సాహిత్యమనే మహాసాగరంలో క్రైం కథ ఒక ప్రత్యేకమైన పాయ లాంటిది. చిన్నచూపు చూడటం వల్ల లాభంలేదు. క్రైం కథలు సామాజిక మనస్తత్వాలను, నిరాశలను, ఆవేశాలను ప్రదర్శించి హెచ్చరిస్తాయి. సామాజిక మనస్సాక్షిని తట్టిలేపుతాయి. అంతేకాదు, ఆసక్తిగా ఉండి పాఠకులలో పఠనాసక్తిని రేకెత్తిస్తాయి. సాహిత్య శిఖరారోహణలో తొలిమెట్లలో ఒక మెట్టు క్రైం కథ, నిజాయితీతో, నిబద్ధతతో రాసిన ఏ కథ కూడా ఎవరికీ చెడు చేయదు. ఇది నా నమ్మకం, అనుభవం. కాబట్టి క్రైం కథలు రాయటం, చదవటం నేరం కాదు. ఇవి మన జీవితాలలోని ఓ లోటును పూడ్చి కాస్త ఉత్సాహాన్ని, కాస్త ఆలోచనను కలిగిస్తాయి. డిటెక్టివ్ శరత్ కథలలో నేను డిటెక్టివ్ కథా రచనలో ఎన్ని పద్ధతులు, ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాలూ వాడాను. వాడుతున్నాను. ఈ డిటెక్టివ్ శరత్ పరిశోధన కథలను మీరు ఆదరిస్తారన్న విశ్వాసం నాకు ఉంది.
సాహిత్యమనే మహాసాగరంలో క్రైం కథ ఒక ప్రత్యేకమైన పాయ లాంటిది. చిన్నచూపు చూడటం వల్ల లాభంలేదు. క్రైం కథలు సామాజిక మనస్తత్వాలను, నిరాశలను, ఆవేశాలను ప్రదర్శించి హెచ్చరిస్తాయి. సామాజిక మనస్సాక్షిని తట్టిలేపుతాయి. అంతేకాదు, ఆసక్తిగా ఉండి పాఠకులలో పఠనాసక్తిని రేకెత్తిస్తాయి. సాహిత్య శిఖరారోహణలో తొలిమెట్లలో ఒక మెట్టు క్రైం కథ, నిజాయితీతో, నిబద్ధతతో రాసిన ఏ కథ కూడా ఎవరికీ చెడు చేయదు. ఇది నా నమ్మకం, అనుభవం. కాబట్టి క్రైం కథలు రాయటం, చదవటం నేరం కాదు. ఇవి మన జీవితాలలోని ఓ లోటును పూడ్చి కాస్త ఉత్సాహాన్ని, కాస్త ఆలోచనను కలిగిస్తాయి. డిటెక్టివ్ శరత్ కథలలో నేను డిటెక్టివ్ కథా రచనలో ఎన్ని పద్ధతులు, ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాలూ వాడాను. వాడుతున్నాను. ఈ డిటెక్టివ్ శరత్ పరిశోధన కథలను మీరు ఆదరిస్తారన్న విశ్వాసం నాకు ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.