వీళ్ళే చుట్టాలు
'పరమేశానికి సీరియస్ గా వుందిట. టెలిగ్రాం ఇచ్చేడు వాళ్లబ్బాయి' అంటూ చెప్పేడు సుబ్రహ్మణ్యం, ఆఫీసు నించి వచ్చిన అరగంటకి తాపీగా వాలుకుర్చీలో కూర్చుని, కబుర్లు చెప్పటానికి దగ్గర చేరిన పెళ్లాంతో,
భానుమతి మొహంలో ప్రసన్నత ఇట్టే ఆవిరయింది.
...మీ అక్క మొగుడేనా? ఆ మధ్య ఏదో నలత చేసిందన్నారు గదూ?
“అవును. అప్పుడు పదిహేను రోజుల్లోనే కోలుకున్నాడు. ఆ జబ్బే! మళ్లీ తిరగబెట్టిందిట...
'రమ్మంటారా మిమ్మల్ని వున్న పాళంగా?”
"స్టార్ట్ ఇమ్మీడియట్లే' అంటే మరి అర్థమేమిటిట?”
భానుమతి అక్కడి నించి విసవిసా కిటికీ దగ్గరికి నడిచిపోయింది. చెంగు జాడించి. రైలాటలో కుర్రాళ్లా ఆ చెంగు పట్టుకుని వెనకాలే వెళ్లాడు సుబ్రహ్మణ్యం. భానుమతి చెంగు వదలని కసర్లేదుగాని కళ్లెర్రజేసి చూసింది
మొగుణ్ణి. అతగాడు హడిలిపోయేడు. పోడూ, మరి? అలా చూసిందంటే రాత్రి అన్నం పెట్టినప్పుడు మజ్జిగలో చెంబెడు నీళ్లు ఒంపేస్తుంది! కూరలో డబ్బాడు కారం దిమ్మరిస్తుంది! ఇంకేం చెయ్యాలో అన్నీ చేసేస్తుంది. రాత్రి - శయ్యాగృహంలో - అనుగ్రహించనే అనుగ్రహించదని వేరే చెప్పక్కర్లేదు...............
వీళ్ళే చుట్టాలు 'పరమేశానికి సీరియస్ గా వుందిట. టెలిగ్రాం ఇచ్చేడు వాళ్లబ్బాయి' అంటూ చెప్పేడు సుబ్రహ్మణ్యం, ఆఫీసు నించి వచ్చిన అరగంటకి తాపీగా వాలుకుర్చీలో కూర్చుని, కబుర్లు చెప్పటానికి దగ్గర చేరిన పెళ్లాంతో, భానుమతి మొహంలో ప్రసన్నత ఇట్టే ఆవిరయింది. ...మీ అక్క మొగుడేనా? ఆ మధ్య ఏదో నలత చేసిందన్నారు గదూ? “అవును. అప్పుడు పదిహేను రోజుల్లోనే కోలుకున్నాడు. ఆ జబ్బే! మళ్లీ తిరగబెట్టిందిట... 'రమ్మంటారా మిమ్మల్ని వున్న పాళంగా?”"స్టార్ట్ ఇమ్మీడియట్లే' అంటే మరి అర్థమేమిటిట?” భానుమతి అక్కడి నించి విసవిసా కిటికీ దగ్గరికి నడిచిపోయింది. చెంగు జాడించి. రైలాటలో కుర్రాళ్లా ఆ చెంగు పట్టుకుని వెనకాలే వెళ్లాడు సుబ్రహ్మణ్యం. భానుమతి చెంగు వదలని కసర్లేదుగాని కళ్లెర్రజేసి చూసింది మొగుణ్ణి. అతగాడు హడిలిపోయేడు. పోడూ, మరి? అలా చూసిందంటే రాత్రి అన్నం పెట్టినప్పుడు మజ్జిగలో చెంబెడు నీళ్లు ఒంపేస్తుంది! కూరలో డబ్బాడు కారం దిమ్మరిస్తుంది! ఇంకేం చెయ్యాలో అన్నీ చేసేస్తుంది. రాత్రి - శయ్యాగృహంలో - అనుగ్రహించనే అనుగ్రహించదని వేరే చెప్పక్కర్లేదు...............© 2017,www.logili.com All Rights Reserved.