దుఃఖంతో ధైర్యం నశిస్తుంది. దుఃఖం మంచిచెడులను ఆలోచించనీయదు. దుఃఖం వల్ల సర్వాన్నీ కోల్పోతాం. దుఃఖంలాంటి శత్రువు లోకంలో లేడుగాక లేడంటారు పెద్దలు. అలాంటి శత్రువుని ఎదుర్కొనేటట్టు చేయడం, నవ్వించడం సరసిగారు బాధ్యతగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను ఒకరు వేలెత్తి చూపించకుండా నిర్వర్తిస్తున్నారు. ఎక్కువగా మాట్లాడటం ఎవరికీ యోగ్యం కాదు. అలాగే కార్టూన్ కూడా ఎక్కువగా మాట్లాడకూడదంటారు పెద్దలు.
ప్రతిరోజూ వినయవిధేయతలతో ఎవరైతే ముసలివారి బాగోగులు చూస్తూ ఉంటారో వారి విద్య, పేరు ప్రతిష్ఠలు, ఆయుష్షు, బలం పెరుగుతాయి. అంతేకాదు, ఆ వ్యక్తి జీవితం కూడా అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తుందని దీని అర్థం. వృద్ధురాలైన తల్లిగారంటే సరసికి చెప్పలేనంత ప్రేమ. ఆమెకు సేవలు చేస్తూ, ఆమె కోరికలు తీర్చడంలో మహదానందం పొందుతున్నారాయన. ఈ మనమీదేనర్రోయ్ పుస్తకం వారికే అంకితం అని నాకు చెప్పారు. సంతోషించాను. అమ్మ ఋణం ఇలా తీర్చుకుంటున్నందుకు మరోసారి సరసిని అభినందిస్తూ...
- జగన్నాథ శర్మ
దుఃఖంతో ధైర్యం నశిస్తుంది. దుఃఖం మంచిచెడులను ఆలోచించనీయదు. దుఃఖం వల్ల సర్వాన్నీ కోల్పోతాం. దుఃఖంలాంటి శత్రువు లోకంలో లేడుగాక లేడంటారు పెద్దలు. అలాంటి శత్రువుని ఎదుర్కొనేటట్టు చేయడం, నవ్వించడం సరసిగారు బాధ్యతగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను ఒకరు వేలెత్తి చూపించకుండా నిర్వర్తిస్తున్నారు. ఎక్కువగా మాట్లాడటం ఎవరికీ యోగ్యం కాదు. అలాగే కార్టూన్ కూడా ఎక్కువగా మాట్లాడకూడదంటారు పెద్దలు. ప్రతిరోజూ వినయవిధేయతలతో ఎవరైతే ముసలివారి బాగోగులు చూస్తూ ఉంటారో వారి విద్య, పేరు ప్రతిష్ఠలు, ఆయుష్షు, బలం పెరుగుతాయి. అంతేకాదు, ఆ వ్యక్తి జీవితం కూడా అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తుందని దీని అర్థం. వృద్ధురాలైన తల్లిగారంటే సరసికి చెప్పలేనంత ప్రేమ. ఆమెకు సేవలు చేస్తూ, ఆమె కోరికలు తీర్చడంలో మహదానందం పొందుతున్నారాయన. ఈ మనమీదేనర్రోయ్ పుస్తకం వారికే అంకితం అని నాకు చెప్పారు. సంతోషించాను. అమ్మ ఋణం ఇలా తీర్చుకుంటున్నందుకు మరోసారి సరసిని అభినందిస్తూ... - జగన్నాథ శర్మ© 2017,www.logili.com All Rights Reserved.