ప్రాజ్ఞులకు సవినయ విజ్ఞాపనము. వంశానుక్రమమున వచ్చిన జ్యోతిశ్శాస్త్రంబును నాకు అనుగ్రహించుచు వచ్చిన ముత్తాత పాదులవారు నాకు ముహూర్త గ్రంథములను పాఠము చెప్పుటలో, “సర్వజన సులభంబుగను ఋషివచన సంమతితోడ చేసిన మనివికి సంమతించి, నాకు వచన జాతంబు నేర్పరచి యిచ్చి పాఠము జెప్పిరి. నేను చదివి గ్రహించిన అర్థవిచారంబును వ్రాయుచు వచ్చితిని. అదియే లోకోపకారకంబగు ఈ ముహూర రత్నావళి అను గ్రంథముగా ఏర్పడినది. ఇట్టి పాఠ ప్రవచనలో పడినందుననే ఈ గ్రంథము 4-5 సంవత్సరములనాడే వెలువడక ఇంత ఆలస్య ముగా ప్రకటింపబడియె. దీని సర్వ స్వాతంత్ర్యమును వహించి, చక్కని అక్షరంబులతో మంచి గద్యంబులలో ముద్రించి ప్రకటించి, మౌహూర్తిక జనులకు మిక్కిలి ప్రయోజనమును కలుగించిన బ్రహ్మశ్రీ యం.జి. సుబ్బరాయ శాస్త్రులవారు ప్రశంసనీయులై యున్నారు. పితృభక్తి గల్గి పెద్దలు చెప్పెడు సద్విషయంబులను సంగ్రహించుట శ్రేయస్కరంబని యీగ్రంథమును లిఖించుటచే లోకులకు తెలుపుచు నాకు “కోగురురధిగత తత్త్వశ్శిష్య హితా యోద్యత సృతతం” సదుపదేశంబుల నిచ్చుచు సంరక్షించుచుండెడు తీర్థ రూపులవారి చరణారవిందంబులకు నందించి, కింకరుండైయుండు వాడను. మహాత్ములు బాలకుని ప్రామాదిక దోషంబులను దయచే మన్నింతురుగాక.
ఇట్లు
సుజనవిధేయుడై విన్నవించుచుండెను
సిద్ధాంతి
సుబ్రహ్మణ్యశర్మప్రాజ్ఞులకు సవినయ విజ్ఞాపనము. వంశానుక్రమమున వచ్చిన జ్యోతిశ్శాస్త్రంబును నాకు అనుగ్రహించుచు వచ్చిన ముత్తాత పాదులవారు నాకు ముహూర్త గ్రంథములను పాఠము చెప్పుటలో, “సర్వజన సులభంబుగను ఋషివచన సంమతితోడ చేసిన మనివికి సంమతించి, నాకు వచన జాతంబు నేర్పరచి యిచ్చి పాఠము జెప్పిరి. నేను చదివి గ్రహించిన అర్థవిచారంబును వ్రాయుచు వచ్చితిని. అదియే లోకోపకారకంబగు ఈ ముహూర రత్నావళి అను గ్రంథముగా ఏర్పడినది. ఇట్టి పాఠ ప్రవచనలో పడినందుననే ఈ గ్రంథము 4-5 సంవత్సరములనాడే వెలువడక ఇంత ఆలస్య ముగా ప్రకటింపబడియె. దీని సర్వ స్వాతంత్ర్యమును వహించి, చక్కని అక్షరంబులతో మంచి గద్యంబులలో ముద్రించి ప్రకటించి, మౌహూర్తిక జనులకు మిక్కిలి ప్రయోజనమును కలుగించిన బ్రహ్మశ్రీ యం.జి. సుబ్బరాయ శాస్త్రులవారు ప్రశంసనీయులై యున్నారు. పితృభక్తి గల్గి పెద్దలు చెప్పెడు సద్విషయంబులను సంగ్రహించుట శ్రేయస్కరంబని యీగ్రంథమును లిఖించుటచే లోకులకు తెలుపుచు నాకు “కోగురురధిగత తత్త్వశ్శిష్య హితా యోద్యత సృతతం” సదుపదేశంబుల నిచ్చుచు సంరక్షించుచుండెడు తీర్థ రూపులవారి చరణారవిందంబులకు నందించి, కింకరుండైయుండు వాడను. మహాత్ములు బాలకుని ప్రామాదిక దోషంబులను దయచే మన్నింతురుగాక. ఇట్లు సుజనవిధేయుడై విన్నవించుచుండెను సిద్ధాంతి సుబ్రహ్మణ్యశర్మ
© 2017,www.logili.com All Rights Reserved.