ఈ జ్యోతిష గ్రంధము నేర్చుకునే వారి కొఱకు వ్రాసిన సైంటిఫిక్ సిరీస్ లో మూడవది. ముఖ్యమైనది కూడా. దీనిలో అనేక క్రొత్త విషయాలు పరిశోధింపబడినది. పరిచయం చేయబడినాయి. రెండవ భావం ఈ గ్రంధానికే హైలైటు. మొత్తం కేంద్రీకరణ ఆభావం పై ఉంచి పరిహార క్రియలతో సహా (రెమిడీస్) వ్రాశాను. దీనిలో పరిచయం చేసిన నవ ద్వాదశాంశ చక్రం ఈ గ్రంథానికి తలమాణిక్యం వంటిది. అంతేగాక భాగ్యఫార్చూన ధన లాభ ఫార్చనాలను క్రొత్తగా పరిచయం చేసి ధన యోగం నిర్ణయించడమెలాగో చెప్పేను. 3వ భావంలో ద్రేక్కాణనవాంశ చక్రం పరిచయం చేశాను. జన్మకాలం లేని కేసులలో జాతకాలు స్వర లగ్నంతో వేసే పద్ధతిని ఒక ప్రత్యేక అధ్యాయంగా వ్రాసి చేర్చడం జరిగింది. అష్టక వర్గుకు క్రొత్త రూపం ఈ గ్రంథం లో దర్శన మిస్తుంది. అలాగే సప్తాంశ ద్వారా సంతానవిచారం క్రొత్త పద్ధతిలో చెప్పేను. సుమారు 150 ప్రత్యేక యోగ బిందువులను ప్రవేశ పెట్టిన గ్రంథమిదేనంటే అతిశయోక్తి లేదనుకుంటాను.
- శివల సుబ్రహ్మణ్యం