భారత చైనాల గొప్పనాగరికతలను బౌద్ధధర్మం వేయి సంవత్సరాలకు పైగా సన్నిహితంగా కలిపి ఉంచింది. రాజకీయ, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా కేవలం ధర్మం మీద ఆధారబడిన ఇటువంటి అనుబంధం మానవసంబంధాల చరిత్రలో మరెక్కడా కానరాదు. రెండు దేశాలకు చెందిన పండితభిక్షువులు సంపుటాలకొద్దీ పవిత్రగ్రంథాలను చైనాకు తీసుకొనిపోయి సంస్కృతం నుండి చైనాభాషలోనికి అనువదించటం కూడా అభూతపూర్వవిషయమే.
ఫాహియాన్ క్రీ. శ. 400 లో చైనాలోని చాంగన్ లో నివసించేవాడు. అతడు ఆ నగరంలో భిక్షునియమాలు అసమగ్రంగా ఉండటం చూసి చాలా బాధపడినాడు. అంతేకాదు చైనాలో వ్యాప్తిలోనున్న బౌద్ధగ్రంథాలు కూడా చాలావరకు తప్పులతో ఉన్నాయి అందువల్లనే ఫాహియాన్ సరియైన బౌద్ధగ్రంథాలకోసం, ముఖ్యంగా వినయపిటకంకోసం భారతదేశయాత్రకు పూనుకొని చాంగన్ నుండి క్రీ. శ. 401 లో బయలుదేరాడు. అనువాదాన్ని యథామూలంగా చేశాను.
- మోక్షానంద
భారత చైనాల గొప్పనాగరికతలను బౌద్ధధర్మం వేయి సంవత్సరాలకు పైగా సన్నిహితంగా కలిపి ఉంచింది. రాజకీయ, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా కేవలం ధర్మం మీద ఆధారబడిన ఇటువంటి అనుబంధం మానవసంబంధాల చరిత్రలో మరెక్కడా కానరాదు. రెండు దేశాలకు చెందిన పండితభిక్షువులు సంపుటాలకొద్దీ పవిత్రగ్రంథాలను చైనాకు తీసుకొనిపోయి సంస్కృతం నుండి చైనాభాషలోనికి అనువదించటం కూడా అభూతపూర్వవిషయమే. ఫాహియాన్ క్రీ. శ. 400 లో చైనాలోని చాంగన్ లో నివసించేవాడు. అతడు ఆ నగరంలో భిక్షునియమాలు అసమగ్రంగా ఉండటం చూసి చాలా బాధపడినాడు. అంతేకాదు చైనాలో వ్యాప్తిలోనున్న బౌద్ధగ్రంథాలు కూడా చాలావరకు తప్పులతో ఉన్నాయి అందువల్లనే ఫాహియాన్ సరియైన బౌద్ధగ్రంథాలకోసం, ముఖ్యంగా వినయపిటకంకోసం భారతదేశయాత్రకు పూనుకొని చాంగన్ నుండి క్రీ. శ. 401 లో బయలుదేరాడు. అనువాదాన్ని యథామూలంగా చేశాను. - మోక్షానంద© 2017,www.logili.com All Rights Reserved.