అర్థవలస - అర్థఫ్యూడల్ సమాజం కలిగివున్న ఒక ఆసియా దేశంలో కార్మిక వర్గనాయకత్వంలో జరిగిన నూతన ప్రజాతంత్ర విప్లవమే చైనా విప్లవం (1949). ఆ విధంగా అటువంటి వాటిలో అది మొదటిది కూడా. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుండిన మన ప్రజలు ఆ విప్లవానుభవాలని తెలుసుకోవాలనీ, మనదేశ నిర్దిష్ట పరిస్థితులను దృష్టిలో వుంచుకొని వాటిని తమ పోరాటానికి అన్వయించుకోవాలనీ ఆసక్తి చూపడం సహజం. కార్మికవర్గ అగ్రగామి అయిన ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమయింది. చైనా కమ్యూ నిస్టులు తమ విప్లవానుభవాలని క్రోడీకరించి అభివృద్ధి చేసిన కొన్ని సరైన సిద్ధాంతా లని సవాలు చేయడానికి కూడా ఒకానొక దశలో (1949) పార్టీ నాయకత్వం లోని ఒక పెద్ద సెక్షను సాహసించింది. మనదేశంలోని విప్లవోద్యమాను భవాల నుంచే ఏమీ నేర్చుకోని ఈ నాయకత్వం ఈ పని (ఇతరుల నుంచి నేర్చుకోవడం) చేస్తుందని ఆశించడం తప్పే అవుతుంది.
కానీ మన దేశంలో సాగుతుండిన విప్లవ జాతీయోద్యమంపై చైనా విప్లవ పురోగమన ప్రభావం, జపాన్ వ్యతిరేక యుద్ధకాలంలో ప్రత్యేకించి హెచ్చుగా ఉంది. సంస్కరణవాద నాయకత్వంలో ఉన్నప్పటికీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఒక వైద్య బృందాన్ని చైనాకి పంపినప్పుడు ఆ ప్రభావం ఖచ్చితమైన రూపం తీసుకోనారంభించింది. దాని ఉద్దేశం విప్లవ చైనా ప్రజలకి వైద్యసహాయం అందజేయడమే అయినప్పటికీ, అది మనదేశంలోని బ్రిటీష్ వ్యతిరేక జాతీయోద్య మానికి, చైనాలోని జపాన్ వ్యతిరేక జాతీయ విముక్తి పోరాటానికీ మధ్యగల సంఘీభావాన్ని ప్రదర్శించడమే...............
మొదటి భాగం చైనాలో సోషలిస్టు విప్లవం - కొన్ని సమస్యలు అర్థవలస - అర్థఫ్యూడల్ సమాజం కలిగివున్న ఒక ఆసియా దేశంలో కార్మిక వర్గనాయకత్వంలో జరిగిన నూతన ప్రజాతంత్ర విప్లవమే చైనా విప్లవం (1949). ఆ విధంగా అటువంటి వాటిలో అది మొదటిది కూడా. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుండిన మన ప్రజలు ఆ విప్లవానుభవాలని తెలుసుకోవాలనీ, మనదేశ నిర్దిష్ట పరిస్థితులను దృష్టిలో వుంచుకొని వాటిని తమ పోరాటానికి అన్వయించుకోవాలనీ ఆసక్తి చూపడం సహజం. కార్మికవర్గ అగ్రగామి అయిన ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమయింది. చైనా కమ్యూ నిస్టులు తమ విప్లవానుభవాలని క్రోడీకరించి అభివృద్ధి చేసిన కొన్ని సరైన సిద్ధాంతా లని సవాలు చేయడానికి కూడా ఒకానొక దశలో (1949) పార్టీ నాయకత్వం లోని ఒక పెద్ద సెక్షను సాహసించింది. మనదేశంలోని విప్లవోద్యమాను భవాల నుంచే ఏమీ నేర్చుకోని ఈ నాయకత్వం ఈ పని (ఇతరుల నుంచి నేర్చుకోవడం) చేస్తుందని ఆశించడం తప్పే అవుతుంది. కానీ మన దేశంలో సాగుతుండిన విప్లవ జాతీయోద్యమంపై చైనా విప్లవ పురోగమన ప్రభావం, జపాన్ వ్యతిరేక యుద్ధకాలంలో ప్రత్యేకించి హెచ్చుగా ఉంది. సంస్కరణవాద నాయకత్వంలో ఉన్నప్పటికీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఒక వైద్య బృందాన్ని చైనాకి పంపినప్పుడు ఆ ప్రభావం ఖచ్చితమైన రూపం తీసుకోనారంభించింది. దాని ఉద్దేశం విప్లవ చైనా ప్రజలకి వైద్యసహాయం అందజేయడమే అయినప్పటికీ, అది మనదేశంలోని బ్రిటీష్ వ్యతిరేక జాతీయోద్య మానికి, చైనాలోని జపాన్ వ్యతిరేక జాతీయ విముక్తి పోరాటానికీ మధ్యగల సంఘీభావాన్ని ప్రదర్శించడమే...............© 2017,www.logili.com All Rights Reserved.