ఊళ్ళో చేరుకుతోపాటు వ్యవసాయం ఎక్కువ. దానికి తగ్గట్టే బెల్లం గానుగులు కూడా ఉండేవి.
నా చిన్నప్పుడు సెలవుల్లో అమ్మమ్మగారింటికెళ్లినప్పుడల్లా టంచనుగా మాత్రం బెల్లం గానుగ దగ్గరికెళ్ళిపోయేవోడ్ని.
"కొత్త పందొమ్మిది రకం చేరుకైతే తొక్క తేలిగ్గా వచ్చేస్తాది, రసం తియ్యగా ఉంటదనే" లాంటి మిడిమిడి జ్ఞానం అక్కడే సంపాదించెను నేను.
ముంతలు పట్టుకెళ్లడానికి వచ్చిన మునెయ్యతో కల్సి చేలోకి పరిగెత్తి , డబ్బకాల్విని చేర్చి ఉన్న రిమ్మలపుడోరి పొలం గట్లమీదనించి నడుచుకుంటా బెల్లం గానుగ దగ్గరకెళ్ళేసరికి పొయ్యి మీదున్న బెల్లం పెనంలోంచి పొడుగాటి చట్రంలో తెట్టు తీస్తున్న తాతయ్య కనబడేవాడు.. తాతయ్య మంచి పేరుండేది బెల్లం మండటంలో.... తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఒకప్పుడు కట్టమూరు బెల్లం కాశిదాకా వెళ్లేదని పేరు.
కట్టమూరు బెల్లం అంత ఫేమస్ అంట అప్పట్లో..