కలియుగంలో ప్రత్యక్ష ఫలితాలనిచ్చే దేవుళ్లలో గణపతి ముఖ్యమైనవాడు. గణపతి ఎన్నో రూపాలతో ఎన్నోరకాలుగా ఉపాసించబడుతున్నాడు. ఈ గణపతి ఉపాసనల్లో చాలా ప్రత్యకమైనది ఎంతో వైవిధ్యమైనది ఉచ్చిష్ట గణపతి ఉపాసన. ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. గణపతికి నివేదించిన తాంబూలాన్ని కానీ, ఉండ్రాళ్ళను కానీ నములుతూ ఈ మంత్ర జపం చేయాలి. ఇదే ఈ మంత్ర జపంలోని విశేషం. అయితే కొందరు ఈ మంత్రంలో ఉన్న 'పిశాచి' అన్న శబ్దాన్ని చూసి ఈ మంత్రం వామాచారానికి సంబంధించినదని, ఈ మంత్ర జపం చేసిన వారికి పిశాచరూపం వస్తుందని చెబుతారు. అది అసత్యం. ఉచ్చిష్టగణపతి 32 ప్రధాన గణపతుల్లో ఒకడిగా చెప్పబడ్డ దేవుడు. ఇక్కడ'పిశాచి' అంటే మనం అనుకునే భూతప్రేత పిశాచాల్లోని పిశాచి కాదు. అమరకోశం. 'పిశాచో గుహ్యకస్సిద్ధో భూతో మీ దేవయోనయః' అనగా పిశాచులు,గుహ్యకులు, సిద్ధులు, భూతాలు అనేవారు దేవయోనులు అని చెబుతుంది. దీని ప్రకారం చూస్తే దేవతలలో ఒక వర్గంవారైన పిశాచుల చేత ప్రధానంగా పూజింపబడేవాడు ఈ ఉచ్చిష్టగణపతి అని భావించవచ్చు.
- జయంతి చక్రవర్తి
కలియుగంలో ప్రత్యక్ష ఫలితాలనిచ్చే దేవుళ్లలో గణపతి ముఖ్యమైనవాడు. గణపతి ఎన్నో రూపాలతో ఎన్నోరకాలుగా ఉపాసించబడుతున్నాడు. ఈ గణపతి ఉపాసనల్లో చాలా ప్రత్యకమైనది ఎంతో వైవిధ్యమైనది ఉచ్చిష్ట గణపతి ఉపాసన. ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. గణపతికి నివేదించిన తాంబూలాన్ని కానీ, ఉండ్రాళ్ళను కానీ నములుతూ ఈ మంత్ర జపం చేయాలి. ఇదే ఈ మంత్ర జపంలోని విశేషం. అయితే కొందరు ఈ మంత్రంలో ఉన్న 'పిశాచి' అన్న శబ్దాన్ని చూసి ఈ మంత్రం వామాచారానికి సంబంధించినదని, ఈ మంత్ర జపం చేసిన వారికి పిశాచరూపం వస్తుందని చెబుతారు. అది అసత్యం. ఉచ్చిష్టగణపతి 32 ప్రధాన గణపతుల్లో ఒకడిగా చెప్పబడ్డ దేవుడు. ఇక్కడ'పిశాచి' అంటే మనం అనుకునే భూతప్రేత పిశాచాల్లోని పిశాచి కాదు. అమరకోశం. 'పిశాచో గుహ్యకస్సిద్ధో భూతో మీ దేవయోనయః' అనగా పిశాచులు,గుహ్యకులు, సిద్ధులు, భూతాలు అనేవారు దేవయోనులు అని చెబుతుంది. దీని ప్రకారం చూస్తే దేవతలలో ఒక వర్గంవారైన పిశాచుల చేత ప్రధానంగా పూజింపబడేవాడు ఈ ఉచ్చిష్టగణపతి అని భావించవచ్చు. - జయంతి చక్రవర్తిUcchista ganapati
© 2017,www.logili.com All Rights Reserved.