కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్ చూడండి. ఓ పిల్లకోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్దాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపొతే అవి ఉత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించాగలం.
చలం కథల్లో విలన్ సంఘం, కమ్యూనిస్టుల కథల్లో విలన్ కాపిటలిజం, కాని ఈనాటి రచయితల కథల్లో విలన్ లేదు. హీరోయే విలన్, అందుకని ఏ ఆశలేదు. సంఘం మారవొచ్చు. ఆర్ధిక విధానం మారవొచ్చు. కాని మానవుడు మారతాడనే ఆశలేదు ఈ కథల్లో.
- చలం
కథకి గొప్పతనం పట్టాలంటే, కథ చిత్రించే జీవితం భూమి నుండి పైకి లేవాలి. అన్ని గొప్ప కథలూ, గ్రంథాలూ అంతే, ఇలియడ్ చూడండి. ఓ పిల్లకోసం గుంటూరు జిల్లా అంత లేని రెండు దేశాలు కొట్టుకున్నాయి. కాని కవి చేతుల్లో అవి దేవాసుర యుద్దాల్ని మించాయి. నా కథల నిండా కాముకత్వం పులుముకుని ఉంటుంది. కాని వాటికెంత విశాలత్వం పట్టిందో చూడండి. కాకపొతే అవి ఉత్త ప్రబంధ కథలయ్యేవి. మానవ తత్వాన్నే నిరూపిస్తే నేను, ఏ నాలుగు కథలో రాయగలను. కాని కథని పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టామా, ఒక్క స్వర్గాన్నే అనంతంగా అనేక విధాల ఆలపించాగలం. చలం కథల్లో విలన్ సంఘం, కమ్యూనిస్టుల కథల్లో విలన్ కాపిటలిజం, కాని ఈనాటి రచయితల కథల్లో విలన్ లేదు. హీరోయే విలన్, అందుకని ఏ ఆశలేదు. సంఘం మారవొచ్చు. ఆర్ధిక విధానం మారవొచ్చు. కాని మానవుడు మారతాడనే ఆశలేదు ఈ కథల్లో. - చలం© 2017,www.logili.com All Rights Reserved.