జ్యోతిషం లోకోపయుక్తమైన శాస్త్రం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జగమెరిగిన సత్యం. ఈ శాస్త్రానికున్న మూలాలు, ఈ శాస్త్ర ప్రభావంతో ఏర్పడిన ఆచార వ్యవహారాలు, సాహిత్యంలోని కథలు, జానపదుల సామెతలు, పండుగలలోని జ్యోతిష పరమార్థాలు లోతుగా అధ్యయనం చేస్తే గాని అర్థం కానివి. అర్థం చేసుకున్న తరువాత దీని వెనుక నున్న వైజ్ఞానిక సంపత్తిని, మన పూర్వులు ఈ జ్ఞానం లోకానికి అందాలని పడిన తాపత్రయాన్ని చూస్తే నిజంగా ఈ శాస్త్ర అధ్యయనపరులుగాని, దీని ప్రకారంగా జీవితాన్ని, కార్యక్రమాలను నడుపుకునే వారుగాని ఎంత అదృష్టవంతులోననిపిస్తుంది.
మా తాతగార్లు జ్యోతిష, వైదిక విషయాలలో పండితులు. మా నాన్నగారు శ్రీ జానకిరామశర్మగారే నాకు ఈ జ్యోతిష విషయాలను చిన్నప్పుడు పరిచయం చేసినవారు. వారు అందించిన ప్రాథమిక జ్ఞానం తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిషం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసినప్పుడు బలపడింది. ఇతర సంస్థల ద్వారా జ్యోతిష ప్రవీణ, జ్యోతిష విశారద పరీక్షలలో విజయం సాధించినపుడు అది మరింత చేరువైంది. నేను
ప్రాథమికంగా సాహిత్య విద్యార్థిని కూడా కావడం వల్ల జానపదుల జ్యోతిష విజ్ఞానం అనే పుస్తకం వ్రాస్తే దాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ జానపద విజ్ఞాన పరిషత్తు వారు ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతిని 1996లో ఇచ్చారు. పరిశోధనాంశంగా ప్రాచీనాంధ్రసాహిత్యంలో జ్యోతిష విజ్ఞానం అనే అంశంతో మొదటి సారిగా సాహిత్యానికి మూలమైన జ్యోతిస్సులను గూర్చి సిద్ధాంతవ్యాసం వ్రాసినాను.
జ్యోతిషం లోకోపయుక్తమైన శాస్త్రం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జగమెరిగిన సత్యం. ఈ శాస్త్రానికున్న మూలాలు, ఈ శాస్త్ర ప్రభావంతో ఏర్పడిన ఆచార వ్యవహారాలు, సాహిత్యంలోని కథలు, జానపదుల సామెతలు, పండుగలలోని జ్యోతిష పరమార్థాలు లోతుగా అధ్యయనం చేస్తే గాని అర్థం కానివి. అర్థం చేసుకున్న తరువాత దీని వెనుక నున్న వైజ్ఞానిక సంపత్తిని, మన పూర్వులు ఈ జ్ఞానం లోకానికి అందాలని పడిన తాపత్రయాన్ని చూస్తే నిజంగా ఈ శాస్త్ర అధ్యయనపరులుగాని, దీని ప్రకారంగా జీవితాన్ని, కార్యక్రమాలను నడుపుకునే వారుగాని ఎంత అదృష్టవంతులోననిపిస్తుంది. మా తాతగార్లు జ్యోతిష, వైదిక విషయాలలో పండితులు. మా నాన్నగారు శ్రీ జానకిరామశర్మగారే నాకు ఈ జ్యోతిష విషయాలను చిన్నప్పుడు పరిచయం చేసినవారు. వారు అందించిన ప్రాథమిక జ్ఞానం తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిషం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసినప్పుడు బలపడింది. ఇతర సంస్థల ద్వారా జ్యోతిష ప్రవీణ, జ్యోతిష విశారద పరీక్షలలో విజయం సాధించినపుడు అది మరింత చేరువైంది. నేను ప్రాథమికంగా సాహిత్య విద్యార్థిని కూడా కావడం వల్ల జానపదుల జ్యోతిష విజ్ఞానం అనే పుస్తకం వ్రాస్తే దాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ జానపద విజ్ఞాన పరిషత్తు వారు ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన బహుమతిని 1996లో ఇచ్చారు. పరిశోధనాంశంగా ప్రాచీనాంధ్రసాహిత్యంలో జ్యోతిష విజ్ఞానం అనే అంశంతో మొదటి సారిగా సాహిత్యానికి మూలమైన జ్యోతిస్సులను గూర్చి సిద్ధాంతవ్యాసం వ్రాసినాను.
© 2017,www.logili.com All Rights Reserved.