నా మాట
మే 2013 న పోలాండ్ నుండి దుబాయికి వచ్చి స్థిరపడిన రెండేళ్ళకి 2015 ఏప్రిల్లో నా పోలాండ్ అనుభవాలతో కూడిన “నా ఐరోపా యాత్ర" పుస్తకాన్ని ప్రచురించాను. దుబాయ్కి వచ్చాక కూడా ఉద్యోగ నిర్వహణలో భాగంగా చుట్టుపక్కలున్న ఒమన్, కువైట్, ఖతర్ లాంటి దేశాలు కూడా తరుచూ వెళ్ళటం వల్ల అక్కడి అనుభవాలు కూడా పలు దినపత్రికల్లో రాస్తూ వచ్చాను. నాకు కొత్త ప్రదేశాలు, అక్కడి మనుషులు, వారి చరిత్ర తెలుసుకోవటం చాలా ఇష్టం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం గారు అన్నట్లు, ఏ అవసరం తీరినా తీరకపోయినా ప్రతి సంవత్సరం ఓ కొత్త దేశం చూడాలనే మా సంకల్పాన్ని మాత్రం నేనూ భార్గవీ కొనసాగిస్తూ వచ్చాము. 2016లో మా అబ్బాయి హర్ష్ పుట్టకముందు మేమిద్దరం వెళ్ళిన దేశం ఒమన్. ఆ అనుభవాలు నా ఐరోపా యాత్ర పుస్తకం అనుబంధంలో రాశాను. చాలా మంది చిన్నపిల్లలతో ప్రయాణం కష్టం అనుకుంటారు కాని హర్ష్ తో మాకెప్పుడూ ఆ ఇబ్బంది ఎదురవ్వలేదు. అలాగే పిల్లలకి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత కొత్త ప్రదేశాలకి తీసుకువెళ్ళాలి, మరీ చిన్న వాళ్ళకేం అర్థం అవుతాయి అని చాలా మంది భావిస్తారు. అదీ నిజమే, కాని ప్రతిది పిల్లల కోసమే అనుకుంటే మన వయసు అయిపోతుంది. వయసయిపోయాక చేసేవి తీర్ధ యాత్రలవుతాయి కాని విహార యాత్ర, విజ్ఞాన యాత్ర కాబోవు. పిల్లలకి అవసరమైనవి. చూసుకుంటూనే మన స్పేస్ మనం కాపాడుకోవచ్చు. అందుకే హర్ష్కి కొంచెం అవగాహన వచ్చేవరకు వెళ్ళే దేశాలన్నీ మేము చూడదగిన ప్రదేశాలుగా మాత్రమే ఉండాలని అనుకున్నాం. ఎలాగు వాడు పెద్దయ్యాక వాడికి చూడాలనిపించిన లేదా వాడు చూడదగిన దేశాలు వెళ్ళవచ్చు.
సెప్టెంబర్ 7, 2016న హర్ష్ పుట్టిన 8 నెలల తర్వాత ఎక్కడికైనా వెళ్తామని చూస్తున్నపుడు నాకు కనిపించిన దేశం అర్మీనియా. మ్యాప్లో చూసినప్పుడు ఆ దేశాన్ని ఆనుకుని మరో రెండు దేశాలు ఉన్నాయి అవే అజర్బైజాన్ మరియూ జార్జియా. సరిగా ప్లాన్ చేసుకుంటే ఈ మూడు దేశాలు 15 రోజుల్లో చూసేయచ్చు. మూడింటికి రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ కూడా ఉంది. కాని నాకున్న ఉద్యోగ బాధ్యతల వల్ల 15 రోజులు శెలవు అంటే కష్టం. అందుకే ఈ మూడు దేశాలు సంవత్సరానికొకటి చొప్పున చూద్దామని నిర్ణయించుకున్నాం. 2017 మే లో అర్మేనియా, 2019 సెప్టెంబర్లో అజర్బేజాన్, 2021 డిసెంబర్లో జార్జియా వెళ్ళాను............
