సృష్టికి పూర్వము - బ్రహ్మాండములో "ఓం"కార నాదమే - మొదటగా మారుమ్రోగిందని పెద్దల మాట. ఓంకారమును అన్ని మంత్రములకు మూలమని అన్నారు. ఓంకారముతోనే మంత్రములను ప్రారంభించినారు. అన్నింటికీ ఓంకారమే - మూలకారణమని అన్నారు. ఓంకారమును స్మరించుట, జపించుట, వినుట, పలుకుట మొదలయిన వాని వల్ల - బ్రహ్మజ్ఞానము కలుగును. కాబట్టి ఓంకారమే ప్రధానము.
ఓం స్మరణాత్ - కీర్తనాధ్యాపి శ్రవణాచ్చ జపాదపి !
బ్రహ్మ తత్ ప్రాప్యతే నిత్యం ఓమిత్యే తత్ పరయణః !!
కాబట్టి మనము - ఓంకార ప్రధాన్యమును గ్రహించి యధాశక్తిగా - ఓంకార - ఉపాసన - అభ్యాసము చేయుట యుక్తము. "ఓం స్మర" అంటే - ఓంకారమును స్మరించుమని వేదవాక్యంగా పెద్దలు చెప్పిరి.
'ఓమ్' లో అకార - మకార - బిందు నాదములనే - ఐదు దశలున్నాయని - అందువలన ఓమ్ - సూక్ష్మ పంచాక్షరి - అని అంటారు. 'ఉమా' అనే పదములో - ఓంకారం గర్భితమై ఉన్నదని కొందరి పెద్దల మాట. కావున మనము - మన నిత్య జీవితంలో - అనుష్ఠానములో - ఉపాసనలో - ఓంకారము గల మంత్రముల జపమును చేస్తూ - ఓంకార పరదేవతా అనుగ్రహమును పొందవలెనని నా విజ్ఞప్తి.
- మానాప్రగడ సరస్వతి
సృష్టికి పూర్వము - బ్రహ్మాండములో "ఓం"కార నాదమే - మొదటగా మారుమ్రోగిందని పెద్దల మాట. ఓంకారమును అన్ని మంత్రములకు మూలమని అన్నారు. ఓంకారముతోనే మంత్రములను ప్రారంభించినారు. అన్నింటికీ ఓంకారమే - మూలకారణమని అన్నారు. ఓంకారమును స్మరించుట, జపించుట, వినుట, పలుకుట మొదలయిన వాని వల్ల - బ్రహ్మజ్ఞానము కలుగును. కాబట్టి ఓంకారమే ప్రధానము. ఓం స్మరణాత్ - కీర్తనాధ్యాపి శ్రవణాచ్చ జపాదపి ! బ్రహ్మ తత్ ప్రాప్యతే నిత్యం ఓమిత్యే తత్ పరయణః !! కాబట్టి మనము - ఓంకార ప్రధాన్యమును గ్రహించి యధాశక్తిగా - ఓంకార - ఉపాసన - అభ్యాసము చేయుట యుక్తము. "ఓం స్మర" అంటే - ఓంకారమును స్మరించుమని వేదవాక్యంగా పెద్దలు చెప్పిరి. 'ఓమ్' లో అకార - మకార - బిందు నాదములనే - ఐదు దశలున్నాయని - అందువలన ఓమ్ - సూక్ష్మ పంచాక్షరి - అని అంటారు. 'ఉమా' అనే పదములో - ఓంకారం గర్భితమై ఉన్నదని కొందరి పెద్దల మాట. కావున మనము - మన నిత్య జీవితంలో - అనుష్ఠానములో - ఉపాసనలో - ఓంకారము గల మంత్రముల జపమును చేస్తూ - ఓంకార పరదేవతా అనుగ్రహమును పొందవలెనని నా విజ్ఞప్తి. - మానాప్రగడ సరస్వతి© 2017,www.logili.com All Rights Reserved.