీక్షతో, చిత్తశుద్ధితో కూడిన లక్ష్యంతో తను నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరిన సాహిత్యవేత్త అంపశయ్య నవీన్. 'ఆంధ్రజ్యోతి' పత్రిక సాధికారకత కల్గిన ప్రముఖులతో ఒక కమిటీని కూర్చి గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో ఉత్తమమైన వంద గ్రంధాలను ఎంపిక చేయమని నియమిస్తే వాళ్ళు సమగ్రంగా అధ్యయనం చేసి ఎన్నుకున్న ఆణిముత్యాల్లాంటి వంద సాహిత్య గ్రంధాల్లో నవీన్ రాసిన 'అంపశయ్య' నవల కూడా ఉండడం తెలుగు నవలా సాహిత్యాభిమానులందరూ గర్వించదగ్గ విషయం. తను ఈ స్థితికి చేరడానికి పడ్డ తపన, చేసిన కృషి, అసలు సాహిత్యానికీ తన కుటుంబ నేపధ్యానికీ ఎటువంటి సంబంధంలేని సంగతులు.. అన్నీ ఈ పుస్తకంలోని ఒక వ్యాసంలో చదవుతున్నప్పుడు 'ఔరా.. ఇతను రాతినేల నుండి రావిమొలకలా ఎలా చోచ్చుకోచ్చాడు' అని మనం ఆశ్చర్యపోతాం. కాగా ఒక్క కవిత్వం, నాటకం తప్ప నవీన్ దాదాపు సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ విశేషమైన ప్రతిభను కనబర్చి తనదైన ముద్రను మిగిల్చారు. నాలాంటి సన్నిహితులకు తెలిసిన రహస్యమేమిటంటే ఈనాడు కవిత్వం రాస్తున్న చాలామంది ప్రముఖ కవులకంటే ఎక్కువ 'కవిత్వం' గురించి కూడా నవీన్ కు చాలా విషయాలు తెలుసు. అందుకే 1969లో శ్రీశ్రీ తో జరిపిన మఖాముఖిలో అనేక కవిత్వ సంబంధ విషయాలను ఆయన ఎంతో అర్ధవంతంగా చర్చించడం.. ఈ పుస్తకంలోని ఒక వ్యాసంలో మనం గమనించవచ్చు. వడ్డెర చండీదాస్ గురించిన వ్యాసంలో అనేక గాఢమైన తాత్విక విషయాలను నవీన్ విశ్లేషించిన తీరు విజ్ఞులను అలరిస్తుంది. అస్తిత్వవాద సూత్రాలను గురించి చెబుతూ 'భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగం మొదలైనవన్ని స్వేచ్చను హరించేవే. వ్యవస్థ నిర్ణయించిన ధర్మం కాదు - తనకై తానే తన ధర్మమేమిటో నిర్ణయించుకోవాలి. ఏ వ్యవస్థకూ లొంగకపోవడం ద్వారానే వ్యక్తీ తన స్వేచ్చను కాపాడుకోగల్గుతాడు' వంటి ప్రస్తావనలు నవీన్ లోతునూ, గాఢతనూ, విశ్లేషణాపటిమనూ పట్టిస్తాయి. బహుముఖమైన విషయాలపై వివిధ సందర్భాల్లో రాయబడ్డ ఈ వ్యాసాలు నవీన్ ను నిశితమైన ద్రష్టిగల సాహిత్య విమర్శకునిగా దర్శింపజేస్తాయి.
- అంపశయ్య నవీన్
శిల తనను తాను చెక్కుకుని శిల్పంగా మార్చుకున్నట్టు తపస్సమాన దీక్షతో, చిత్తశుద్ధితో కూడిన లక్ష్యంతో తను నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరిన సాహిత్యవేత్త అంపశయ్య నవీన్. 'ఆంధ్రజ్యోతి' పత్రిక సాధికారకత కల్గిన ప్రముఖులతో ఒక కమిటీని కూర్చి గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో ఉత్తమమైన వంద గ్రంధాలను ఎంపిక చేయమని నియమిస్తే వాళ్ళు సమగ్రంగా అధ్యయనం చేసి ఎన్నుకున్న ఆణిముత్యాల్లాంటి వంద సాహిత్య గ్రంధాల్లో నవీన్ రాసిన 'అంపశయ్య' నవల కూడా ఉండడం తెలుగు నవలా సాహిత్యాభిమానులందరూ గర్వించదగ్గ విషయం. తను ఈ స్థితికి చేరడానికి పడ్డ తపన, చేసిన కృషి, అసలు సాహిత్యానికీ తన కుటుంబ నేపధ్యానికీ ఎటువంటి సంబంధంలేని సంగతులు.. అన్నీ ఈ పుస్తకంలోని ఒక వ్యాసంలో చదవుతున్నప్పుడు 'ఔరా.. ఇతను రాతినేల నుండి రావిమొలకలా ఎలా చోచ్చుకోచ్చాడు' అని మనం ఆశ్చర్యపోతాం. కాగా ఒక్క కవిత్వం, నాటకం తప్ప నవీన్ దాదాపు సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ విశేషమైన ప్రతిభను కనబర్చి తనదైన ముద్రను మిగిల్చారు. నాలాంటి సన్నిహితులకు తెలిసిన రహస్యమేమిటంటే ఈనాడు కవిత్వం రాస్తున్న చాలామంది ప్రముఖ కవులకంటే ఎక్కువ 'కవిత్వం' గురించి కూడా నవీన్ కు చాలా విషయాలు తెలుసు. అందుకే 1969లో శ్రీశ్రీ తో జరిపిన మఖాముఖిలో అనేక కవిత్వ సంబంధ విషయాలను ఆయన ఎంతో అర్ధవంతంగా చర్చించడం.. ఈ పుస్తకంలోని ఒక వ్యాసంలో మనం గమనించవచ్చు. వడ్డెర చండీదాస్ గురించిన వ్యాసంలో అనేక గాఢమైన తాత్విక విషయాలను నవీన్ విశ్లేషించిన తీరు విజ్ఞులను అలరిస్తుంది. అస్తిత్వవాద సూత్రాలను గురించి చెబుతూ 'భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగం మొదలైనవన్ని స్వేచ్చను హరించేవే. వ్యవస్థ నిర్ణయించిన ధర్మం కాదు - తనకై తానే తన ధర్మమేమిటో నిర్ణయించుకోవాలి. ఏ వ్యవస్థకూ లొంగకపోవడం ద్వారానే వ్యక్తీ తన స్వేచ్చను కాపాడుకోగల్గుతాడు' వంటి ప్రస్తావనలు నవీన్ లోతునూ, గాఢతనూ, విశ్లేషణాపటిమనూ పట్టిస్తాయి. బహుముఖమైన విషయాలపై వివిధ సందర్భాల్లో రాయబడ్డ ఈ వ్యాసాలు నవీన్ ను నిశితమైన ద్రష్టిగల సాహిత్య విమర్శకునిగా దర్శింపజేస్తాయి. - అంపశయ్య నవీన్© 2017,www.logili.com All Rights Reserved.