నా మాట మే 2013 న పోలాండ్ నుండి దుబాయికి వచ్చి స్థిరపడిన రెండేళ్ళకి 2015 ఏప్రిల్లో నా పోలాండ్ అనుభవాలతో కూడిన “నా ఐరోపా యాత్ర" పుస్తకాన్ని ప్రచురించాను. దుబాయ్కి వచ్చాక కూడా ఉద్యోగ నిర్వహణలో భాగంగా చుట్టుపక్కలున్న ఒమన్, కువైట్, ఖతర్ లాంటి దేశాలు కూడా తరుచూ వెళ్ళటం వల్ల అక్కడి అనుభవాలు కూడా పలు దినపత్రికల్లో రాస్తూ వచ్చాను. నాకు కొత్త ప్రదేశాలు, అక్కడి మనుషులు, వారి చరిత్ర తెలుసుకోవటం చాలా ఇష్టం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం గారు అన్నట్లు, ఏ అవసరం తీరినా తీరకపోయినా ప్రతి సంవత్సరం ఓ కొత్త దేశం చూడాలనే మా సంకల్పాన్ని మాత్రం నేనూ భార్గవీ కొనసాగిస్తూ వచ్చాము. 2016లో మా అబ్బాయి హర్ష్ పుట్టకముందు మేమిద్దరం వెళ్ళిన దేశం ఒమన్. ఆ అనుభవాలు నా ఐరోపా యాత్ర పుస్తకం అనుబంధంలో రాశాను. చాలా మంది చిన్నపిల్లలతో ప్రయాణం కష్టం అనుకుంటారు కాని హర్ష్ తో మాకెప్పుడూ ఆ ఇబ్బంది ఎదురవ్వలేదు. అలాగే పిల్లలకి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత కొత్త ప్రదేశాలకి తీసుకువెళ్ళాలి, మరీ చిన్న వాళ్ళకేం అర్థం అవుతాయి అని చాలా మంది భావిస్తారు. అదీ నిజమే, కాని ప్రతిది పిల్లల కోసమే అనుకుంటే మన వయసు అయిపోతుంది. వయసయిపోయాక చేసేవి తీర్ధ యాత్రలవుతాయి కాని విహార యాత్ర, విజ్ఞాన యాత్ర కాబోవు. పిల్లలకి అవసరమైనవి. చూసుకుంటూనే మన స్పేస్ మనం కాపాడుకోవచ్చు. అందుకే హర్ష్కి కొంచెం అవగాహన వచ్చేవరకు వెళ్ళే దేశాలన్నీ మేము చూడదగిన ప్రదేశాలుగా మాత్రమే ఉండాలని అనుకున్నాం. ఎలాగు వాడు పెద్దయ్యాక వాడికి చూడాలనిపించిన లేదా వాడు చూడదగిన దేశాలు వెళ్ళవచ్చు. సెప్టెంబర్ 7, 2016న హర్ష్ పుట్టిన 8 నెలల తర్వాత ఎక్కడికైనా వెళ్తామని చూస్తున్నపుడు నాకు కనిపించిన దేశం అర్మీనియా. మ్యాప్లో చూసినప్పుడు ఆ దేశాన్ని ఆనుకుని మరో రెండు దేశాలు ఉన్నాయి అవే అజర్బైజాన్ మరియూ జార్జియా. సరిగా ప్లాన్ చేసుకుంటే ఈ మూడు దేశాలు 15 రోజుల్లో చూసేయచ్చు. మూడింటికి రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ కూడా ఉంది. కాని నాకున్న ఉద్యోగ బాధ్యతల వల్ల 15 రోజులు శెలవు అంటే కష్టం. అందుకే ఈ మూడు దేశాలు సంవత్సరానికొకటి చొప్పున చూద్దామని నిర్ణయించుకున్నాం. 2017 మే లో అర్మేనియా, 2019 సెప్టెంబర్లో అజర్బేజాన్, 2021 డిసెంబర్లో జార్జియా వెళ్ళాను............© 2017,www.logili.com All Rights Reserved.