ముహూర్త చింతామణి యను ముహూర గ్రంథమును ప్రముఖ జ్యోతిర్విదులు శ్రీ శ్రీరామదైవజ్ఞులు రచించిరి. ఈ గ్రంథమునకు సుప్రసిద్ధ జ్యోతిష పండితులు, బహుగ్రంథ పరిశీలకులు అగు శ్రీ గోవింద దేవజులు పీయూషధారయను వ్యాఖ్యాన మును రచించిరి.
ముహూర్త చింతామణి గ్రంథమును నేను “వాచస్పతి, జ్యోతిర్విజ్ఞాన భాస్కర, వాస్తుకళానిధి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ ఇత్యాది బిరుదాంకి తులు, సువర్ణాభిషేక విలసితులు, అస్మదురుచరణులు అగు బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారి వద్ద కూలంకషముగా వ్యాఖ్యానముతో సహా చదువుకొంటిని. అనేక సందేహములను తీర్చుచు వారు నాకు బోధించిన విధానము అనన్యసామాన్యమైనది. వారి పాదారవిందములకు సదా నమస్కరించుచున్నాను. వారి కరుణాకటాక్ష బలముతో చింతామణి మూలగ్రంథము నుదాహరించుచు, పీయూషధారను యథా మతిగా యథాశక్తిగా తెలుగులోనికి అనువదించితిని. ఈ రెండవ భాగమున గోచార, సంస్కార, వివాహ, నవవధూప్రవేశ, ద్విరాగమన, అగ్న్యాధాన, రాజాభిషేక, యాత్రా, వాస్తు, గృహప్రవేశ ప్రకరణములు గలవు. -
అతి విస్తృతమైన శాస్త్ర చర్చలను పాఠకుల సౌలభ్యమునకై సంగ్రహించి సారాంశమును తెలుగులోనికి అనువదించితిని. ఇందనేక ధర్మశాస్త్ర విషయములు, సూత్రగ్రంథ విషయములు, వశిష్ఠ, గర్గ, నారద, భరద్వాజ, వృద్ధ యవన, పరాశర, బాదరాయణ, వరాహమిహిరాదుల వచనములు, ఇతర జ్యోతిషగ్రంథవచనములు, సందర్భానుసారముగా చూపబడినవి.
ఈ గ్రంథము జ్యోతిష్కులకు, పురోహితులకు, జిజ్ఞాసువులకు, పండితులకు, యజమానులకు, సర్వులకు కరదీపికవంటిది.
ఈ బృహత్తర గ్రంథానువాదములో కొద్దిపాటి దోషములు నా అజ్ఞతతో దొర్లినచో సరసహృదయులగు పాఠకులు తెలియజేసినచో మలిముద్రణలో సరిచేసి కొందునని సవినయముగా తెలియజేయుచున్నాను.
ఈ గ్రంథమును ప్రచురించిన మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారికి కృతజ్ఞుడను.
- స్వస్తి -
ఇట్లు
డా. మారేపల్లి రామవీరేశ్వరశర్మ
(యం.ఆర్.వి.శర్మ)
ముహూర్త చింతామణి యను ముహూర గ్రంథమును ప్రముఖ జ్యోతిర్విదులు శ్రీ శ్రీరామదైవజ్ఞులు రచించిరి. ఈ గ్రంథమునకు సుప్రసిద్ధ జ్యోతిష పండితులు, బహుగ్రంథ పరిశీలకులు అగు శ్రీ గోవింద దేవజులు పీయూషధారయను వ్యాఖ్యాన మును రచించిరి. ముహూర్త చింతామణి గ్రంథమును నేను “వాచస్పతి, జ్యోతిర్విజ్ఞాన భాస్కర, వాస్తుకళానిధి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ ఇత్యాది బిరుదాంకి తులు, సువర్ణాభిషేక విలసితులు, అస్మదురుచరణులు అగు బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రిగారి వద్ద కూలంకషముగా వ్యాఖ్యానముతో సహా చదువుకొంటిని. అనేక సందేహములను తీర్చుచు వారు నాకు బోధించిన విధానము అనన్యసామాన్యమైనది. వారి పాదారవిందములకు సదా నమస్కరించుచున్నాను. వారి కరుణాకటాక్ష బలముతో చింతామణి మూలగ్రంథము నుదాహరించుచు, పీయూషధారను యథా మతిగా యథాశక్తిగా తెలుగులోనికి అనువదించితిని. ఈ రెండవ భాగమున గోచార, సంస్కార, వివాహ, నవవధూప్రవేశ, ద్విరాగమన, అగ్న్యాధాన, రాజాభిషేక, యాత్రా, వాస్తు, గృహప్రవేశ ప్రకరణములు గలవు. - అతి విస్తృతమైన శాస్త్ర చర్చలను పాఠకుల సౌలభ్యమునకై సంగ్రహించి సారాంశమును తెలుగులోనికి అనువదించితిని. ఇందనేక ధర్మశాస్త్ర విషయములు, సూత్రగ్రంథ విషయములు, వశిష్ఠ, గర్గ, నారద, భరద్వాజ, వృద్ధ యవన, పరాశర, బాదరాయణ, వరాహమిహిరాదుల వచనములు, ఇతర జ్యోతిషగ్రంథవచనములు, సందర్భానుసారముగా చూపబడినవి. ఈ గ్రంథము జ్యోతిష్కులకు, పురోహితులకు, జిజ్ఞాసువులకు, పండితులకు, యజమానులకు, సర్వులకు కరదీపికవంటిది. ఈ బృహత్తర గ్రంథానువాదములో కొద్దిపాటి దోషములు నా అజ్ఞతతో దొర్లినచో సరసహృదయులగు పాఠకులు తెలియజేసినచో మలిముద్రణలో సరిచేసి కొందునని సవినయముగా తెలియజేయుచున్నాను. ఈ గ్రంథమును ప్రచురించిన మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారికి కృతజ్ఞుడను. - స్వస్తి - ఇట్లు డా. మారేపల్లి రామవీరేశ్వరశర్మ (యం.ఆర్.వి.శర్మ)© 2017,www.logili.com All Rights Reserved.