ఈ గ్రంథమును రచింపవలెనను సంకల్పము, శ్రీ శ్రీనివాసుడే కల్గించి నిర్వహించి నాడు. చిరంజీవి శ్రీ జి. మల్లికార్జునశర్మగారు నిరంతరము నాతో గృహశాంతుల నిమిత్తముగ తిరుగుచున్నపుడు ఈ ప్రయత్నము ప్రారంభమైనది. తొలుత మంత్ర
భాగము, తంత్రవిధి తయారు చేసి పరిష్కరించుటకు బ్రహ్మశ్రీ జోస్యం జనార్దన శాస్త్రిగారికి పంపితిని. వారు ఆశీర్వదించుచు కొన్ని ప్రశ్నలను నా ముందుంచిరి. వాటిని గుర్తించి సమాధానము చెప్పి ఆ ప్రశ్నోత్తరములను ఇందు చేర్పితిని. అవి పాఠశాలకు చాలా ఉపయోగముగ వుండునని నా భావన. ఇట్లు ఈ గ్రంధమునకు విలువను పెంచిన వే||బ్ర||శ్రీ || జనార్దనశాస్త్రిగారికి హృదయపూర్వక నమస్కారములు.
ఈ గ్రంధ రచనా సమయమున నాకీస్మార్తవైదిక ప్రయోగ విధాన శిక్షణ గరిపిన కీర్తిశేషులు వే||బ్ర||శ్రీ|| కళ్లే నరసింహశాస్త్రిగారికిని, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు నమశ్శతములు.
నిరంతరము నాతో సంచరించు నా తమ్ముడు చి|| మాడ్గుల సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి నా శుభాశీస్సులు.
ఈ గ్రంధము వ్రాయుటలో నాకు నిరంతరము ప్రోత్సహము కల్గించిన సుప్రసిద్ధ వైదిక పండితులు, సంస్కృతోపన్యాసకులు వే||బ|| శ్రీ || బాలవిశ్వనాథశర్మగారికి హృదయపూర్వక ధన్యవాదములు. వారు నాకు మార్గదర్శకులై గ్రంధమును వ్రాయించినారు. వారి రుణము మాటలలో తీర్చుకోజాలము, ముద్రణ విషయ మెరుగని నాకు తిరుమల తిరుపతి దేవస్థానము ప్రచురణలకై ఆర్థిక సహాయము చేయునని తెలిపి అమూల్యమైన అభిప్రాయ ప్రవేశికలు రచించిన ఆచార్య శలాక రఘునాథ శర్మగారికి, బ్రహ్మానందముగారికి వయోవృద్ధుడనైనందున మనసార శుభాశీస్సులు తెలుపుచున్నాను.
ఈ గ్రంథమును రచింపవలెనను సంకల్పము, శ్రీ శ్రీనివాసుడే కల్గించి నిర్వహించి నాడు. చిరంజీవి శ్రీ జి. మల్లికార్జునశర్మగారు నిరంతరము నాతో గృహశాంతుల నిమిత్తముగ తిరుగుచున్నపుడు ఈ ప్రయత్నము ప్రారంభమైనది. తొలుత మంత్ర భాగము, తంత్రవిధి తయారు చేసి పరిష్కరించుటకు బ్రహ్మశ్రీ జోస్యం జనార్దన శాస్త్రిగారికి పంపితిని. వారు ఆశీర్వదించుచు కొన్ని ప్రశ్నలను నా ముందుంచిరి. వాటిని గుర్తించి సమాధానము చెప్పి ఆ ప్రశ్నోత్తరములను ఇందు చేర్పితిని. అవి పాఠశాలకు చాలా ఉపయోగముగ వుండునని నా భావన. ఇట్లు ఈ గ్రంధమునకు విలువను పెంచిన వే||బ్ర||శ్రీ || జనార్దనశాస్త్రిగారికి హృదయపూర్వక నమస్కారములు. ఈ గ్రంధ రచనా సమయమున నాకీస్మార్తవైదిక ప్రయోగ విధాన శిక్షణ గరిపిన కీర్తిశేషులు వే||బ్ర||శ్రీ|| కళ్లే నరసింహశాస్త్రిగారికిని, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు నమశ్శతములు. నిరంతరము నాతో సంచరించు నా తమ్ముడు చి|| మాడ్గుల సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి నా శుభాశీస్సులు. ఈ గ్రంధము వ్రాయుటలో నాకు నిరంతరము ప్రోత్సహము కల్గించిన సుప్రసిద్ధ వైదిక పండితులు, సంస్కృతోపన్యాసకులు వే||బ|| శ్రీ || బాలవిశ్వనాథశర్మగారికి హృదయపూర్వక ధన్యవాదములు. వారు నాకు మార్గదర్శకులై గ్రంధమును వ్రాయించినారు. వారి రుణము మాటలలో తీర్చుకోజాలము, ముద్రణ విషయ మెరుగని నాకు తిరుమల తిరుపతి దేవస్థానము ప్రచురణలకై ఆర్థిక సహాయము చేయునని తెలిపి అమూల్యమైన అభిప్రాయ ప్రవేశికలు రచించిన ఆచార్య శలాక రఘునాథ శర్మగారికి, బ్రహ్మానందముగారికి వయోవృద్ధుడనైనందున మనసార శుభాశీస్సులు తెలుపుచున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.