జ్యోతిష్యశాస్త్రంలో తనదంటూ ఒక ప్రత్యేక శైలి, ఒక ప్రత్యేక సిద్ధాంతం నెలకొల్పిన వారిలో శ్రీజైమిని ప్రధముడు. పరాశరమహర్షికి సమకాలీనుడని చెప్పవచ్చు. సాంప్రదాయసిద్ధమైన జ్యోతిష్యశాస్త్రంలో పరాశరుని గ్రంథాల తరువాత చాలా గ్రంధాలు రచింపబడినాయి. అలాగే, జెమినీ సిద్ధాంతంలో సూత్రాలు వెలిసిన తరువాత సాంవత్సరిక ఫలం నిర్ణయించడానికి వెలసిన “తాచక" సిద్ధాంతం తప్ప అన్యపరిశోధనాత్మకమైన పద్ధతులేవీ రాలేదు.
తిరిగి, జైమిని సిద్దాంతం లాగే తన ప్రత్యేకతను చాటుకుంటూ శ్రీకృష్ణమూర్తి పద్ధతి వెలిసింది. ఈ పద్ధతి ఒకరకంగా పరాశరీయమే కాని, జైమిని కాదు. అయితే, భావస్థితి నిర్ణయంలోను, గ్రహాలకు విషయాల పై అధికారం(Significance) నిర్ణయించడంలోను కృష్ణమూర్తిగారు క్రొత్త పంథా తొక్కారు. అలాగే, ఒక గ్రహం
నిర్ణీతమై న విషయానికి చెడు చేస్తుందా, లేక, మేలు చేస్తుందా అనే విషయం సిర్ణయించడాన్ని "సబ్"ని బట్టి నిర్ణయించాలన్న విషయం చెప్పేరు. ఈ విధంగా సాంప్రదాయాన్ని కొంత వరకు - శ్రీకృష్ణమూర్తి పద్ధతి - నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చివేసింది.
శాస్త్రాభివృద్ధి నిమిత్తం కొంతవరకు ఈ సాంప్రదాయ వ్యతిరేక ధోరణి సహించక తప్పదు. క్రొత్త పాతల మేలు కలయిక అవసరం కూడాను.అయితే, శ్రీకృష్ణమూర్తి పద్ధతిలో కూడా ఒక భావాన్ని "సబ్ బ్ లెవెల్ వరకు విభజించడంచెప్పారే గాని,ఆ"సబ్ సబొ వరకూగలఅన్ని గ్రహాల మిశ్రమ - ఫలితాన్ని ఏగ్రహం వాటికి ప్రాతినిధ్యం వహించి ఈయగలదన్న విషయం చెప్పలేదు.
ఈలోటునునావైబ్రేషన్ సిద్ధాంతం భర్తీ చేస్తుంది. ఉదాహరణకు ఒకరి సప్తమభావం తులారాశి. రాహునక్షత్రం,బుధ సబ్-రాహుసబ్లోఉంటుందని మనం లెఖ్కవేయవచ్చు. మరి శుక్ర రాహు, బుధ రాహుల మిశ్రమ ఫలితం విరి ప్రతినిధి గ్రహంఏదయితే అదిఇస్తుందని పరిశోధనలో తేలినది.
© 2017,www.logili.com All Rights Reserved.