భారతీయ జ్యోతిషం అంతా కర్మసిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. జీవి పుట్టుక వారివారి పూర్వకర్మలను అనుసరించి మాత్రమే ఉంటుందనేది భారతీయ జీవితం. ఒక కుటుంబం, ఒక రూపం, ఆర్థిక, సామాజిక స్థితిగతులతో పాటు ఆరోగ్యం కూడా పూర్వకర్మానుసారమే. ---
ఒక మొక్కను నాటి నీరు పోసిన ప్రదేశంలోనే, నీరు పోసిన కాలంలోనే ఏ వృక్షమూ పుష్పించదు, ఫలించదు. ఆ మొక్కను బట్టి ఫలనానికి సమయం ఉంటుంది. వేరు దగ్గర నీరు పోస్తే ఎక్కడో ఆకుల మధ్యలో ఫలనం ఉంటుంది. అర్థమయ్యేది ఏమిటంటే ఒక కర్మ ఏదైనా మనం చేస్తే దానికి వెంటనే ఫలితం ఉండకపోవచ్చు. తీవ్రమైన కర్మలకు మాత్రమే వెంటనే ఫలితం ఉంటుం దనేది ప్రాచీన గ్రంథాలు చెప్తున్న వాస్తవం. (అత్యుత్కటై పుణ్యపాపై: ఇహైవ ఫలమశ్నుతే). వేప చెట్టు పెట్టి మామిడి పండ్లకోసం ఎదురుచూడడం కూడా కుదరదు. ఈ భావాల సారాంశం ఏమిటంటే గతకాలంలో మనోవాక్కాయాలతో చేసిన దృఢకర్మల ఫలితమే నేటి జీవితం. అప్పటికాలంలోని వేరు వేరు ఆలోచనలు, మాటలు, పనుల వల్లనే ఈ జన్మలో మనకు గుణదోషాలు కలుగుతుంటాయి. పూర్వకర్మల్లో మనం ప్రకృతికి, సమాజానికి, పశుపక్ష్యాదులకు పెట్టిన ఇబ్బందుల వల్లనే ప్రస్తుతం మళ్ళీ వేరు వేరు రూపాల్లో సమస్యలను ఎదుర్కొంటాం. గత కర్మల్లో చేసిన ఆలోచనలు, కర్మలు, సంకల్పాలు, కోరికలు అన్నీ ప్రస్తుత కాలంలో ఫలనానికి వస్తుంటాయి. అందుకే ఏ కర్మ ఏవిధంగా, ఎప్పుడు జరుగుతుందో అర్థం కాక 'అదృష్టం', 'దురదృష్టం' అంటూ అందరం భావిస్తుంటాం. ఆ కర్మలను ముందుగా గుర్తించగలిగితే...?
భారతీయ జ్యోతిషం అంతా కర్మసిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. జీవి పుట్టుక వారివారి పూర్వకర్మలను అనుసరించి మాత్రమే ఉంటుందనేది భారతీయ జీవితం. ఒక కుటుంబం, ఒక రూపం, ఆర్థిక, సామాజిక స్థితిగతులతో పాటు ఆరోగ్యం కూడా పూర్వకర్మానుసారమే. --- ఒక మొక్కను నాటి నీరు పోసిన ప్రదేశంలోనే, నీరు పోసిన కాలంలోనే ఏ వృక్షమూ పుష్పించదు, ఫలించదు. ఆ మొక్కను బట్టి ఫలనానికి సమయం ఉంటుంది. వేరు దగ్గర నీరు పోస్తే ఎక్కడో ఆకుల మధ్యలో ఫలనం ఉంటుంది. అర్థమయ్యేది ఏమిటంటే ఒక కర్మ ఏదైనా మనం చేస్తే దానికి వెంటనే ఫలితం ఉండకపోవచ్చు. తీవ్రమైన కర్మలకు మాత్రమే వెంటనే ఫలితం ఉంటుం దనేది ప్రాచీన గ్రంథాలు చెప్తున్న వాస్తవం. (అత్యుత్కటై పుణ్యపాపై: ఇహైవ ఫలమశ్నుతే). వేప చెట్టు పెట్టి మామిడి పండ్లకోసం ఎదురుచూడడం కూడా కుదరదు. ఈ భావాల సారాంశం ఏమిటంటే గతకాలంలో మనోవాక్కాయాలతో చేసిన దృఢకర్మల ఫలితమే నేటి జీవితం. అప్పటికాలంలోని వేరు వేరు ఆలోచనలు, మాటలు, పనుల వల్లనే ఈ జన్మలో మనకు గుణదోషాలు కలుగుతుంటాయి. పూర్వకర్మల్లో మనం ప్రకృతికి, సమాజానికి, పశుపక్ష్యాదులకు పెట్టిన ఇబ్బందుల వల్లనే ప్రస్తుతం మళ్ళీ వేరు వేరు రూపాల్లో సమస్యలను ఎదుర్కొంటాం. గత కర్మల్లో చేసిన ఆలోచనలు, కర్మలు, సంకల్పాలు, కోరికలు అన్నీ ప్రస్తుత కాలంలో ఫలనానికి వస్తుంటాయి. అందుకే ఏ కర్మ ఏవిధంగా, ఎప్పుడు జరుగుతుందో అర్థం కాక 'అదృష్టం', 'దురదృష్టం' అంటూ అందరం భావిస్తుంటాం. ఆ కర్మలను ముందుగా గుర్తించగలిగితే...?© 2017,www.logili.com All Rights Reserved.